Just In
- 6 min ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 1 hr ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 1 hr ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
- 2 hrs ago
చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
Don't Miss
- Movies
కరోనా విలయతాండవం: షూట్ కి రాలేనన్న సీనియర్ నటుడు..అర్ధాంతరంగా ఆగిన షూట్?
- Finance
కరోనా-లాక్డౌన్పై మరోసారి తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
- Sports
'తొలి టెస్టు అనంతరం జట్టులో చోటు దక్కక పోవడం బాధించింది.. నా టెక్నిక్ గురించి కలత చెందా'
- News
కరోనా ఎఫెక్ట్ ... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా
- Lifestyle
ఇలా చేస్తే బలహీనమైన జుట్టు సహజంగా బలపడుతుంది..కొత్త జుట్టు వస్తుంది..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సూపర్ ప్లాన్.. అదేంటో తెలుసా ?
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపాఢ్యములో వాహన తయారీదారులు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కావున ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు మద్దతు తెలుపుతున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగించకపోవడానికి ప్రధాన కారణం వాటికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అంటే ఎలక్ట్రిక్ వాహనాలను సరైన ఛార్జింగ్ సదుపాయాలు లేదు. ఈ ఛార్జింగ్ స్టేషన్లు విస్తృతంగా ఏర్పాటు చేసినట్లయితే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం గణనీయంగా పెరుగుతుంది.

ఇప్పుడు ఢిల్లీ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ఎక్కువ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నారు. ఢిల్లీ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వ్యక్తులు ఇకపై ఛార్జింగ్ స్టేషన్ల బారిన పడరు. వచ్చే 2021 కొత్త సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.
MOST READ:కొత్త సంవత్సరంలో లాంచ్ కానున్న కొత్త టాటా గ్రావిటాస్ : వివరాలు

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నగరం యొక్క కూడలి మరియు నివాస ప్రాంతాలలో ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణానికి బ్లూప్రింట్ ఏర్పాటు చేసింది. ఢిల్లీ 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఛార్జింగ్ స్టేషన్ నిర్మించనున్నట్లు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ప్రణాళిక ప్రకారం, ఛార్జింగ్ స్టేషన్ల కోసం సౌత్ ఢిల్లీలో 75, నార్త్ ఢిల్లీలో 127 మరియు ఈస్ట్ ఢిల్లీలో 93 ప్రాంతాలను గుర్తించారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పటికే 55 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఇప్పుడు మరో 45 ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభించడం కోసం కొత్త మరో ప్రాజెక్ట్ ఓపెన్ చేసింది.
MOST READ:అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ ; ధర & వివరాలు

ఢిల్లీలో కార్లు మరియు ద్విచక్ర వాహనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వాహనాల సంఖ్య పెరగడం వల్ల అకాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ కాలుష్యం ఇప్పుడు మాత్రమే కాదు భావి తరాలకు కూడా ప్రమాదకారిగా మారనుంది. ప్రస్తుతం ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉన్న ఒకే మార్గం పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం.

రాబోయే రోజుల్లో ప్రజలు ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయబోతున్నారు. కానీ ఇప్పుడు వాహనదారులు ఛార్జింగ్ స్టేషన్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఇకపై ఇటువంటి సమస్య ఉండదు. ఈ కారణంగా, సిఎన్‌జి, పెట్రోల్ బంక్ మాదిరిగానే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.
MOST READ:కేవలం 10 నిమిషాల్లో మొత్తం అమ్ముడైన జిఎంసి హమ్మర్ ఈవి పికప్ ట్రక్

ఢిల్లీ సౌత్ కార్పొరేషన్ ఇప్పటికే తన అధికారుల కోసం ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తోంది. దీనివల్ల పెట్రోల్ ఖర్చులు తగ్గాయి, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు కూడా చాలా వరకు తగ్గాయి.

కంపెనీలు ఛార్జింగ్ పాయింట్లను ఓపెన్ చేసి గంట లేదా యూనిట్ ప్రాతిపదికన ఛార్జింగ్ రేట్లను సెట్ చేస్తుంది. బ్యాటరీని ఛార్జింగ్ స్టేషన్లతో భర్తీ చేయడానికి కూడా ప్రణాళికలు ఉన్నాయి. ఇది ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు ఛార్జింగ్ సులభతరం చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం 20% పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం తప్పనిసరి.
MOST READ:భారత్లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు

మాల్, హాస్పిటల్, పబ్లిక్ బిల్డింగ్, హౌసింగ్ అసోసియేషన్లతో సహా అన్ని కొత్త ప్రాజెక్టులపై మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ రకమైన ప్రాజెక్టులు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇప్పటికే 38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలతో అగ్రస్థానంలో ఉంది. 22.7 మిలియన్ టన్నుల ఉద్గారాలతో ముంబై రెండవ స్థానంలో ఉండగా, 22.1 మిలియన్ టన్నులతో చెన్నై తరువాత స్థానంలో ఉంది.

ఢిల్లీలో 1,000 జనాభాకు 85 ప్రైవేట్ కార్లు ఉన్నాయి. ఆటోమొబైల్స్ ఢిల్లీలో 12.4 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తాయి. ఇది ఇలాగె కొనసాగితే మానవాళి మనుగడే ప్రస్నార్ధకమవుతుంది. కావున వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపాలి. అప్పుడే ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
Note: Images used are for representational purpose only.