ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఆడి ఇండియన్ మార్కెట్లోకి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ క్యూ8 ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఆడి ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన లగ్జరీ ఎస్‌యూవీలలోకెల్లా అత్యంత ఖరీదైన మోడల్ ఆడి క్యూ8.

కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే లభించే ఆడి క్యూ8 ఎస్‌యూవీ ధర రూ. 1.33 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. ఆడి క్యూ8 ఫోటోల మరియు విడుదల వివరాలు తెలుసుకుందాం రండి...

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఆడి క్యూ8 ఎస్‌యూవీ ఆడి ఇండియా లైనప్‌లో ఉన్న క్యూ7 ఎస్‌యూవీ పైస్థానంలో నిలిచింది. క్యూ7 ఎస్‌యూవీతో పోల్చుుకుంటే క్యూ8లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ మరియు నమ్మశక్యంగాని లగ్జరీ సదుపాయాలు వచ్చాయి.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఆడి క్యూ8 ఫ్రంట్ డిజైన్‌లో ఆడి ఎస్‌యూవీలలో సాధారణంగా వచ్చే ఫ్రంట్ గ్రిల్‌ను కాస్త లేటెస్ట్ వెర్షన్‌లో అందించారు. గ్రిల్‌కు ఇరువైపులా ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ వచ్చాయి. ఆడి బ్రాండ్ ప్రత్యేకంగా అభివృద్ది చేసిన మ్యాట్రిక్స్ ఎల్ఈడీ లైట్లు ఆప్షనల్‌ ఫీచర్ లభిస్తున్నాయి. 21-ఇంచుల అతి పెద్ద అల్లాయ్ వీల్స్ మరియు ముందు నుండి వెనుక వైపున స్లోపింగ్ రూఫ్ టాప్ డిజైన్ ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఆడి క్యూ8 రియర్ డిజైన్‌లో ఎల్ఈడీ టెయిల్ లైట్లు, వీటిని కలుపుతూ మధ్యలో పలుచటి ఎర్రటి ఎల్ఈడీ లైట్ బార్, కిందనున్న బంపర్‌లో రెండు ఎగ్జాస్ట్ పైపులు వచ్చాయి. ఆడి క్యూ8 ఓవరాల్ డిజైన్ స్పోర్టివ్ ఫీల్‌నిస్తోంది.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

కొలతల పరంగా చూస్తే ఆడి క్యూ8కు పోటీగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 మరియు మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ ఎస్‌యూవీల కంటే కాస్త చిన్నగానే ఉంటుంది. ఆడి క్యూ8 పొడవు 4,986మిమీ, వెడల్పు 1,995మిమీ, ఎత్తు 1,705మిమీ మరియు వీల్‌బేస్ 2,995మిమీలుగా ఉంది.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఆడి క్యూ8 ఇంటీరియర్‌లోకి వస్తే, విలాసవంతమైన గదిలోకి వచ్చామనే ఫీలింగ్ వస్తుంది. నిజానికి దీని ధరకు తగ్గ ఫీచర్లనే అందించింది. ఫ్రంట్ డ్యాష్‌బోర్డు మీద మూడు విభిన్న డిస్ల్పే స్క్రీన్స్ ఉన్నాయి. వీటిలో, 12.3-ఇంచుల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ మీద 10.1 -ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు క్లైమేట్ సెట్టింగ్స్ కోసం 8.6-ఇంచుల డిస్ల్పే ఉంది.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఆడి క్యూ8 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలో స్టాండర్డ్ వచ్చే ఫీచర్ల విషయానికి వస్తే, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ల సపోర్ట్ గల కనెక్టెడ్ టెక్నాలజీ, పానరొమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం గల ఫ్రంట్ సీట్లు మరియు బ్యాంగ్ & ఒలుఫ్‌సెన్ సౌండ్ సిస్టమ్ ఇంకా ఎన్నో ఫీచర్లు వచ్చాయి.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఆడి క్యూ8 ఎస్‌యూవీ 11 రకాల ఇంటీరియర్ ఆప్షన్లు మరియు విభిన్న అల్లాయ్ వీల్ డిజైన్ ఛాయిస్‌లు మరియు 9 రకాల వుడెన్ క్యాబిన్ ఆప్షన్లలో లభిస్తోంది. కస్టమర్లు తమ అభిరుచికి తగినట్లుగా ఇంటీరియర్, అల్లాయ్ వీల్ డిజైన్ మరియు వుడెన్ క్యాబిన్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

సేఫ్టీ విషయానికి వస్తే, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని కీలక సేఫ్టీ ఫీచర్లను అందించింది. అందులో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్-డిపార్చర్ వార్నింగ్, 360-డిగ్రీల కెమెరా ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

ఇంజన్ విషయానికి వస్తే, ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ సాంకేతికంగా సింగల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలను పాటించే 3.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ 48వోల్ట్స్ మైల్డ్ -హైబ్రిడ్ సిస్టమ్ ఇంజన్ సిస్టమ్ కలదు.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇంజన్ గరిష్టంగా 340బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆడి క్యూ8 గరిష్టం వేగం గంటకు 250కిలోమీటర్లు మరియు 5.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది ఆడి పేర్కొంది.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ రిలీజ్: ధర రూ. 1.33 కోట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఇండియాలో ఇప్పటి విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ క్యూ7, ఇప్పుడు దీనికి పైస్థానంలో దీనికంటే ఖరీదైన క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇండియాలో లగ్జరీ కార్ల కస్టమర్లు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు ఆడి క్యూ8ను తీసుకొచ్చింది.

ఆడి క్యూ8 లగ్జరీ ఎస్‌యూవీల విపణిలో ఉన్న రేంజ్ రోవర్ స్పోర్ట్, పోర్షే కయీన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 మరియు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Audi Q8 SUV Launched In India At Rs 1.33 Crore: The Latest Flagship SUV From The German Brand. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X