డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

ఈ పండుగ సీజన్‌లో సరసమైన ధరకే మంచి డాట్సన్ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం 'డాట్సన్' దేశంలో విక్రయించే మొత్తం వాహనాల లైనప్‌పై (రెడి-గో, గో మరియు గో ప్లస్) ఆకర్షనీయమైన తగ్గింపులు, వివిధ రకాల ప్రయోజాలను ప్రకటించింది.

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

అక్టోబర్ 2020 నెలలో డాట్సన్ మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.47,500 రూపాయల వరకు విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ప్రారంభ బుకింగ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి మరియు ఇవి ఎంచుకునే మోడల్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31, 2020 మధ్య చేసిన కొనుగోళ్లపై మాత్రమే వర్తిస్తాయి. మోడల్ వారీగా ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

డాట్సన్ రెడి-గో

డాట్సన్ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ డాట్సన్ రెడి-గో హ్యాచ్‌బ్యాక్‌లోని అన్ని వేరియంట్లపై కంపెనీ గరిష్టంగా రూ.34,500 వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.7,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్-చేంజ్ బోనస్, రూ.5 ,000 కార్పొరేట్ ఆఫర్‌లు కలిసి ఉన్నాయి.

MOST READ: రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

ఈ మొత్తం ప్రయోజనాలతో పాటుగా అక్టోబర్ 15, 2020న లేదా అంతకు ముందే ఏదైనా డాట్సన్ మోడళ్లను బుక్ చేసే వినియోగదారులకు అదనంగా రూ.7,500 ప్రయోజనాలు లభిస్తాయి. భారత మార్కెట్లో డాట్సన్ రెడి-గో ధరలు రూ.2.83 లక్షల నుండి రూ.4.77 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

డాట్సన్ గో

ఈ నెలలో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.47,500 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.20,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది మరియు మీ పాత కారును డీలర్‌షిప్‌లో ఎక్సేంజ్ చేసుకునేటప్పుడు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

MOST READ: బ్లూటూత్ కనెక్టెడ్ కన్సోల్‌తో కొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, యాక్సెస్ 125 విడుదల

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

డాట్సన్ గో మోడల్‌పై కూడా ఇదివరకు చెప్పినట్లుగానే పరిమిత కాలపు ప్రారంభ బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్‌ను అక్టోబర్ 15, 2020న లేదా అంతకు ముందే బుక్ చేసుకున్నట్లయితే రూ.7,500 తగ్గింపు లభిస్తుంది. మార్కెట్లో డాట్సన్ గో ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.6.45 లక్షల మధ్యలో ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.6.25 లక్షల నుండి ప్రారంభమవుతాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది భారత్‌లో లభిస్తున్న అత్యంత చవకైన కారు.

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ మరియు కాంపాక్ట్ ఎమ్‌పివి అయిన డాట్సన్ గో ప్లస్ మోడల్‌పై ఈ పండుగ సీజన్‌లో గరిష్టంగా రూ.42,500 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో రూ.15,000 వరకు నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉంటాయి.

MOST READ: హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

వీటికి అదనంగా, అక్టోబర్ 15 లోపు డాట్సన్ గో ప్లస్ కాంపాక్ట్ ఎమ్‌పివిని బుక్ చేసుకునే వినియోగదారులకు రూ.7,500 ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్లో డాట్సన్ గో ప్లస్ ధరలు రూ.4.19 లక్షల నుంచి రూ.6.89 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ కాంపాక్ట్ ఎమ్‌పివిల మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ.40,000 మాత్రమే.

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

డాట్సన్ గో మరియు గో ప్లస్ రెండు మోడళ్లు కూడా 1.2-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఇవి 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ఈ ఇంజన్‌ల పవర్, టార్క్ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

MOST READ: రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

రెండు మోడళ్లలోని సివిటి వేరియంట్లు 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 77.5 బిహెచ్‌పి శక్తిని మరియు 4400 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. మాన్యువల్ వేరియంట్లు 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 68 బిహెచ్‌పి మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

మరోవైపు, డాట్సన్ రెడి-గో హ్యాచ్‌బ్యాక్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటి 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది టాప్-స్పెక్ వేరియంట్లో ఆఫర్ చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెద్ద ఇంజన్ ఆప్షనల్ 5-స్పీడ్ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

MOST READ: మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?

డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

డాట్సన్ కార్ల ఫెస్టివల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

డాట్సన్ అక్టోబర్ నెలలో దాని మొత్తం వాహనాల లైనప్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను, ప్రయోజనాలను అందిస్తోంది. ఈ దీపావళికి సరికొత్త కారును ఇంటికి తీసుకురావడానికి కొనుగోలు నిర్ణయం తీసుకోవడానికి వినియోగదారులకు సహాయం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిన్న కార్లపై ప్రకటించిన ఆఫర్లు పెద్దవనే చెప్పాలి.

Most Read Articles

English summary
Datsun has announced attractive discounts, benefits and special offers ahead of the upcoming festival of Diwali this year in India. The company is offering festive season discounts on its entire line-up of vehicles currently sold in the country: Redi-GO, GO and GO+. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X