కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో ఆవిష్కరించిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కియా సోనెట్' మైలేజ్ వివరాలు వెల్లడయ్యాయి. విడుదలైన మొదటి రోజే 6500 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకొని కంపెనీకి కాసుల వర్షం కురిపిస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధిక డిమాండ్ కలిగిన కార్లలో ఒకటిగా నిలిచింది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కాంపాక్ట్ సైజ్, స్టైలిష్ డిజైన్, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్, బెస్ట్ సేఫ్టీ, విభిన్న ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్స్, ఆకర్షనీయమైన ఇంటీరియర్స్, ఆకట్టుకు పెయింట్ స్కీమ్స్ వంటి అనేక విశిష్టమైన ఫీచర్లతో వచ్చిన కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో మొదటి చూపులోనే కస్టమర్ల మనస్సు దోచుకుంటోంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కియా మోటార్స్ అందిస్తున్న సోనెట్ కారులో దాని కొరియన్ భాగస్వామి హ్యుందాయ్ ఆఫర్ చేస్తున్న వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని ఇంజన్లనే ఉపయోగించిన సంగతి తెలిసినదే. అయితే, తాజాగా ఏఆర్ఏఐ విడుదల చేసిన సోనెట్ మైలేజ్ గణాంకాలు మాత్రం ఆశ్చర్యపరిచేలా వెన్యూ కన్నా కాస్తంత అధికంగా ఉ్ననాయి.

MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

వాహన ఆధారిత సర్వేలు నిర్వహిస్తున్న ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ప్రచురించిన వివరాల ప్రకారం, కొత్త కియా సోనెట్ మైలేజ్ వివరాలు వేరియంట్ల వారిగా ఇలా ఉన్నాయి:

-> 1.2 పెట్రోల్, 5 ఎమ్‌టి - 18.4 కెఎంపిఎల్

-> 1.0 పెట్రోల్, ఐమ్‌టి - 18.2 కెఎంపిఎల్

-> 1.0 పెట్రోల్, 7 డిసిటి - 18.3 కెఎంపిఎల్

-> 1.5 డీజిల్, 6 ఎమ్‌టి - 24.1 కెఎంపిఎల్

-> 1.5 డీజిల్, 6 ఏటి - 19.0 కెఎంపిఎల్

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కియా మోటార్స్‌కు సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మూడవ ఉత్పత్తి. కియా మోటార్స్‌కి ఇది కొత్త ఎంట్రీ లెవల్ మోడల్. కియా సెల్టోస్ తరువాత ఇది రెండవ ‘మేడ్-ఇన్-ఇండియా' ఉత్పత్తి అవుతుంది.

MOST READ: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలంటే పియూసి తప్పనిసరి: సుప్రీం కోర్ట్

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కియా సోనెట్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది, ఇందులో రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఉన్నాయి. అవి: 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్. వీటిలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.2-లీటర్ ఎన్‌ఏ పెట్రోల్ ఇంజన్‌లను హ్యుందాయ్ వెన్యూ నుండి గ్రహించారు.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

ఇకపోతే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కియా సెల్టోస్ నుండి గ్రహించారు. సోనెట్‌లోని డీజిల్ ఇంజన్ రెండు విభిన్న ట్యూన్‌లలో లభ్యం కానుంది. అన్ని ఇంజన్‌లు విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్, 7-స్పీడ్ డిసిటి మరియు 7-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.

MOST READ: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కియా సోనెట్‌లో అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఏఆర్ఏఐ విడుదల చేసిన కియా సోనెట్ మైలేజ్ వివరాలను చూస్తుంటే, ఇది ఈ సెగ్మెంట్లో బెస్ట్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ కారుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ కారు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8 - 12 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Kia Sonet Compact-SUV Mileage Deatils Revealed By ARAI: Here Are All The Details. The Kia Sonet SUV can be booked for an amount of Rs 25,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X