Just In
- 1 hr ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
Don't Miss
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Sports
ఇదంతా ఓ కలలా ఉంది.. చాలా ఒత్తిడికి గురయ్యా: నటరాజన్
- Movies
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 2021లోనైనా కొత్త ఫోర్స్ గుర్ఖా వచ్చేనా? థార్‌కి పోటీ ఇచ్చేనా?
ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులు ఎంతో కాలం నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పట్లో మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దేశంలో బిఎస్-6 నిబంధనల నేపథ్యంలో, కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది.

అయితే, ఇందులో కొత్త బిఎస్6 వెర్షన్ గుర్ఖా ఆఫ్-రోడర్‌ను కంపెనీ ఈ ఏడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇప్పటికే ఈ మోడల్ భారత రోడ్లపై అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. ఒకానొక సందర్భంలో ఇది డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం.

వాస్తవానికి కొత్త 2020 మహీంద్రా థార్ కంటే ముందుగానే ఫోర్స్ గుర్ఖా మార్కెట్లోకి వస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. ఫోర్స్ మోటార్స్ తమ కొత్త గుర్ఖా విడుదల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా తమ కొత్త గుర్ఖా వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది.
MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

ఫోర్స్ గుర్ఖా విడుదలపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఈ మోడల్ కోసం వేచి చూస్తున్న ఆఫ్-రోడర్ ఔత్సాహికులను సైతం మహీంద్రా థార్ తనవైపుకు ఆకర్షించుకుంది. కానీ, ఫోర్స్ గుర్ఖా కోసం వేచిచూసే హార్డ్-కోర్ బ్రాండ్ ప్రియుల కోసం కంపెనీ తమ కొత్త మోడల్‌ను వచ్చే ఏడాది ప్రథమార్థంలోనైనా మార్కెట్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది.

నిజానికి ఫోర్స్ గుర్ఖా మార్కెట్ వాటా తక్కువే అయినప్పటికీ, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల్లో ఇది మహీంద్రా థార్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇందులోని మరో ప్రత్యేకమైన ఫీచర్ దాని విశాలమైన క్యాబిన్ మరియు అధిక సీటింగ్ సామర్థ్యం. అంతేకాకుండా, థార్ మాదిరిగానే గుర్ఖా కోసం కూడా అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు, ఆఫ్-రోడింగ్ యాక్ససరీలు అందుబాటులో ఉన్నాయి.
MOST READ:అటల్ టన్నెల్లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

కొత్త ఫోర్స్ గుర్ఖా ఈ ఏడాది జూలైలోనే మార్కెట్లో విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా, దీని విడుదల మరింత జాప్యం అవుతూ వస్తోంది. కొత్త థార్ రాకతో దేశంలో ఆఫ్-రోడింగ్ వాహనాలపై ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు మారుతి సుజుకి కూడా తమ 3-డోర్ జిమ్నీని భారత్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఫోర్స్ మోటార్స్ తమ గుర్ఖా మోడల్‌కు మార్కెట్లో సముచిత స్థానం కల్పించాలంటే, వీలైనంత త్వరగా దీనిని మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంలో ఫోర్స్ మోటార్స్ ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. కాగా, ఫోర్స్ మోటార్స్ తమ నెక్స్ట్-జెన్ ఆఫ్-రోడర్‌ను ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా తీర్చిదిద్దింది.
MOST READ:గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

కొత్త ఫోర్స్ గుర్ఖాలో కంపెనీ అనేక అధునాతన టెక్నాలజీ ఫీచర్లను జోడించనుంది. అంతేకాకుండా, లోపల మరియు బయట ఇది మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు, కొత్త గ్రిల్, రెండు చివర్లలో రీడిజైన్ చేసిన బంపర్స్, ఎస్‌యూవీ చుట్టూ బాడీ క్లాడింగ్ మరియు స్కర్ట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

కొత్త గుర్ఖా టాప్-స్పెక్ వేరియంట్లలో 245/70 టైర్ ప్రొఫైల్‌లతో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు. ఇందులోని పెద్ద వీల్ ఆర్చెస్ ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ బోల్డ్ డిజైన్‌ను మరింత ఎలివేట్ చేయటంలో తోడ్పడతాయి. కొత్త డిజైన్‌తో వస్తున్న ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ మునుపటి కన్నా మెరుగైన రోడ్-ప్రెజెన్స్‌ను అందించనుంది.
MOST READ:ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లను కూడా కంపెనీ భారీగా అప్‌గ్రేడ్ చేయనుంది. ఇందులో డాష్‌బోర్డ్ మధ్యలో ఉంచిన కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్ఐడి డిస్‌ప్లేతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండవ వరుసలో వ్యక్తిగత సీట్లు మరియు కొత్తగా డిజైన్ చేసిన గుండ్రటి ఏసి వెంట్స్ మొదలైన మార్పులు ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఫోర్స్ గూర్ఖా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో మునుపటి బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే 2.6-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కొత్తగా బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించనున్నారు. ఇందులోని 2.6-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త ఫోర్స్ గుర్ఖా ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ఇందులో మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు కష్టతరమైన భూభాగాలపై ప్రయాణించేందుకు వీలుగా లో-రేంజ్ గేర్‌బాక్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇంకా ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ మరియు స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

కొత్త ఫోర్స్ గుర్ఖా ఈ విభాగంలో ఇటీవలే విడుదలైన నెక్స్ట్ జనరేషన్ 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీ మరియు మారుతి సుజుకి నుంచి రానున్న జిమ్నీ వంటి ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.