అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ప్రముఖ దేశీయ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారత మార్కెట్లో తమ సరికొత్త "బడా దోస్త్" లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సివి)ను విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త బడా దోస్త్ ఎల్‌సివి ప్రారంభ ధర రూ.7.75 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ముంబై)గా ఉంది.

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అశోక్ లేలాండ్ బడా దోస్త్ ఎల్‌సివి రెండు వేర్వేరు పేలోడ్ సామర్థ్యాలతో రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఐ3 అనే మోడల్ పేలోడ్ సామర్థ్యం 1,405 కిలోలు మరియు ఐ4 అనే మోడల్ పేలోడ్ సామర్థ్యం 1,860 కిలోలుగా ఉంటుంది. ప్రతి మోడల్ కూడా తిరిగి రెండు వేర్వేరు వేరియంట్లలో (ఎల్ఎస్ మరియు ఎల్ఎక్స్) అందుబాటులో ఉంటాయి. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

-> బడా దోస్త్ ఐ3 ఎల్ఎస్ : రూ.7.75 లక్షలు

-> బడా దోస్త్ ఐ3 ఎల్ఎక్స్ : రూ.7.95 లక్షలు

-> బడా దోస్త్ ఐ4 ఎల్ఎస్ : రూ.7.79 లక్షలు

-> బడా దోస్త్ ఐ4 ఎల్ఎక్స్ : రూ.7.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

భారత ఎల్‌సివి మార్కెట్‌లో దోస్త్ బ్రాండ్ సృష్టించిన బలమైన పునాదిపై కొత్త బడా డోస్త్ ఎల్‌సివి నిర్మించామని కంపెనీ తెలిపింది. విశ్వసనీయత, మైలేజ్ మరియు సౌకర్యానికి ఈ బ్రాండ్ ప్రసిద్ధి చెందిందని అశోక్ లేలాండ్ పేర్కొంది. అధునాతన టెక్నాలజీ మరియు డ్రైవర్ కంఫర్ట్ వంటి కస్టమర్-సెంట్రిక్ ఫీచర్లతో ఈ కొత్త బడా దోస్త్ ఎల్‌సివిని తయారు చేశారు.

MOST READ:700 కి.మీ ప్రయాణించినా పరీక్ష రాయడానికి నిరాకరించబడిన విద్యార్థి.. కారణం ఏంటో తెలుసా

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అశోక్ లేలాండ్ బడా దోస్త్ ఐ4 మరియు ఐ3 ఎల్‌సివి మోడళ్లు రెండూ కూడా ఒకే రకమైన ఇంజన్‌తో లభిస్తాయి. కాకపోతే, వీటి పేలోడ్ సామర్థ్యం మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఇందులో 1.5-లీటర్, త్రీ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ 3300 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 79 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1600-2400 ఆర్‌పిఎమ్ మధ్యలో 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇందులో కొత్త ఇంజన్ బెస్ట్-ఇన్-క్లాస్ పవర్ మరియు మైలేజీని అందిస్తుందని అశోక్ లేలాండ్ పేర్కొంది, ఇది వినియోగదారునికి ప్రతి ట్రిప్‌లోనూ ఎక్కువ లాభాలను ఆర్జించడంలో సహాయపడుతుందని తెలిపింది. తక్కువ టర్నింగ్ రేడియస్ మరియు బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా, అశోక్ లేలాండ్ బడా దోస్త్ ఇంటర్ మరియు ఇంట్రాసిటీ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అశోక్ లేలాండ్ బాడా డోస్త్ ఎల్‌సివిలో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ త్రీ సీట్ వాక్‌థ్రూ క్యాబిన్‌ ఉంటుంది, ఇందులో డ్రైవర్‌తో పాటుగా మరో ఇద్దరు కో ప్యాసింజర్లు కూర్చోవటానికి వీలుగా ఉంటుంది. ఫోల్డబుల్ బ్యాక్‌రెస్ట్ మరియు కోలాప్సబల్ హ్యాండ్ బ్రేక్‌లు డ్రైవర్‌కు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి.

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఎల్‌సివిలో ఎర్గోనామిక్‌గా ఉంచిన డాష్-మౌంటెడ్ గేర్ షిఫ్ట్ లివర్, డ్యూయెల్-టోన్ డాష్‌బోర్డ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. ఈ వాహనంలో పవర్ స్టీరింగ్ మరియు ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంటుంది, ఇవి సుదీర్ఘ ప్రయాణాలను మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అశోక్ లేలాండ్ బడా దోస్త్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అశోక్ లేలాండ్ బడా దోస్త్ మంచి ఉత్పాదకతతో పాటు వినియోగదారులకు అత్యుత్తమ సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. చిన్న తరహా వాణిజ్య వాహన విభాగంలో విడుదలైన బడా దోస్త్ ఎల్‌సివిలో ఇంటీరియర్‌లు కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి.

Most Read Articles

English summary
Ashok Leyland has launched the all-new Bada Dost (LCV) Light Commercial Vehicle in the Indian market. Prices for the all-new Bada Dost LCV start at Rs 7.75 lakh, ex-showroom (Mumbai). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X