కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

ప్రపంచంలో అత్యంత లగ్జరీ కార్ల విభాగంలో బెంట్లీ కార్స్ ఒకటి. ఈ విలాసవంతమైన కార్లు అధిక ధర కలిగి ఉండటం వల్ల మనదేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం UK లో బెంట్లీ కార్ల యొక్క ఉత్పత్తి నిలిపివేశారు. ఈ బెంట్లీ కార యొక్క ఉత్పత్తి ఎందుకు నిలిపివేశారు అనే దానిని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

బెంట్లీ మోటార్స్ UK లోని క్రీవ్‌లో తన తయారీ కంపెనీ నుండి ఉత్పత్తిని ప్రస్తుతం నిలిపివేసింది. కరోనావైరస్ ప్రభావం వల్ల ఈ లగ్జరీ కార్ల ఉత్పత్తి ఏప్రిల్ 20 వరకు నిలిపివేయబడినట్లు యాజమాన్యం తెలిపింది.

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

రోజు రోజుకి మరింత ఎక్కువగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వల్ల బెంట్లీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఈ వాహనాల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం వుంది. అంతే కాకుండా అవసరమైనన్ని వినియోగదారులకు అందించే అవకాశం కూడా ఉండదు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెంట్లీ సంస్థ కొన్ని రోజుల పాటు మూసివేయడం జరిగింది.

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

బెంట్లీ మోటార్స్ ఛైర్మన్ & సిఇఒ 'అడ్రియన్ హాల్‌మార్క్' మాట్లాడుతూ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

కంపెనీ కొన్ని రోజులు మూసివేయడం వల్ల డెలివరీలపై అనివార్య ప్రభావం చూపుతుందని, ఈ కారణం వల్ల కలిగే అసావుకార్యానికి మేము చింతిస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా కంపెనీ కోసం పనిచేసే శ్రామికుల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియ్రం తీసుకున్నామని ఆయన స్పష్టం చేసారు.

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కంపెనీ మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. కంపెనీలో ఉన్న క్యాంటిన్ మరియు షాపుల కార్యకలాపాలలో సురక్షితమైన మార్పులు తీసుకురావడం జరిగింది కంపెనీలో జిమ్ వంటి వాటిని కూడా మూసివేయడం జరిగింది.

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

కంపెనీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు అన్ని ఆన్‌లైన్‌లో జరుగుతాయి. కంపెనీకి సంబంధించిన అన్ని వ్యాపార కార్యకలాపాలు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లు నిలిపివేయబడ్డాయి.

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

ప్రపంచవ్యాప్తంగా ఒక్క బెంట్లీ సంస్థ మాత్రమే కాకుండా వోక్స్ వ్యాగన్ సంస్థ కూడా వివిధ దేశాలలో తమ కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం ఆయువు మొబైల్ రంగంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తివల్ల తీరని నష్టం వాటిల్లింది.

కరోనా ఎఫెక్ట్ : ఉత్పత్తులు నిలిపివేసిన బెంట్లీ మోటార్స్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

పురాతన వాహన తయారీదారులలో బెంట్లీ మోటార్స్ ఒకటి. ఇప్పుడు కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల భద్రతను లక్ష్యంగా చేసుకుని కంపెనీని ఏప్రిల్ 20 వరకు తమ కార్యకలాపాలను నిలిపివేయడం జరిగింది.

ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని ఈ వైరస్ నిర్మూలనకు తమ వంతు నివారణ చర్యలను తీసుకుంటున్నారు. ఈ వైరస్ కారణంగా ఆటో పరిశ్రమలో చాలా సంక్షోభం ఏర్పడింది. కంపెనీలలో ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు.

Most Read Articles

English summary
Bentley Motors Halts Production Until April 20 Due To Coronavirus Crisis. Read in Telugu.
Story first published: Saturday, March 21, 2020, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X