టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) నుంచి మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రానున్న కొత్త కాంపాక్ట్-ఎస్‌యూవీ "అర్బన్ క్రూయిజర్" కోసం ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ 'ఆయుష్మాన్ ఖురానా'ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్‌ను సెప్టెంబర్ 23, 2020వ తేదీన అధికారికంగా దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు టికెఎమ్ తెలిపింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం కంపెనీ ఇప్పటికే ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. కస్టమర్లు రూ.11,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న టొయోటా అధీకృత డీలర్ల ద్వారా కానీ ఈ కారుని బుక్ చేసుకోవచ్చు.

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

టొయోటా వినియోగదారులు ఈ వాహనాన్ని చూడకుండానే లేదా ధర తెలియకుండానే బ్రాండ్‌పై విశ్వాసం ఉంచి, అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని ముందస్తుగా బుక్ చేసుకున్నందుకు గానూ వారికి ఓ ప్రత్యేక బహుమతి ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెస్పెక్ట్ ప్యాకేజీలో భాగంగా కస్టమర్లకు 2 సంవత్సరాలు లేదా 20,000 కిలోమీటర్ల వరకు (ఏది ముందు ముగిస్తే అది) ఉచిత మెయింటినెన్స్‌ను అందిస్తున్నామని కంపెనీ వివరించింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:700 కి.మీ ప్రయాణించినా పరీక్ష రాయడానికి నిరాకరించబడిన విద్యార్థి.. కారణం ఏంటో తెలుసా

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

టయోటా అర్బన్ క్రూయిజర్‌తో ఈ అనుబంధం గురించి సినీ నటుడు ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ, "నా ప్రయాణం గురించి మరియు సినీ పరిశ్రమలో నేను సంపాదించిన ప్రేమ, గౌరవం గురించి ప్రజలు నన్ను అడిగినప్పుడు, నేను ఎల్లప్పుడూ 'గౌరవం అనేది నేను చేసిన దాని ఫలితం' అని చెబుతాను. అందువల్లనే, టొయోటా అర్బన్ క్రూయిజర్ యొక్క మంత్రం 'గౌరవం' (రెస్పెక్ట్) అనే ఆలోచనను కూడా నేను ప్రేమిస్తున్నాను. టొయోటా అర్బన్ క్రూయిజర్‌తో సంబంధం కలిగి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు ఈ యంగ్ అర్బన్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలను మీతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

అర్బన్ క్రూయిజర్ విషయానికి వస్తే, ఇది మారుతి సుజుకి - టొయోటా జాయింట్ వెంచర్ నుండి వస్తున్న రెండవ ఉత్పత్తి. ఈ జాయింట్ వెంచర్ నుంచి ఇప్పటికే మారుతి సుజుకి బాలెనో ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన కొత్త టొయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌ను టొయోటా విక్రయిస్తోంది.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను చూస్తుంటే దాని మొత్తం డిజైన్ మరియు సిల్హౌట్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, టొయోటా తమ స్టైల్‌లో బ్రెజ్జాను మోడిఫై చేసి, కొత్త ఫినిషింగ్‌లను జోడించింజి. ఇందులో ముందు వైపు రెండు హారిజాంటల్ గ్రిల్‌తో కూడిన కొత్త బంపర్‌ ఉంటుంది, ఈ గ్రిల్ మధ్యలో ‘టొయోటా' లోగో ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

అలాగే, ఇందులో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్లుగా మారే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ బంపర్‌పై ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్‌, సెంట్రల్ ఎయిర్ డ్యామ్, సిల్వర్ ఫినిష్‌లో కూడిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి స్టాప్ లైట్‌తో కూడిన రియర్ స్పాయిలర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇది మారుతి విటారా బ్రెజ్జాలో కనిపించినట్లుగా అదే డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, అర్బన్ క్రూయిజర్‌లోని ఇంటీరియర్స్ మాత్రం కాస్తంత ప్రీమియంగా అనిపిస్తాయి. ఇందులో ప్రీమియం బ్లాక్ / బ్రౌన్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. సైడ్ డోర్ ప్యానెల్స్‌తో పాటు రూఫ్ మొత్తం సెమీ వైట్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

అర్బన్ క్రూయిజర్‌లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా నుండి గ్రహించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్‌లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో పాటుగా బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం విటారా బ్రెజ్జాలో ఉపయోగించిన పెట్రోల్ ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించారు. ఇందులోని 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

టొయోటా అర్బన్ క్రూయిజర్ బ్రాండ్ అంబాసిడర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆయుష్మాన్ ఖురానా భారత సినీ పరిశ్రమలో మంచి సినిమాల్లో నటించిన ఇచ్చిన ప్రసిద్ధ యువ నటుడు. యూత్ ఐకాన్‌గా ఖురానాకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయుష్మాన్ ఖురానాను అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయటాన్ని చూస్తుంటే, టొయోటా యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor (TKM) today announced leading Indian actor, singer and youth icon Mr Ayushmann Khurrana as the Brand Ambassador for the all-new Toyota Urban Cruiser. The company will be launching the compact-SUV on September 23, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X