భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ ఫెరారీ భారత మార్కెట్లో తమ సరికొత్త ఎఫ్8 ట్రిబ్యూటో కారును సైలెంట్‌గా విడుదల చేసింది. దేశీయ విపణిలో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూనో సూపర్ కార్ ధర రూ.4.02 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఇది ఫెరారీ బ్రాండ్ నుంచి తాజాగా విడుదలైన మిడ్ ఇంజన్ సూపర్ కార్ కావటం విశేషం. ఇది సుప్రసిద్ధ ఫెరారీ 488 జిటిబి స్థానాన్ని రీప్లేస్ చేస్తూ విడుదలైన మోడల్.

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో బ్రాండ్ యొక్క భవిష్యత్ మోడళ్ల కోసం వి6 ఇంజన్‌లను తగ్గించడానికి ముందు, ఈ బ్రాండ్ నుంచి చివరిగా వస్తున్న హైబ్రిడ్ కాని వి8 శక్తితో కూడిన సూపర్ కార్ అని కూడా చెప్పబడుతోంది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారును తొలిసారిగా 2019 జెనీవా మోటార్ షోలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనకు ఉంచారు.

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

కొత్త ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారులో అదే 3.9-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 720 బిహెచ్‌పి శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఆటో అంబులెన్స్ .. కరోనా రోగులకు ఈ అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో ఇప్పటి వరకు తాము తయారు చేయని అత్యంత వేగవంతమైన సిరీస్-ప్రొడక్షన్ మిడ్ ఇంజన్ సూపర్ కార్ అని కంపెనీ పేర్కొంది. ఎఫ్8 ట్రిబ్యూటో గరిష్టంగా గంటకు 340 కి.మీ వేగంతో దూసుకెళ్తుందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 2.9 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0 - 100 కి.మీ వేగాన్ని మరియు 7.8 సెకన్ల వ్యవధిలో 0 - 200 కి.మీ వేగాన్ని చేరుకోగలదు.

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో దాని మునుపటి తరం మోడల్ కంటే 40 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది మరియు 15 శాతం ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో దాని మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే చాలా పదునైన మరియు అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఫెరారీ 488 జిటిబిలోని అనేక డిజైన్ ఎలిమెట్స్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:క్రికెటర్ రాబిన్ ఉతప్పకు పంపిణీ చేయబడిన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

కొత్త ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో స్టైలింగ్ అప్‌డేట్స్‌లో రిఫ్రెష్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, పదునైన క్రీజ్ లైన్స్ ఉన్నాయి, ఇంకా ఇందులో రీడిజైన్ చేసిన ఎయిర్ వెంట్స్, ఎఫ్1 నుంచి స్పూర్తి పొంది డిజైన్ చేసిన ఎస్-డక్ట్స్, స్పాయిలర్ మరియు ఇతర డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ట్రిబ్యూటో దాని మునపటి 488 జిటిబితో పోలిస్తే మరింత స్టైలిష్, స్పోర్టీగా కనిపిస్తుంది.

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

ఇంటీరియర్స్‌లో కూడా ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో 488 జిటిబితో పోలిస్తే, పూర్తిగా రీడిజైన్ చేసిన క్యాబిన్ ఉంటుంది. ఇది మరింత డ్రైవర్-సెంట్రిక్ కాక్‌పిట్ మరియు డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రీమియం లెథర్ మరియు అల్కాంటారా అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. కారు నిర్మాణం చాలా వరకూ కార్బన్-ఫైబర్ పదార్థాలను ఉపయోగించబడి ఉంటుంది.

MOST READ:కవాసాకి జెడ్ 900 బైక్ పై కనిపించిన ఇమ్రాన్ హష్మి

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కాక్‌పిట్‌లో పలు డిజిటల్ స్క్రీన్లు, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద పాడిల్ షిఫ్టర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో సూపర్ కార్ విడుదల

భారత్‌లో ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో ఒక శకం ముగింపును సూచిస్తుంది. ఎఫ్8 ట్రిబ్యూటో రాకతో 488 జిటిబి మోడల్ నిలిచిపోనుంది.ఫెరారీ ఉత్పత్తి చేసే చివరి హైబ్రిడ్ కాని మిడ్-ఇంజిన్ V8 పవర్డ్ సూపర్ కార్‌గా ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో చరిత్రలో నిలిచిపోనుంది.

MOST READ:హ్యుందాయ్ కంపెనీ ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Most Read Articles

English summary
Ferrari seems to have silently introduced its F8 Tributo in the Indian market recently with a price tag starting at Rs 4.02 crore, ex-showroom (India). The Ferrari F8 Tributo is the brand's latest mid-engined supercar and a successor to the popular 488GTB. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X