ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత మార్కెట్‌కు మరో కొత్త ఎస్‌యూవీని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. గడచిన 2016 జెనీవా మోటార్ షోలో ఆడి మొట్టమొదటిసారిగా ప్రదర్శించిన క్యూ2 ఎస్‌యూవీని కంపెనీ మరికొద్ది రోజుల్లోనే భారత్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు ఆడి ఇండియా ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఆడి ఇండియా నుండి బడ్జెట్‌లో లగ్జరీ ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని కంపెనీ తమ సరికొత్త ఆడి క్యూ2 మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల ప్రారంభంలోనే, ఆడి తమ ఫేస్‌లిఫ్టెడ్ క్యూ2 మోడల్‌ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే, భారత మార్కెట్‌కు రానున్న క్యూ2 మాత్రం ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు ముందు వెర్షన్ కావచ్చని సమాచారం.

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

కొత్త ఆడి క్యూ2 ఎస్‌యూవీని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఆడి క్యూ2 వీల్‌బేస్ 2,601 మిమీ, పొడవు 4,191 మిమీ, వెడల్పు 1,794 మిమీ మరియు ఎత్తు 1,508 మిమీగా ఉంటుంది. ఈ కొలతలతో ఆడి క్యూ2 ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లభిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల కన్నా కాస్తంత పెద్దదిగా ఉండే అకాశం ఉంది.

MOST READ:ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకున్న కార్లు.. ప్రమాదంలో బయట పడిన మాజీ సిఎం చంద్రబాబు నాయుడు.. ఏం జరిగిందంటే

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఆడి క్యూ 2 రూపకల్పన చాలా సూక్ష్మంగా ఉంటుంది. దీని ముందు భాగంలో, క్యూ2 సింగిల్-ఫ్రేమ్ గ్రిల్ ఉంటుంది, ఇది కారుని కొంచెం వెడల్పుగా కనిపించేలా చేస్తుంది. ఇంకా ఇందులో కొత్త రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్‌ను కూడా ఉంటుంది. అలాగే, సిల్వర్ యాక్సెంట్స్, ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్, ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన హెడ్‌ల్యాంప్‌లతో సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఇందులోని బంపర్స్, వీల్ ఆర్చ్ మరియు రన్నింగ్ బోర్డులపై బ్లాక్ క్లాడింగ్ ఉంటుంది. ఇది కారుకి మరింత స్పోర్టీ లుక్‌ని జోడిస్తుంది. కారు వెనుక భాగంలో విశాలమైన టెయిల్‌గేట్, చదరపు ఆకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, విలక్షణమైన ఆడి లోగో మరియు బ్యాడ్జింగ్‌లు ఉంటాయి.

MOST READ:ఎంజి హెక్టర్ యానివెర్సరీ ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఆడి క్యూ2లో ప్రీమియం లెదర్ అప్‌హోలెస్ట్రీతో కూడిన స్పోర్ట్స్ సీట్లు, 10 కలర్ ఆప్షన్లతో కూడిన ఎల్ఈడి ఇంటీరియర్ లైటింగ్ ప్యాకేజ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్, 8.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఎమ్ఎమ్ఐ కంట్రోలర్ ఉన్నాయి.

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

అంతేకాకుండా, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్-వీల్-డ్రైవ్ వేరియంట్‌లకు 405 లీటర్ల బూట్ స్టోరేజ్ అలాగే, ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌కు 355 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఆడి క్యూ 2లో 12.3 ఇంచ్ వర్చువల్ కాక్‌పిట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఇంజన్ విషయానికి వస్తే, ఆడి క్యూ2 కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని ఆడి యొక్క క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది.

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఆడి క్యూ2 కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు దీని గరిష్టం వేగం గంటకు 228 కిలోమీటర్లుగా ఉంటుంది. భారత్‌లో ఆడి క్యూ2 ఎస్‌యూవీ కోసం త్వరలోనే బుకింగ్‌లు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

MOST READ:కార్ డ్రైవ్ చేసి అమ్మమ్మ ప్రాణాలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు [వీడియో]

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ రిలీజ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఆడి క్యూ2 ఎస్‌యూవీ టీజర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సరికొత్త ఆడి క్యూ2 సెప్టెంబర్ నెలలో ఎప్పుడైనా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశీయ విపమిలో ఇది బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, వోల్వో ఎక్స్‌సి40 మరియు రాబోయే మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఏ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
The Audi Q2 was first showcased at the Geneva Motor Show back in 2016. People have been eagerly waiting to get their hands on the company's smallest SUV since then. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X