డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా బిఎస్6 అతి త్వరలోనే మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త తరం మోడల్ ఇప్పటికే ఫోర్స్ మోటార్స్ డీలర్‌షిప్‌లను చేరుకుంటోంది. ఈ పరిణామం చూస్తుంటే, త్వరలోనే ఇది విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

ఫోర్స్ మోటార్స్ భారత మార్కెట్లో తమ మొత్తం వాహన శ్రేణిని ఇంకా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ మోటార్స్ తమ వాణిజ్య మరియు ప్రైవేట్ వాహనాలన్నింటినీ ప్రదర్శనకు ఉంచింది. ఫోర్స్ నుంచి రానున్న తొలి బిఎస్6 వాహనం కొత్త 2020 గుర్ఖా అయ్యే అవకాశం ఉంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

సబూ బ్రదర్స్ పోస్ట్ చేసిన తాజా చిత్రాల ప్రకారం, కొత్త ఫోర్స్ గూర్ఖా మార్కెట్లో విడుదల కావటానికి ముందే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటోంది. వాస్తవానికి ఈ ఏడాది జూలైలో ఈ ఆఫ్-రోడర్ మార్కెట్లో విడుదలవుతుందని భావించారు. కానీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా, దీని విడుదల మరింత జాప్యం అయ్యింది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

ఫోర్స్ మోటార్స్ తమ నెక్స్ట్-జెన్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ 2020 ఫోర్స్ గుర్ఖాను అనేక అధునాతన టెక్నాలజీ ఫీచర్లు మరియు మోడ్రన్ డిజైన్‌తో ఈ మోడల్‌ను లోపల మరియు బయట పూర్తిగా రీడిజైన్ చేసింది. కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు, కొత్త గ్రిల్, రెండు చివర్లలో రీడిజైన్ చేసిన బంపర్స్, ఎస్‌యూవీ చుట్టూ బాడీ క్లాడింగ్ మరియు స్కర్ట్స్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

కొత్త గుర్ఖా టాప్-స్పెక్ వేరియంట్లలో 245/70 టైర్ ప్రొఫైల్‌లతో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు. ఇందులోని పెద్ద వీల్ ఆర్చెస్ ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ బోల్డ్ డిజైన్‌ను మరింత ఎలివేట్ చేయటంలో తోడ్పడతాయి. కొత్త డిజైన్‌తో వస్తున్న 2020 ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ మెరుగైన రోడ్-ప్రెజెన్స్‌ను అందించనుంది.

MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లను కూడా భారీగా అప్‌గ్రేడ్ చేశారు. దీని ఇంటీరియర్ మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. డాష్‌బోర్డ్ మధ్యలో ఉంచిన కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్ఐడి డిస్‌ప్లేతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండవ వరుసలో వ్యక్తిగత సీట్లు మరియు కొత్తగా డిజైన్ చేసిన గుండ్రటి ఏసి వెంట్స్ వంటి వాటిని ఇందులో చూడొచ్చు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

కొత్త 2020 గూర్ఖా సేఫ్టీ పరంగా కూడా శభాష్ అనిపించుకోనుంది. అక్టోబర్ 2019 నుండి అమల్లోకి వచ్చిన కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా దీనిని అప్‌గ్రేడ్ చేశారు. వాహన యజమానులు మరియు పాదచారుల భద్రతను మరింత పెంచేలా కొత్త గూర్ఖా ఛాస్సిస్ మరియు బాడీషెల్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ మరియు స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.

MOST READ:కారులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లండి

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 ఫోర్స్ గూర్ఖాలో మునుపటి బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే 2.6-లీటర్ డీజిల్ ఇంజన్‌నే కొత్తగా బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించనున్నారు. ఇందులోని 2.6-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

ఇందులో ఆటోమేటిక్ ఆప్షన్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండకపోవచ్చని సమాచారం. కొత్త ఫోర్స్ గుర్ఖా ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ఇందులో మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు కష్టతరమైన భూభాగాలపై ప్రయాణించేందుకు వీలుగా లో-రేంజ్ గేర్‌బాక్స్ కూడా ఉంటాయని సమాచారం.

MOST READ:బెంగళూరులో ఒకినావా డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ : వివరాలు

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

కొత్త 2020 ఫోర్స్ గుర్ఖా మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలోని నెక్స్ట్ జనరేషన్ 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీతో పోటీ పడనుంది. అలాగే మారుతి సుజుకి నుంచి భవిష్యత్తులో విడుదలయ్యే జిమ్నీ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీకి కూడా పోటీగా నిలుస్తుంది. కొత్త తరం థార్ కూడా మరింత మెరుగైన డిజైన్‌తో మార్కెట్లోకి రానుంది. గుర్ఖాతో పోల్చుకుంటే థార్‌లో విభిన్న ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 ఫోర్స్ గుర్ఖా; త్వరలోనే విడుదల

ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త తరం 2020 ఫోర్స్ గూర్ఖా మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే అనేక అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి రాబోతోంది. దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ మరియు డిజైన్ ఫీచర్లలో అనేక మార్పులు ఉన్నాయి. భారత్‌లోని ఆఫ్-రోడ్ ప్రియులను ఇది ఖచ్చితంగా ఆకర్షించగలదనేది మా అభిప్రాయం.

Source: Saboo Brothers

Most Read Articles

English summary
Force Motors is yet to update its entire vehicle line-up to BS6 standards. The company had showcased its exhaustive line-up of commercial and private vehicles at the Auto Expo earlier this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X