Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పూనేలో ఆడి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ప్రారంభం; ప్రత్యేకతలు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి పూణేలోని హింజెవాడిలో అత్యాధునిక సర్వీస్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పూణేలో ప్రారంభించిన ఈ కొత్త స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆడి సర్వీస్ సెంటర్లో శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులచే ఒకే షిఫ్టులో రోజుకు 30 కార్లకు సర్వీస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా, ఆడి తమ అధునాతన సర్వీస్ సెంటర్‌లో అగ్రశ్రేణి పరికరాలు, సాధనాలు మరియు సాంకేతికతలను ఉపయోగించనుంది.

ఆడి ప్రారంభించిన ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీస్ సెంటర్లో మెకానికల్ జాబ్స్ కోసం 12 వర్క్ బేలు మరియు బాడీ రిపేర్ జాబ్స్ కోసం ఏడు వర్క్ బేలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పెయింట్ బూత్, వీల్ అలైన్‌మెంట్ మరియు బ్యాలెన్సింగ్ బే కూడా కలిగి ఉంటుంది. పిఎమ్‌జిఆర్ వర్క్‌షాప్, బాడీ షాప్ మరియు స్టాక్‌యార్డ్ అన్నీ ఒకే రూఫ్ క్రింద ఉంటాయి.
MOST READ:హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

ఆడి ఇండియా కస్టమర్లు సర్వీస్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవటం కోసం ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు: + 91- 86696 11118 లేదా ఆడి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు లేదా కారు సౌలభ్యం ప్రకారం కారు పికప్ మరియు డ్రాప్ చేయడానికి ‘మై ఆడి కనెక్ట్' యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు.

దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలో కస్టమర్ మరియు సిబ్బందిని సురక్షితంగా ఉంచడానికి ఆడి ఇండియా అన్ని నియమ నిబంధనలను అనుసరిస్తోంది. పూణేలోని సర్వీస్ సెంటర్లో అన్ని యాక్సెస్ పాయింట్లను సిబ్బంది రోజుకు రెండుసార్లు శుభ్రపరుస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, డెలివరీకి సిద్ధంగా ఉన్న మరియు శుభ్రపరచబడిన అన్ని కార్లు మృదువైన స్టిక్కర్లతో గుర్తించబడతాయి మరియు కాంటాక్ట్‌లెస్ డాక్యుమెంటేషన్ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి.
MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హైనెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్

ఈ విషయంపై ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ మాట్లాడుతూ, "కస్టమర్-సెంట్రిసిటీపై మా దృష్టిలో భాగంగా, వారికి అద్భుతమైన సేవా అనుభవాలను అందించడానికి అనుగుణంగా, పూణేలోని కొత్త సర్వీస్ సెంటర్‌ను మా భాగస్వామి జూబిలెంట్ మోటారువర్క్స్‌తో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఆడి ఇండియాతో పాటు మొత్తం లగ్జరీ కార్ల పరిశ్రమకు పూణే ఒక ముఖ్యమైన మార్కెట్. ఒక బ్రాండ్‌గా, మా అమ్మకాలు మరియు సేవా అడుగుజాడలను విస్తృతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము, తద్వారా నెట్‌వర్క్ పరంగా అదనపు టచ్‌పాయింట్‌లను సృష్టించడం మరియు వాటిని వినియోగదారులకు చేరువ చేయటమే మా ప్రధాన లక్ష్యం. గత కొన్ని వారాలుగా మేము ఆఫ్టర్ సేల్స్ కార్యకలాపాలలో స్థిరమైన పెరుగుదలను చూశాము. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సమగ్ర పరిష్కారాలను అందించడానికి కేవలం 3 నెలల్లోనే అన్నీ సేవలు ఒకేచోట అందేలా ఈ అధునాతన సర్వీస్ సెంటర్‌ను పూర్తిచేశామని" అన్నారు.

పూనేలో ఆడి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
పూనేలో ఆడి ఇండియా ప్రారంభించిన ఈ అధునాతన సర్వీస్ సెంటర్లో కేవలం ఒక్క రోజులోనే చాలా కార్లను సర్వీస్ చేయగల సామర్థ్యం ఉంది. కస్టమర్లు కేవలం సర్వీస్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే చాలు, మిగిలినదంతా ఆడి చూసుకుంటుంది. కస్టమర్ ఇంటి వద్ద నుండి వాహనాన్ని పిక్-అప్ చేసుకోవటం నుండి తిరిగి అదే వాహనాన్ని కస్టమర్‌కు చేరే వరకూ ఆడి ఇండియా జాగ్రత్తలు తీసుకుంటుంది.
MOST READ:ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు