Just In
- 16 min ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 54 min ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 1 hr ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 15 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
కరోనా అప్డేట్... తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు... మరో ఇద్దరు మృతి
- Sports
మ్యాచ్‌కే హైలైట్! స్టార్క్ షార్ట్ పిచ్ బంతికి.. గిల్ ఎలా సమాధానం ఇచ్చాడో చూడండి వీడియో
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో మరింత తక్కువ ధరకే లభ్యం కానున్న ఆడి ఏ4; స్థానిక ఉత్పత్తి షురూ
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ4 సెడాన్‌లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త 2021 ఆడి ఏ4 సెడాన్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడల్ కన్నా తక్కువ ధరకే లభ్యం కావచ్చని సమాచారం.

ఇందుకు ప్రధాన కారణం, ఆడి ఇండియా తమ 2021 ఏ4 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను స్థానికంగా భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న ఆడి ఇండియా ప్లాంట్‌లో ఏ4 ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ఉత్పత్తి ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త ఆడి ఏ4 ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడుతుందని, దీనికి కోసం త్వరలోనే బుకింగ్‌లు కూడా ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
MOST READ:మతిపోగొడుతున్న మోడిఫైడ్ హిందూస్తాన్ అంబాసిడర్

కొత్త 2021 ఆడి ఏ4 ఫేస్‌లిఫ్ట్‌లో చేసిన డిజైన్ మార్పుల విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు మరింత విశాలమైన హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లను కూడా కంపెనీ రీడిజైన్ చేసింది. ఆడి తన మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను ఇందులో ఆప్షనల్‌గా అందిస్తోంది.

ఇతర డిజై్న మార్పులలో సవరించిన ఫ్రంట్ బంపర్, 18ఇంచ్ ప్రీమియం అల్లాయ్ వీల్స్, ట్వీక్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:ఇల్లుగా మారిన ఇన్నోవా కారు.. చూసారా..!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త ఆడి ఏ4 ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ఇప్పుడు ఆల్-డిజిటల్ వర్చువల్ కాక్‌పిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఇతర ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం క్యాబిన్ రూపాన్ని మార్చివేసి, మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.

ఇంజన్ విషయానిక వస్తే, కొత్త ఆడి ఏ4 ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను కంపెనీ ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 2.0-లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. దీనిని 48వి మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేసే అవకాశం కూడా ఉంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.
MOST READ:సాధారణ కార్లు లగ్జరీ కార్లుగా మారాయి..ఎలాగో తెలుసా ?

ఆడి ఇండియా గడచిన సంవత్సరంలో (2020లో) కరోనా మహమ్మారి వలన ఏర్పడిన సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీ మొత్తం ఏడు కొత్త మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో ఆడి క్యూ2, క్యూ 8, ఏ8ఎల్, ఆర్‌ఎస్‌క్యూ 8 మొదలైనవి ఉన్నాయి.

కొత్తగా వస్తున్న ఆడి ఏ4 ఫేస్‌లిఫ్ట్ సెడాన్, స్థానిక ఉత్పత్తి కారణంగా ఈ విభాగంలో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, జాగ్వార్ ఎక్స్‌ఈ మరియు బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.
MOST READ:మాడిఫైడ్ బెంజ్ 600 పుల్మాన్ లిమోసిన్ : ఈ కార్ ముందు ఏ కారైనా దిగదుడుపే