లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

కోవిడ్-19 కొనుగోలుదారుల ఆలోచనల్లో కొత్త మార్పులు తీసుకువచ్చింది. ఒకప్పుడు విలాసం అనుకున్న వస్తువు ఇప్పుడు అవసరంగా మారిపోయింది. వైరస్ వ్యాప్తి భయంతో సురక్షితమైన ప్రయాణాలకే కస్టమర్లు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, దేశంలో కార్లకు గిరాకీ క్రమక్రంగా పెరుగుతోంది.

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

గడచిన మే 2020 మధ్య భాగంలో కేంద్రం లాక్‌డౌన్ సడలింపులను ప్రకటించి, ఆటోమొబైల్ కంపెనీలు తమ వ్యాపారాలను చేసుకోవచ్చని తెలుపడంతో కార్ల కంపెనీలు తమ దుకాణాలను తెరచాయి. అప్పటికే ప్రజల్లో పెరిగిపోయిన వైరస్ వ్యాప్తి భయం, మరోవైపు కార్ల ఉత్పత్తి నిలిచిపోయిన కారణంగా పెరిగిపోయిన వెయిటింగ్ పీరియడ్‌ల నేపథ్యంలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి.

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

లాక్‌డౌన్ పాక్షికంగా అమలులో ఉన్న కార్ల అమ్మకాలు జోరుగానే సాగాయి. మే 2020లో రాష్ట్రాల వారీగా ఎంత మేర అమ్మకాలు జరిగాయని గమనిస్తే.. ఈ జాబితాలో కర్ణాటక రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది. మే 2020లో కర్ణాటకలో మొత్తం 5,847 కార్లు అమ్ముడుపోగా, మే 2019లో 17,500 కార్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే 66.5 శాతం అమ్మకాలు తగ్గాయి.

MOST READ: జూన్ 19న సరికొత్త ట్రయంప్ టైగర్ 900 బైక్ విడుదల

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

కర్ణాటక తర్వాతి స్థానంలో కేరళ నిలిచింది. మే 2019 నెలలో కేరళ రాష్ట్రంలో మొత్తం 16,569 కార్లు అమ్ముడుపోగా, మే 2020లో (15 రోజులకు గాను) 3,282 కార్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే 80 శాతం అమ్మకాలు క్షీణించాయి.

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో గడచిన మే 2020లో మొత్తం 2,622 కార్లు అమ్ముడుపోయాయి. అదే మే 2019లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,000 కార్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే 90 శాతం అమ్మకాలు క్షీణించాయి.

MOST READ: ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

ఇక నాల్గవ స్థానంలో తమిళనాడు ఉంది. కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్న తమిళనాడులో గడచిన మే 2020లో మొత్తం 2,227 కార్లు అమ్ముడుపోయాయి. అదే మే 2019లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,500 కార్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే 86 శాతం అమ్మకాలు తగ్గాయి.

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

రాజస్థాన్ ఐదవ స్థానంలో ఉంది. గడచిన మే 2020లో మొత్తం 2,062 కార్లు అమ్ముడుపోయాయి. అదే మే 2019లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,800 కార్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే 86 శాతం అమ్మకాలు తగ్గాయి.

Rank State / UT Car Sales May'20 May'19 Growth (%)
1

Karanataka

5,847

17,489 -66.57
2 Kerela 3,282 16,569 -80.19
3 Uttar Pradesh 2,622 27,840 -90.58
4 Tamil Nadu 2,227 16,597 -86.58
5 Rajasthan 2,062 14,849 -86.11
6 Assam 1,923 6,881 -72.05
7 Maharashtra 1,875 28,687 -93.46
8 Delhi 1,836 13,343 -86.24
9 Punjab 1,557 8,066 -80.70
10 Haryana 1,168 14,233 -91.79
11 Odisha 1,136 3,828 -70.32
12 Chhatisgarh 1,016 4,378 -76.79
13 Gujarat 790 22,735 -96.53
14 Bihar 740 5,090 -85.46
15 Goa 693 1,471 -52.89
16 Himachal Pradesh 353 4,372 -91.93
17 Jharkhand 253 4,816 -94.75
18 Chandigarh 239 1,308 -81.73
19 Mizoram 180 398 -54.77
20 Uttarakhand 148 4,098 -96.39
21 Tripura 121 441 -72.56
22 Arunachal Pradesh 120 663 -81.90
23 Puducherry 117 678 -82.74
24 Jammu And Kashmir 101 7,082 -98.57
25 Nagaland 91 515 -82.33
26 Sikkim 90 378 -76.19
27 Meghalaya 87 966 -90.99
28 West Bengal 38 7,310 -99.48
29 D & N and D & N 34 340 -99.00
30 Manipur 3 416 -99.28
31 Ladakh 0 96 -100

Source: Rushlane

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

సాధారంగా ఎప్పుడూ టాప్ 10లో కనిపించని అస్సాం రాష్ట్రంలో గడచిన మే 2020లో మొత్తం 1,923 కార్లు అమ్ముడై ఆరవ స్థానంలో నిలించింది. మే 2019లో ఈ రాష్ట్రంలో మొత్తం 6,881 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోల్చుకుంటే అస్సాంలో అమ్మకాలు 72 శాతం తగ్గుదలను నమోదు చేసుకున్నాయి.

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

మే 2019లో అత్యధిక అమ్మకాలను నమోదు చేసుకున్న మహారాష్ట్రలో కరోనా లాక్‌డౌన్ కారణంగా అమ్మకాలు భారీగా క్షీణించాయి. మే 2019లో మహారాష్ట్రలో మొత్తం 28,687 కార్లు అమ్ముడుపోగా మే 2020లో కేవలం 1,875 కార్లు మాత్రమే అమ్ముడై 93.46 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. ఈ జాబితాలో మహారాష్ట్రది ఏడవ స్థానం. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (1,836 కార్లు), పంజాబ్ (1,557 కార్లు) మరియు హర్యాణా (1,168 కార్లు)లు ఉన్నాయి.

MOST READ: త్వరలో నిలిపివేయనున్న మహీంద్రా గ్రూప్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎందుకో తెలుసా ?

లాక్‌డౌన్‌లోనూ తగ్గని కార్ సేల్స్; ఆ రాష్ట్రంలోనే అధికంగా కొన్నారు!

మే 2020 రాష్ట్రాల వారీ కార్ సేల్స్ రిపోర్టుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

లాక్‌డౌన్ కారణంగా మే 2020లో కేవలం 15 రోజుల మాత్రమే వ్యాపారం సాగింది. అందులోనూ కంటైన్‌మెంట్ జోన్లలో దుకాణాలు తెరచుకులేదు. గత సంవత్సరం ఇదే నెల (మే 2019)తో పోల్చుకుంటే దేశవ్యాప్తంగా కార్ల అమ్మకాలు 86 శాతం క్షీణించాయి. అయినప్పటికీ, కొత్త కొనుగోలుదారులు మాత్రం గణనీయంగానే పెరుగుతున్నారనేది ప్రస్తుత కార్ సేల్స్ ట్రెండ్‌ను గమనిస్తే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో కూడా కార్ల అమ్మకాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Car sales in India slowly resumed operations in mid-May 2020 after a shut down of nearly two months in the country, amidst the COVID-19 pandemic. With car companies slowly restarting production, sales and service operations across India have also started. Read in Telugu.
Story first published: Monday, June 15, 2020, 18:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X