8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

అమెరికన్ ఆటోమోటివ్ తయారీ సంస్థ అయిన ఫోర్డ్ తన 2020 ఎకోస్పోర్ట్ బిఎస్-6 శ్రేణి కాంపాక్ట్ ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఇది బిఎస్ 6 పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లను విడుదల చేసింది. వాటి ధరలు వరుసగా రూ. 8.04 లక్షలు, రూ. 8.54 లక్షలు(ఎక్స్‌షోరూమ్).

8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్ 6 మోడల్స్ ఎటువంటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో రావు. ఇప్పుడు వస్తున్న మోడల్స్ లో (హెచ్‌ఐడి) హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ హెడ్‌లైట్లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, ఆటోమేటిక్ వైపర్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూప్ రైల్ ని కలిగి ఉంటాయి.

8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో లెదర్ సీట్లు, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ మరియు ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా ఇవి ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ ఉన్నాయి.

8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

2020 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్ 6 మోడల్స్ ఇప్పుడు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. మొదటిది 1.5-లీటర్ మూడు సిలిండర్ల Ti-VCT పెట్రోల్ ఇంజన్. ఇది 118 బిహెచ్‌పి శక్తిని మరియు 149 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో ఐదు-స్పీడ్ మాన్యువల్ మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి.

8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

రెండవది 1.5-లీటర్ టిడిసిఐ డీజిల్ ఇంజన్. ఇది 98 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందించే భద్రతా లక్షణాలలో ఎబిఎస్ విత్ ఇబిడి తో పాటు ముందు రెండు ఎయిర్‌బ్యాగులు, డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్ బెల్ట్ అలారం, ఆటో క్రాష్-అన్‌లాక్ సిస్టమ్, ఆటో డోర్ లాక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. సాధారణంగా ఎకోస్పోర్ట్ బిఎస్ 6 మోడళ్లకు సర్వీస్ ఇంటెర్వల్స్10,000 కిలోమీటర్లు. కానీ ఫోర్డ్ మాత్రం మూడు సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల ప్రామాణిక వారంటీని కూడా అందిస్తోంది.

8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్ 6 మోడళ్ల కోసం ఉపకరణాల శ్రేణిని కూడా అందిస్తుంది. ఈ శ్రేణిలో స్పాయిలర్, స్పేర్ వీల్ కవర్, ఎయిర్ డిఫ్లెక్టర్లు ఉన్నాయి. ఇంటీరియర్స్ కోసం అనంతర ఉపకరణాల శ్రేణిలో వినైల్ సీట్ కవర్లు, ఎస్ఎస్ స్కఫ్ ప్లేట్లు, స్కఫ్ ప్లేట్లు, కార్పెట్ ఫ్లోర్ మాట్స్, సన్ బ్లైండ్స్, యాంబియంట్ లైటింగ్ మరియు వెనుక సీట్ ఎంటర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ లు ఉన్నాయి.

8.04 లక్షల నుండి ప్రారంభమైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్-6 మోడల్ కార్స్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

బిఎస్ 6 యొక్క 13 మోడళ్లలో దాదాపు 11 మోడళ్లకు 13,000 రూపాయల పెరుగుదల ఖచ్చితంగా సమర్థించబడుతోంది. ఖర్చులను కనిష్టంగా ఉంచడంలో పాటు ఫోర్డ్ అద్భుతమైన పని చేసిందని మేము భావిస్తున్నాము. ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ లో ఉన్న ఫీచర్స్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford EcoSport BS6 Models Launched Starting At Rs 8.04 Lakh. Read in Telugu.
Story first published: Tuesday, January 21, 2020, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X