భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా, భారత మార్కెట్లో విడుదల చేయనున్న ఆడి క్యూ2 ఎస్‌యూవీ కోసం అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఆడి మొట్టమొదటిసారిగా 2016లో జరిగిన జెనీవా మోటార్ షోలో తమ క్యూ2 వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది.

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

ఈ నెల ప్రారంభంలో, ఆడి తమ ఫేస్‌లిఫ్టెడ్ క్యూ2 ను యూరోపియన్ మార్కెట్లో విక్రయించబోతున్నట్లు వెల్లడించింది. అయితే, భారత్‌కు మాత్రం మునుపటి పాత వెర్షన్ క్యూ2నే రానుంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ ఆడి క్యూ2 ఇప్పట్లో భారత్‌కు వచ్చే మార్గం కనిపించడం లేదు.

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

ఈ మేరకు ఆడి ఇండియా ఇటీవలే ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది, ఇది భారత్‌లో ఆడి క్యూ2 ఎస్‌యూవీ విడుదలను ధృవీకరిస్తుంది. కాగా.. నేడు ఆడి ఇండియా తమ కొత్త ఆడి క్యూ2 కోసం బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

MOST READ:సినిమాను తలదన్నే విధంగా కదిలే ట్రక్కులో దొంగతనం [వీడియో]

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

కస్టమర్లు ఆడి క్యూ2 కారును రూ.2 లక్షల టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఇంట్లోనే కూర్చుని బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ఆడి క్యూ2 కారును బుక్ చేసుకోవచ్చు లేదా వారి ఆసక్తిని బట్టి సమీపంలోని ఆడి ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

ఈ కొత్త కారు కోసం ఆడి ఇండియా ‘పీస్ ఆఫ్ మైండ్' అనే పరిచయ ప్రయోజనాల ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా, 2 + 3 సంవత్సరాల పొడిగించిన వారంటీ మరియు 2 + 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో మొత్తం 5 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజ్ ఉంటుంది.

MOST READ:ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

ఆడి క్యూ2 కారులో ఇంజన్‌ను గమనిస్తే, ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆడి యొక్క క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ సాయంతో 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

ఆడి క్యూ2 కారు కేవలం 6.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 228 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, "ఆడి క్యూ2 కోసం బుకింగ్స్ ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరంలో ఇది మా ఐదవ ఉత్పత్తి. ఆడి క్యూ 2 భారతదేశానికి చాలా ముఖ్యమైన ఉత్పత్తి. భారత కార్ మార్కెట్లో ఓ కొత్త విభాగంలో ఆడి క్యూ2 కారును ప్రవేశపెట్టాం. ఇది లగ్జరీ ఆల్-రౌండర్, ఇది ఫీచర్లలో పెద్దది మరియు విజయవంతమైన క్యూ-ఫ్యామిలీ నుండి వస్తున్నది. ఆడి క్యూ2 అనూహ్యంగా విశాలమైనది మరియు బహుముఖమైనది. ఈ కారు పనితీరు మరియు డ్రైవింగ్ డైనమిక్స్‌ను రోజువారీ ప్రాక్టికాలిటీతో మిళితం చేస్తుంది ప్రారంభంలో ఆడి కుటుంబంలో చేరాలనుకునే యువ కొనుగోలుదారులు ఈ కారు పనితీరును చూసి ఆశ్చర్యపోతారని నాకు నమ్మకం ఉంది. పరిచయ ఆఫర్‌గా, మేము 5 సంవత్సరాల సమగ్ర సర్వీస్ కలిగి ఉన్న 'పీస్ ఆఫ్ మైండ్' ప్రయోజనాన్ని అందిస్తున్నాము. ఈ పరిచయ ఆఫర్ ఆడి క్యూ 2 యాజమాన్యాన్ని సులభతరం చేస్తుందని" అన్నారు.

MOST READ:సైడ్ కారుతో మాడిఫై చేయబడిన కాంటినెంటల్ జిటి 650 బైక్

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

"దేశంలో కొనసాగుతున్న మహమ్మారి మరియు దాని సవాళ్లు ఉన్నప్పటికీ 2020 ఆడి ఇండియాకు ఉత్తేజకరమైన సంవత్సరంగానే ఉంది. ఈ సంవత్సరంలో భారత్‌లో విడుదలైన ఆడి క్యూ8, ఆడి ఏ8 ఎల్, ఆడి ఆర్ఎస్ 7 మరియు ఆడి ఆర్ఎస్ క్యూ8 వంటి ఉత్పత్తులు మంచి ఆదరణను పొందాయి. ఆడి క్యూ2 మా పోర్ట్‌ఫోలియోకు మరో బలమైన ఉత్పత్తిగా నిలుస్తుందని మరియు ఇది మొత్తం పండుగ ఉల్లాసానికి తోడ్పడుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని" ఆయన చెప్పారు.

భారత మార్కెట్లో ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభం, వివరాలు

ఆడి క్యూ2 బుకింగ్స్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆడి క్యూ2 భారత్‌లో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ నుండి లభ్యం కానున్న అతిచిన్న ఎస్‌యూవీ. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదల కానుంది. దేశీయ మార్కెట్లో ఇది బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1, వోల్వో ఎక్స్‌సి 40 మరియు రాబోయే మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని కొత్త మోడిఫైడ్ డీజిల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Recently, Audi India released a teaser video, which confirms the upcoming launch of this Q2 SUV in the Indian market. However, Audi India today has commenced bookings for the Audi Q2. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X