చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇప్పుడు చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్‌లో కున్ ఎక్స్‌క్లూజివ్ అనే కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. కొత్త షోరూమ్ బిఎమ్‌డబ్ల్యూ ఫెసిలిటీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆధారంగా సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ లైఫ్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది.

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

దీనితో పాటు షోరూమ్ బిఎమ్‌డబ్ల్యూ యొక్క యాక్ససరీస్ కలక్షన్ యొక్క ప్రదర్శనతో పాటు లీనమయ్యే బ్రాండ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ షోరూమ్ సర్వే నెంబర్ 155, ఓల్డ్ మహాబలిపురం రోడ్, షోలింగనల్లూర్, చెన్నై, తమిళనాడులో ఉంది. కున్ ఎక్స్‌క్లూజివ్ డీలర్ ప్రిన్సిపాల్ వసంతి భూపతి పర్యవేక్షణలో బిఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్ ప్రారంభించబడింది.

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

మా కస్టమర్ల యొక్క అనుభవానికి కొత్త సంవత్సరంలో బిఎమ్‌డబ్ల్యూ సౌకర్యం లభించిందని కంపెనీ తెలిపింది. ఈ డీలర్షిప్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండే విధంగా రూపొందించబడింది. ఇది ఆధునిక నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్ మరియు కొత్త టెక్నాలజీ పరిజ్ఞానాలను ఉపయోగించి నిర్మించబడింది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పహా మాట్లాడుతూ, బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా భారతదేశంలో ఎక్కువగా ఆకాంక్షించే ఆటోమోటివ్ లగ్జరీ బ్రాండ్లలో ఒకటిగా బిఎమ్‌డబ్ల్యూ ఫెసిలిటీ నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా లేటెస్ట్ సౌకర్యాలతో వినియోగదారులను స్వాగతించింది.

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

తమిళనాడు రాజధాని అయిన చెన్నై మాకు ఒక ముఖ్యమైన మార్కెట్ మరియు మేము మా దీర్ఘకాల భాగస్వామి అయిన కున్ ఎక్స్‌క్లూజివ్‌తో మరో అల్ట్రా-మోడరన్ షోరూమ్‌తో మా ఉనికిని మరింత బలపరుస్తున్నాము అని ఆయన అన్నారు.

MOST READ:భారత్‌లో బెస్ట్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టాప్-5 సేఫెస్ట్ కార్స్ ఇవే..

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

వినియోగదారులకు వ్యక్తిగత ప్రీమియం బ్రాండ్ అనుభవాన్ని అందించడంలో షోరూమ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కూడా అయన ప్రస్తావించారు. బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఈ కొత్త సౌకర్యం సుమారు 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేయబడింది.

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

ఈ షోరూమ్ సదుపాయంలో 6 కార్లను ప్రదర్శించడానికి అనువైన స్థలం ఉంది. అంతే కాకుండా ఇక్కడ బిఎమ్‌డబ్ల్యూ లైఫ్‌స్టైల్ మరియు యాక్సెసరీస్ విభాగం ఉన్నాయి. ఇంటరాక్టివ్ వర్చువల్ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ కారు కాన్ఫిగరేటర్‌తో కారును ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడుతుంది.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

ఇటీవల బిఎమ్‌డబ్ల్యూ తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్ గ్రాన్ కూపే బ్లాక్ షాడో ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూమ్ ప్రకారం దీనిని రూ. 42.30 లక్షల ధరకు బిఎమ్‌డబ్ల్యూ ఈ కారును విడుదల చేసింది.

చెన్నైలో కొత్త షోరూమ్ ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ ; పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్ గ్రాన్ కూపే బ్లాక్ షాడో ఎడిషన్ లో 2.0-లీటర్, 4-పాట్ ట్విన్ పవర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉపయోగించబడింది. ఈ ఇంజిన్ 1,750 మరియు 2,500 ఆర్‌పిఎమ్ మధ్య 187 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఓం స్పోర్ట్ డిజైన్ లాంగ్వేజ్‌తో ఈ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు రెండు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అడుగుపెట్టింది.

MOST READ:భారత్‌లో లక్షకు పైగా కనెక్టెడ్ కార్లను విక్రయించిన కియా మోటార్స్

Most Read Articles

English summary
BMW India Opens New Showroom In Chennai Details. Read in Telugu.
Story first published: Thursday, December 17, 2020, 18:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X