Just In
Don't Miss
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- News
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
- Movies
‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్న ఫెరారీ
నేడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో క్షీణించింది. ఎందుకంటే ప్రమాదకరమైన ఈ వైరస్ ప్రభావం వల్ల చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ వైరస్ ప్రభావం ఒక్క ప్రజల మీద మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమపై కూడా పడింది. అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు, రవాణా అన్ని నిలిచిపోయాయి. ఈ కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది.

ఈ కరోనా ప్రభావం ఆటో మొబైల్ పరిశ్రమలపై చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రభావానికి లోనైనా వాటిలో ఒకటి, లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఫెరారీ. సాధారణంగా ఫెరారీ సంస్థ ఇటలీకి చెందినది.

ఫెరారీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్ల తయారీదారులలో ఒకరు. ప్రపంచంలో కరోనా వల్ల చనిపోతున్న బాధితుల సంఖ్య అధికంగా ఉన్న దేశాలలో ఒకటి ఇటలీ.

ఇటలీలో ఇప్పటికే సుమారు 86,500 మందికి కరోనా వైరస్ సోకింది. అంతే కాకుండా ఈ భయంకరమైన ఈ వైరస్ వల్ల ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 9,000 మందికి పైగా ఉన్నారు. ఎక్కువగా వ్యాపించిన కరోనా వైరస్ వల్ల ఫెరారీ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిపివేసింది. కరోనా సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.

ఫెరారీ వచ్చే నెలలో ఇటలీలోని తన తయారీ కర్మాగారంలో కార్ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనుంది. విడిభాగాలు సరఫరా చేస్తే, ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కరోనా వైరస్ సమస్య వచ్చే నెల మధ్య నాటికి పరిష్కరించే అవకాశం ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
MOST READ:కరోనా నివారణకు 1,500 కోట్లు విరాళం ప్రకటించిన టాటా గ్రూప్స్

ఉద్యోగుల భద్రత మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు అవసరమని కంపెనీ తెలిపింది. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కృషి చేస్తామని కంపెనీ తెలిపింది.అంతే కాకుండా ఉత్పత్తి నష్టాలను రూపుమాపడానికి యోచిస్తున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. ఫెరారీ కంపెనీ తన త్రైమాసిక లాభాలను మరియు వాటాదారుల ఫలితాలను మే 4 న ప్రకటించనున్నట్లు తెలిపింది.
MOST READ:కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్