Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టయోటా వెల్‌ఫైర్ బుకింగ్స్ షురూ: ధర 80 లక్షలు?
టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎంపీవీ లాంచ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. టయోటా ఇండియా విపణిలో ఉన్న ఇన్నోవా క్రిస్టా మోడల్‌కు పై స్థానంలో "వెల్‌ఫైర్" ఎంపీవీ మోడల్ వస్తోంది.

అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో కొంత మంది కంపెనీ డీలర్లు వెల్‌ఫైర్ ఎంపీవీ మీద అనధికారికంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు ఆటోకార్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 2020 మార్చిలో టయోటా వెల్‌ఫైర్ బుకింగ్స్ మొదలవుతాయనే వార్త కూడా ఉంది.

టయోటా వెల్‌ఫైర్ 6-సీటర్ లగ్జరీ ఎంపీవీ. భారత ప్రభుత్వం అందించే ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ఈ మోడల్‌ను పూర్తి స్థాయిలో విదేశాల్లోనే తయారు చేసి "కంప్లీట్లీ బిల్ట్ యూనిట్" (CBU)గా దిగుమతి చేసుకొని దేశీయ విపణిలో విక్రయిస్తారు.

ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసిన టయోటా వెల్‌ఫైర్ ఎంపీవీలో సాంకేతికంగా 2.5-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ కలదు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది, అదే విధంగా ఇందులోని 143హార్స్‌పవర్ కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్‌ను కలుపుకుంటే హైబ్రిడ్ ఇంజన్ మొత్తం 197బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

లెక్సస్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న లెక్సస్ NX300h మోడల్‌లో కూడా ఇదే ఇంజన్ కలదు. టయోటా వెల్‌ఫైర్‌లోని శక్తివంతమైన పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌కు అదే ఇ-సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు, ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, టయోటా వెల్‌ఫైర్ ప్రీమియం ఎంపీవీలో ఎలక్ట్రిక్-పవర్‌తో అడ్జస్ట్ చేసుకునే వీలున్న మొదటి మరియు రెండవ వరుస సీట్లు, వెనుక వైపున పవర్ స్లైడింగ్ డోర్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు సన్‌రూఫ్‌లు, మూడ్ లైటింగ్, డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్‌కు వెంటిలేటెడ్ సీట్లు ఇంకా ఎన్నో విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

టయోటా వెల్‌ఫైర్ ఎంపీవీలో భద్రత పరంగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, రియర్ పార్కింగ్ కెమెరా, 360-డిగ్రీల పార్కింగ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, లోపల అన్ని వైపులా మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు ఇంకా ఎన్నో రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్న లగ్జరీ ఎంపీవీ వెల్‍ఫైర్. అతి త్వరలో విడుదలున్న నేపథ్యంలో ఇప్పటికే డీలవర్లకు చేరుస్తున్నారు. పలు టయోటా వెల్‌ఫైర్ మోడళ్లు డీలర్ల వద్ద పట్టుబడ్డాయి. కొంత మంది డీలర్లయితే అనధికారికంగా బుకింగ్స్ కూడా మొదలుపెట్టేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టయోటా కంపెనీ తీసుకొస్తున్న వెల్‌ఫైర్ మోడల్ అత్యంత ఖరీదైనది. దీని ధర సుమారుగా రూ. 80 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ అయితే విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మరియు అతి త్వరలో విడుదల కానున్న కియా కార్నివాల్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.