Just In
Don't Miss
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- News
విచ్చలవిడి దోపిడీ: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి, వేలకోట్ల అవినీతి అంటూ వివేక్
- Finance
ఢిల్లీలో రూ.85 దాటిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.92
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సాధారణ కార్లు లగ్జరీ కార్లుగా మారాయి..ఎలాగో తెలుసా ?
సాధారణంగా వాహన ప్రియులు లగ్జరీ కార్లు కొనాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఎక్కువ ధర కారణంగా వారి కల ఒక కలగా మిగిలిపోయింది. కొన్ని కంపెనీలు తమ కార్లను మాడిఫై చేయడం ద్వారా లగ్జరీ కారు కొనాలనే కలని కొంత వరకు సాకారం చేస్తాయి.

బడ్జెట్ ధర గల కార్లను లగ్జరీ మరియు సూపర్ కార్లుగా ఎలా మార్చారో కార్ టాక్ నివేదిస్తుంది. ఈ మాడిఫై చేయబడిన కార్ల నుంచి అసలు కంపెనీల యొక్క లోగోలను తొలగించడం ద్వారా లగ్జరీ కంపెనీ లోగో పొందుపరుస్తారు. ఎందుకంటే లగ్జరీ కార్ల రూపాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఇది ఒకటి.

ఆడి సియాజ్
మారుతి సుజుకి సియాజ్ కారులో ఉన్న మారుతి సుజుకి కంపెనీ లోగోను తొలగించారు. లోగో మాత్రమే కాకుండా ఫ్రంట్ సైడ్ గ్రిల్ కూడా మార్చబడింది. అదనంగా, ఈ కారులో ఫాగ్ లాంప్, బోనెట్ మరియు ఆడి కార్ లోని హెడ్‌లైట్లు అమర్చబడి ఉంటాయి. ఇది సాధారణ మారుతి సియాజ్‌ను ఖరీదైన ఆడి లాగా చేస్తుంది.
MOST READ:ఎంజి గ్లోస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

లెక్సస్ ఫార్చ్యూనర్
లెక్సస్ టయోటా యొక్క ప్రీమియం కారు. లెక్సస్ కార్లు ఖరీదైనవి. ఈ కారణంగా పరిమిత సంఖ్యలో కార్లు మాత్రమే అమ్ముడవుతాయి. టయోటా ఫార్చ్యూనర్ కారు యజమానులు తమ కారును లెక్సస్ కారుగా మార్చారు. ఈ కారణంగా ఫార్చ్యూనర్ కారు ఫ్రంట్ గ్రిల్ మరియు టైర్లు మార్చబడ్డాయి. కానీ టయోటా కంపెనీ లోగో అలాగే ఉంచబడింది.

టయోటా ఫార్చ్యూనర్ లెక్సస్ కారులా కనిపించేలా కొన్ని ఫీచర్లు అమలు చేయబడ్డాయి. సవరించిన ఫార్చ్యూనర్ లెక్సస్ కారు యొక్క ఎల్ఎక్స్ లాగా కనిపిస్తుంది.
MOST READ:బ్రేకింగ్ : నగరాల్లో డీజిల్ వెహికల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

బెంజ్ స్కార్పియో
మహీంద్రా స్కార్పియో బెంజ్ కంపెనీ లోగో మరియు బంపర్ ఉపయోగించి బెంజ్ వలె రూపొందించబడింది. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్కార్పియో కూడా ఒకటి. బెంజ్ కంపెనీ గ్రిల్, బంపర్, హెడ్‌లైట్ మరియు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లను సవరించిన స్కార్పియో కారు ముందు భాగంలో అమర్చారు.

లెక్సస్ కామ్రీ
టయోటా కారుని కేమ్రీ లెక్సస్ కారుగా మాడిఫై చేయబడింది. కేమ్రీ కారులో లెక్సస్ కారు ఫ్రంట్ గ్రిల్, బంపర్, హెడ్‌లైట్ మరియు డిఆర్‌ఎల్ ఉన్నాయి. మాడిఫై చేయబడిన ఈ కామ్రీ కారు రెడ్ కలర్ లో ఉంటుంది.
MOST READ:ఈ ప్లాన్ ద్వారా కారు కొనకుండా కార్ ఓనర్ అవ్వొచ్చు.. ఎలాగో మీరే చూడండి

బెంజ్ డిజైర్
మారుతి డిజైర్ కారులోని లోగో మరియు బంపర్‌లు బెంజ్ కారులాగా మార్చబడ్డాయి. ఈ కారులో పొందుపరిచిన లోగో నిజమైన బెంజ్ లోగో లాగా లేదు. ఈ కారు రోడ్డుపై ఉన్నప్పుడు ప్రజలు గందరగోళానికి గురిచేస్తుంది.

ఈ అన్ని మాడిఫైడ్ కార్లు నిజంగా ప్రశంసనీయం. కానీ అవన్నీ చట్టవిరుద్ధం. ఏదైనా కారు యొక్క ప్రాథమిక స్వభావాన్ని మార్చడం భారత మోటారు వాహన చట్టం ప్రకారం నేరం. ఈ నేరానికి ఎక్కువ మొత్తంలో జరిమానాలు విధించడమే కాకుండా, రిజిస్ట్రేషన్ రద్దు మరియు వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి కఠినమైన చర్యల తీసుకోవడం జరుగుతుంది.
MOST READ:భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన లగ్జరీ బైక్ కంపెనీ హార్లే డేవిడ్సన్, ఎందుకో తెలుసా ?