బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

కారు కొనాలంటే అందరూ ఆలోచించే అంశం మైలేజ్. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. నచ్చిన మోడల్ ఎంపిక చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ అడిగే మరో అంశం.. డిస్కౌంట్ ఎంత ఇస్తారు.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

మైలేజ్ మరియు డిస్కౌంట్లతో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఎక్కువ ప్రజాదరణ పొందిన కొన్ని బెస్ట్ ఆటోమేటిక్ కార్లను డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేకం కథనం తీసుకొచ్చింది. ధరకు తగ్గ విలువలతో అన్ని రకాల రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా పరుగులు పెట్టే ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల వివరాలు...

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

మారుతి బాలెనో (బీఎస్6)

మారుతి బాలెనో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు, మారుతి సుజుకి దీనిని నెక్సా షోరూం ద్వారా మాత్రమే విక్రయిస్తోంది. 2019 ప్రారంభంలో బాలెనో ఫేస్‌లిప్ట్ వెర్షన్‌ను బిఎస్6 ఇంజన్ అప్‌డేట్స్‌తో లాంచ్ చేసింది.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

బాలెనో మోడల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ మీద గరిష్టంగా రూ. 35,000 డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు కార్బోరేట్ బోనస్ రూ. 5,000 వరకూ లభిస్తోంది.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

హ్యుందాయ్ ఐ20 (బీఎస్6)

హ్యుందాయ్ మోటార్స్ గతంలో ఐ20 ఎలైట్ పెట్రోల్ వేరియంట్‌ను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విక్రయించేది, అయితే ఇటీవల దీనిని మార్కెట్ నుండి తొలగించింది. అతి త్వరలో తప్పనిసరి కానున్న బీఎస్6 ప్రమాణాల నేపథ్యంలో ఐ20 ఎలైట్ బీఎస్4 స్టాకును క్లియర్ చేసుకునేందుకు డీలర్లు పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నారు.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ మైక్రా ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లోని పాపులర్ మోడళ్లలో ఇదీ ఒకటి. నానాటికీ పెరుగుతున్న పోటీ నేపథ్యంలో నిస్సాన్ మైక్రా మెలమెల్లగా తన రాజసం కోల్పోయింది. బీఎస్4 వెర్షన్‌లోని పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 50,000 డిస్కౌంట్లు ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

టయోటా గ్లాంజ్ (బీఎస్6)

టయోటా గ్లాంజా మారుతి బాలెనో యొక్క రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్. టయోటా-మారుతి భాగస్వామ్యంలో భాగంగా మారుతి బాలెనో కారును ప్రయోగాత్మకంగా టయోటా గ్లాంజా పేరుతో తీసుకొచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులోని ఆటోమేటిక్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 25,000 వరకూ డిస్కౌంట్లు ప్రకటించారు.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (బీఎస్6)

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ కారును బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ బీఎస్6 ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

హ్యుందాయ్ శాంట్రో (బీఎస్6)

హ్యుందాయ్ మోటార్స్ తొలుత శాంట్రో మోడల్‌తో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత దీనిని మార్కెట్ నుండి తొలగించింది. అయితే, మార్కెట్లో శాంట్రో మోడల్‌కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా దీనిని మళ్లీ తీసుకొచ్చింది. హ్యుందాయ్ శాంట్రో ఆటోమేటిక్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 35,000 వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

మారుతి స్విఫ్ట్ (బీఎస్6)

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ ఇప్పుడు బీఎస్6 వెర్షన్‌లో లభిస్తోంది. మారుతి స్విఫ్ట్‌లోని ఆటోమేటిక్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పోరేట్ బోనస్ లభిస్తోంది.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

మారుతి సెలెరియో (బీఎస్6)

మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తోంది. మారుతి సెలెరియో ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు రూ. 2,500 కార్పోరేట్ బోనస్ లభిస్తోంది.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

మారుతి వ్యాగన్ఆర్ (బీఎస్6)

పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి వ్యాగన్ఆర్ ఒకటి. మారుతి వ్యాగన్ఆర్ ఆటోమేటిక్ వేరియంట్ల మీద అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు రూ. 2,500 కార్పోరేట్ బోనస్ లభిస్తుంది.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

మారుతి ఎస్‌ప్రెస్సో (బీఎస్6)

మారుతి సుజుకి ఇటీవల స్మాల్ ఎస్‌యూవీ తరహాలో చిన్న హ్యాచ్‌బ్యాక్ మారుతి ఎస్‌ప్రెస్సో మోడల్‌ను లాంచ్ చేసింది. రెనో క్విడ్‌‌కు గట్టి పోటీనిస్తున్న మారుతి ఎస్‌ప్రెస్సో బీఎస్6 ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు రూ. 2,500 విలువైన కార్పోరేట్ బోనస్ వంటి ఆఫర్లు ఉన్నాయి.

బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ. 75 వేలు తగ్గింపు!

రెనో క్విడ్

మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ దిగ్గజం రెనో ఈ మధ్యనే క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మళ్లీ లాంచ్ చేసింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభించే రెనో క్విడ్ మారుతి ఎస్‌ప్రెస్సో మోడల్‌కు సరాసరి పోటీనిస్తుంది. బీఎస్4 రెనో క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 50 వేల విలువైన డిస్కౌంట్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Discounts on automatic hatchbacks: Upto Rs. 75,000 off on cars like Maruti Baleno, Hyundai Grand i10 NIOS & more. Read in Telugu.
Story first published: Sunday, March 1, 2020, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X