టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) నుంచి మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న కొత్త సబ్-మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ "అర్బన్ క్రూయిజర్" కోసం కంపెనీ ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసినదే. తాజాగా, ఇప్పుడు ఈ ఎస్‌యూవీ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' పేరిట టొయోటా యొక్క 'కస్టమర్ ఫస్ట్' ఫిలాసఫీ ఆధారంగా ఓ కొత్త ప్యాకేజీని ప్రకటించింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

టొయోటా వినియోగదారులు వాహనాన్ని చూడకుండా లేదా ధర తెలియకుండానే బ్రాండ్‌పై విశ్వాసం ఉంచి, అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని ముందస్తుగా బుక్ చేసుకున్నందుకు గానూ వారికి ఓ ప్రత్యేక బహుమతి ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెస్పెక్ట్ ప్యాకేజీలో భాగంగా కస్టమర్లకు 2 సంవత్సరాల లేదా 20,000 కిలోమీటర్ల వరకు (ఏది ముందు ముగిస్తే అది) ఉచిత మెయింటినెన్స్‌ను అందిస్తున్నామని కంపెనీ వివరించింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లను ప్రారంభించింది. కస్టమర్లు రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఇది ఎప్పుడైనా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మారుతి-టొయోటా జాయింట్ వెంచర్ నుండి వస్తున్న రెండవ ఉత్పత్తి ఇది.

MOST READ:భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

ఈ జాయింట్ వెంచర్ నుంచి ఇప్పటికే టొయోటా, మారుతి సుజుకి బాలెనో ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని కొత్త టొయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, ఇప్పుడు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని కంపెనీ పరిచయం చేసింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

టొయోటా అర్బన్ క్రూయిజర్ ముందు వైపు రెండు హారిజాంటల్ గ్రిల్‌తో కూడిన కొత్త బంపర్‌ ఉంటుంది, ఈ గ్రిల్ మధ్యలో ‘టొయోటా' లోగో ఉంటుంది. ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్లుగా మారే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ బంపర్‌పై ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్‌, సెంట్రల్ ఎయిర్ డ్యామ్, సిల్వర్ ఫినిష్‌లో కూడిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.

MOST READ:ఇది చూసారా.. ప్రమాదకరమైన స్థలంలో పార్కింగ్ చేయడానికి ఎగబడుతున్న ప్రజలు

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లో 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి స్టాప్ లైట్‌తో కూడిన రియర్ స్పాయిలర్ ఉన్నాయి. టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను చూస్తుంటే దాని మొత్తం డిజైన్ మరియు సిల్హౌట్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మాదిరిగానే అనిపిస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం విటారా బ్రెజ్జాలో ఉపయోగించిన పెట్రోల్ ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించారు. ఇందులోని 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

ఇక ఈ కారులోని ఇంటీరియర్స్‌ను గమనిస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్‌లో మారుతి విటారా బ్రెజ్జా మాదిరిగానే అదే డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, టొయోటా ఇంటీరియర్స్ మాత్రం మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. అర్బన్ క్రూయిజర్‌లో ప్రీమియం బ్లాక్ / బ్రౌన్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. సైడ్ డోర్ ప్యానెల్స్‌తో పాటు రూఫ్ మొత్తం సెమీ వైట్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

అర్బన్ క్రూయిజర్‌లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా నుండి గ్రహించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్‌లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో పాటుగా బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇతర ఫీచర్లలో ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్‌విఎమ్ (సైడ్ మిర్రర్స్), ఆటో ఏసి, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. లీకైన బ్రోచర్ ప్రకారం, టొయోటా అర్బన్ క్రూయిజర్ మొత్త ఆరు సింగిల్-టోన్ మరియు మూడు డ్యూయెల్-టోన్ రంగులలో లభ్యం కానుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం 'రెస్పెక్ట్ ప్యాకేజ్' - అసలేంటీ ప్యాకేజ్?

టొయోటా అర్బన్ క్రూయిజర్ రెస్పెక్ట్ ప్యాకేజీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా భారత మార్కెట్ కోసం మారుతి సుజుకి సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన స్మాల్ సైజ్ ఎస్‌యూవీ ఈ అర్బన్ క్రూయిజర్. ఈ కారుని కంపెనీ ఇంకా అధికారికంగా పూర్తిగా ఆవిష్కరించలేదు. కానీ టొయోటా కస్టమర్లు మాత్రం పూర్తిగా టొయోటా బ్రాండ్‌పై విశ్వాసం ఉంచి ఈ కారుని కొనుగోలు చేయటంపై కంపెనీ తమ కస్టమర్లకు రెస్పెక్ట్ ప్యాకేజీ క్రింద ఉచిత మెయింటినెన్స్ ఆఫర్‌ను అందిస్తోంది.

Most Read Articles

English summary
Toyota has announced a new maintenance package for customers who have pre-booked the upcoming Urban Cruiser SUV. Called the 'Respect Package', is crafted in-line with Toyota's 'Customer-First' philosophy and is initiated keeping in mind the trust & faith our loyal customers have placed on the brand. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X