ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

కరోనా లాక్ డౌన్ కారణంగా అనేక కంపెనీలు దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడాన్ని వాయిదా వేశాయి. దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కి ఇప్పుడు కొన్ని సడలింపులు కల్పించడం వల్ల, కార్ల తయారీదారులు తమ కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. జూలై 2020 నాటికి దేశీయ మార్కెట్లో విడుదల చేయబొయ్యే కార్ల గురించి మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..!

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

1. న్యూ హోండా సిటీ :

హోండా సిటీ కారు అభిమానులు చాలా రోజులుగా కొత్త హోండా సిటీ కారును ఆశిస్తున్నారు. ఇప్పుడు కొత్త హోండా సిటీ కారును విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. కొత్త హోండా సిటీ కారును నోయిడాలోని కంపెనీ తయారీ కర్మాగారంలో ఉత్పత్తి చేయనున్నారు. కంపెనీ ఈ కారు కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభించింది.

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

కొత్త 2020 హోండా సిటీ కారు రూపకల్పన మరియు ఫీచర్స్ అనేక విధాలుగా నవీకరించబడ్డాయి. 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ ఇంజిన్‌తో కొత్త హోండా సిటీ కారును విడుదల చేయనున్నారు. పెట్రోల్ ఇంజన్ 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

2. ఎంజి హెక్టర్ ప్లస్ :

కంపెనీ ఢిల్లీలో 2020 ఆటో ఎక్స్‌పోలో ఎంజి హెక్టర్ ప్లస్ కారును ఆవిష్కరించింది. ఈ కారును త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే లాక్ డౌన్ కారణంగా కంపెనీ ఈ కారు విడుదలను వాయిదా వేసింది.

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

ఎంజీ మోటార్ జూలైలో హెక్టర్ ప్లస్ కారును విడుదల చేయనుంది. ఎంజీ హెక్టర్ ప్లస్ కారు 6, 7 సీట్ల ఆప్షన్లలో అమ్మబడుతుంది. గుజరాత్‌లోని హలోల్ తయారీ కర్మాగారంలో ఎంజీ హెక్టర్ ప్లస్‌ను తయారు చేస్తున్నారు.

MOST READ:భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

ఎంజీ హెక్టర్ ప్లస్ కారులో అనేక నవీకరణలు చేయబడ్డాయి. ఈ కారులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌లలో అమ్మబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

3. మెర్సిడెస్ బెంజ్ EQC :

బెంజ్ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి కారుని 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టింది. సవరించిన జిఎల్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ కారు 5 సీట్ల మోడల్‌లో లాంచ్ అవుతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈ కారును అనేక ఫీచర్లతో ఆవిష్కరిస్తుంది.

MOST READ:కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

ఇందులో కొత్త ట్రాన్స్మిషన్ సిస్టమ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి 402 బిహెచ్‌పి శక్తి మరియు 765 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. కారులో 80 కిలోవాట్ల బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత, కారు 400-450 కి.మీ వరకు ప్రయాణించే సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

4. ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ :

ఆడి తన స్పోర్ట్స్ కార్ సిరీస్ ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌ను 2020 జులై నెలల ఆవిస్కరించనుంది. ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మంచి పనితీరు కలిగిన కారు. ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా అధిక పనితీరుని కూడా కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 100 కిమీ వేగవంతం చేస్తుంది.

MOST READ:మీ కారు మైలేజిని పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

ఇండియన్ మార్కెట్లో జులై నెలలో లాంచ్ కానున్న కార్లు ఇవే

ఈ కారు రెండవ తరం ఆడి ఆర్ఎస్ 7 సిరీస్. ఈ కారులో 4.0-లీటర్ ట్విన్-టర్బో వి 8 పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 560 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Cars launching in the month of July in Indian market. Read in Telugu
Story first published: Monday, June 29, 2020, 10:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X