వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

వోక్స్‌వ్యాగన్ ఇండియా విపణిలోకి సరికొత్త అమియో జీటీ లైన్ వేరియంట్‌ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. సరికొత్త పోలో మరియు వెంటో ఫేస్‌లిఫ్ట్ విడుదల అనంతరం వోక్స్‌వ్యాగన్ అమియో జీటీ లైన్ సెడాన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. అమియో జీటీ-లైన్ కాంపాక్ట్ సెడాన్ ధరను రూ. 9.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఖరారు చేశారు.

వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

సరికొత్త వోక్స్‌వ్యాగన్ అమియో జీటీ లైన్ వేరియంట్ హైలైన్ డీజల్ ఆటోమేటిక్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. బ్లాక్-ఫినిషింగ్ గల రూఫ్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, బూట్ లిడ్ స్పాయిలర్ మరియు కారుకు ఇరువైపులా ఉన్న జీటీ-లైన్ డీకాల్స్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. అమియో జీటీ లైన్ "సన్‌సట్ రెడ్" పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది.

వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

వోక్స్‌వ్యాగన్ అమియో జీటీ లైన్ ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అమియో రెగ్యులర్ టాప్ ఎండ్ వేరియంట్లోని ఫీచర్లు యథావిధిగా వచ్చాయి. అయితే, క్రూయిజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ & రియర్ సెంట్రల్ ఆర్మ్ రెస్ట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జెస్ట్‌మెంట్, వర్షం వస్తే ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు మరియు పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి హైలెట్‌గా నిలిచాయి.

వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ అమియో జీటీ లైన్ కాంపాక్ట్ సెడాన్ కారులో అదే మునుపటి 1.5-లీటర్ టీడీఐ డీజల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 109బీహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

వోక్స్‌వ్యాగన్ ఇండియా విభాగం ఇటీవల తమ పాపులర్ మోడళ్లయిన పోలో మరియు వెంటో కార్లలో పలు మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో జీటీ-లైన్ పేరుతో విడుదల చేసింది. వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ-లైన్ ధర రూ. 5.82 లక్షలు మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో జీటీ-లైన్ వేరియంట్ ధర రూ. 8.76 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఇండియా)గా నిర్ణయించింది.

వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

ఈ రెండు మోడళ్లలో కూడా పైన అమియో జీటీ లైన్ వేరియంట్లో పేర్కొన్న మార్పులు చోటు చేసుకున్నాయి. పోలో జీటీ లైన్ వేరియంట్లో అప్‌డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లైట్లు మరియు జీటీఐ ప్రేరణతో కొత్తగా డిజైన్ చేయబడిన హానికాంబ్ ఫ్రంట్ గ్రిల్ వచ్చాయి.

వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా స్కోడా ఆటో ఇండియా మరియు వోక్స్‌వ్యాగన్ సంస్థలు కలిసిపోయి ఏకీకృత సంస్థగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి వోక్స్‌వ్యాగన్ ఇటీవల ఓ ప్రకటనలో ప్రకటించింది. ఇరు సంస్థలు కలిసిపోయి స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియా పేరుతో ఒక కొత్త భాగస్వామ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది.

వోక్స్‌వ్యాగన్ అమియో కొత్త వేరియంట్లో విడుదల: ధర ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ అమియో కంపెనీ యొక్క పాపులర్ కాంపాక్ట్ సెడాన్. అమియో జీటీ లైన్ కొత్త వేరియంట్ విడుదలతో కొత్త కస్టమర్లను ఆకట్టుకోవాలని వోక్స్‌వ్యాగన్ భావిస్తోంది. అందులో భాగంగానే నేడు విపణిలోకి ప్రవేశపెట్టింది. వోక్స్‌వ్యాగన్ అమియో దేశీయ కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో ఉన్నటువంటి మారుతి సుజుకి డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్ మరియు హోండా అమేజ్ వంటి మోడళ్లకు సరాసరి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Volkswagen Ameo GT Line Launched In India: Priced At Rs 9.90 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X