Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంటి వద్దకే ఫోర్డ్ కార్ సర్వీస్, అధనపు చార్జీలు లేవు!
అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లోని ఎంపిక చేసిన నగరాల్లో డయల్-ఏ-ఫోర్డ్ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించిన ఈ కొత్త ప్రణాళికతో కస్టమర్లు ఇకపై కార్ సర్వీస్ కోసం సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం ఉండదు. నేరుగా కస్టమర్ ఇంటి వద్దనే కారును సర్వీస్ చేయించుకోవచ్చు.

ఈ డోర్ స్టెప్ సర్వీస్ కోసం ఫోర్డ్ కస్టమర్ల నుంటి ఎటువంటి అదనపు మొత్తాన్ని చార్జ్ చేయటం లేదు. ఈ కొత్త ప్రణాళికతో క్రమం తప్పకుండా మెయింటెన్స్ కోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని ఇది నివారిస్తుంది. మరోవైపు కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది.

డయల్-ఏ-ఫోర్డ్ చొరవతో యజమానులు ఇకపై తమ వాహనాలను వారి ఇళ్లలో లేదా వారికి సౌకర్యవంతంగా ఉండే ఇతర ప్రదేశాలలో సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది కారు సర్వీస్‌తో పాటుగా కారులో ఏవైనా చిన్నపాటి మరమ్మత్తులు చేయడానికి కూడా అనుమతిస్తుంది.
MOST READ:కెమెరాకు చిక్కిన బిఎస్ 6 ఇసుజు వి క్రాస్, ఎలా ఉందో చూసారా !

అయితే, కారులో ఏదైనా పెద్ద సమస్య ఉన్నా లేదా కారు రిపేరుకు/సర్వీసుకు మరింత అధునాతన సాధనాలు, పరికరాలు అవసరమైతే మాత్రం సదరు కార్లను తప్పనిసరిగా ఫోర్డ్ అధీకృత సర్వీస్ సెంటర్‌లో నిర్వహిస్తారు.

కస్టమర్లు తకు అవసరమైన సర్వీస్‌లను ఎంచుకోవడానికి మరియు సర్వీస్ డేట్, టైమ్ మరియు సర్వీస్ చేయబడే స్థలాన్ని ఏర్పాటు చేయడానికి ఫోర్డ్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.

కారులో ఎదురయ్యే చిన్నపాటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి కూడా కాల్ చేసి, పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఈ సర్వీస్‌లో భాగంగా కస్టమర్ల పిక్-అప్ మరియు డ్రాప్-ఆఫ్ సేవలను షెడ్యూల్ చేయవచ్చు.

డయల్-ఏ-ఫోర్డ్ సదుపాయంతో కేవలం సర్వీస్ అండ్ రిపేర్స్ మాత్రమే కాకుండా, ఫోర్డ్ భవిష్యత్ కస్టమర్లు బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోని కార్ల టెస్ట్ డ్రైవ్‌లను కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.
ఫోర్డ్ ప్రస్తుతం అహ్మదాబాద్, ఔరంగాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కొచ్చిన్, ఢిల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్, గుర్గావ్, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నోయిడా, పూణే, తానే, త్రివేండ్రంలలో డయల్-ఏ-ఫోర్డ్ సేవలను అందిస్తోంది. ఈ బ్రాండ్ డయల్-ఏ-ఫోర్డ్ సర్వీస్ లిస్ట్‌లో మరిన్ని నగరాలను చేర్చుతుందని సమాచారం.

ఇక ఫోర్డ్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, బ్రాండ్ తన ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వాహనం 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్‌తో ఆప్షనల్‌గా లభ్యం కానుంది.

ఈ కొత్త ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ బ్రాండ్ యొక్క ఎకోస్పోర్ట్ మోడల్ నుండి గ్రహించబడినది. ఇది ఫిగో పెట్రోల్ మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం అవుతుంది.
MOST READ:కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!

డయల్-ఏ-ఫోర్డ్ ఉచిత డోర్ స్టెప్ కార్ సర్వీస్ క్యాంప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అన్ని కార్ కంపెనీలు ఇదే తరహాలో కార్ సర్వీస్ సేవలను అందిస్తాయని మేము భావిస్తున్నాము. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా చాలా మంది కస్టమర్లు డీలర్‌షిప్ లేదా అధీకృత సర్వీస్ సెంటర్‌ను సందర్శించడానికి వెనుకాడుతున్నారు. మారుతి సుజుకి, టొయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి బ్రాండ్లు కూడా ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలను ప్రకటించాయి.