విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం, ఫోర్డ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్ బీఎస్6 మోడళ్లను లాంచ్ చేసింది. టైటానియం 4X2 ఆటోమేటిక్, టైటానియం+ 4X2 ఆటోమేటిక్ మరియు టైటానియం+ 4X4 ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్లలో విడుదలైన బీఎస్6 ఫోర్డ్ ఎండీవర్ ప్రారంభ ధర రూ. 29.55 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

సందర్భంగా ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ అనురాగ్ మెహ్తా మాట్లాడుతూ, "సరికొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్ బీఎస్6 విడుదలతో కస్టమర్లకు అద్వితీయమైన పర్ఫామెన్స్ మరియు అసాధ్యమైన క్లాస్ లీడింగ్ మైలేజ్ అందిస్తున్నాము. విలువలకు తగ్గ ధరలు, ఎంచుకోదగిన వేరియంట్లు, కొత్తగా ఎస్‌యూవీ కొనుగోలు చేసే కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్‌గా ఎండీవర్‌ను తీసుకొచ్చామని తెలిపారు."

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

2020 ఫోర్డ్ ఎండీవర్ చూడటానికి అచ్చం బీఎస్4 మోడళ్ల తరహాలోనే ఉంటుంది. ఇందులో అధునాతన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫోర్డ్ కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ది చేసిన మొబిలిటీ మరియు కనెక్టివిటీ టెక్నాలజీ ఫోర్డ్‌పాస్‌ను ఎండీవర్ ఎస్‌యూవీలో ప్రవేశపెట్టారు.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

స్టార్ట్/స్టాప్, వెహికల్ లాకింగ్ మరియు అన్-లాకింగ్ ఫంక్షన్, చేతిలో ఉన్న కీరిమోట్ ద్వారా వెహికల్ ఎక్కడుందో కనిపెట్టడం, మిగిలి ఉన్న ఫ్యూయల్‌తో ఎంత దూరం ప్రయాణించగలం, మైలేజ్ ఇంకా ఎన్నో డ్రైవర్ సంభందిత సమాచారాన్ని అందించే మల్టీ ఇన్ఫర్మేషన్ కన్సోల్ ఉంది.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇందులో టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యధావిధిగా వచ్చింది. 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనుసంధానం గల సింక్3 సిస్టమ్, ఇది ఆపిల్ కార్‌ప్లే మరియి ఆండ్రాయిడ్ అప్లికేషన్లను కూడా సపోర్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద ఎస్‌యూవీల్లోతప్పనిసరిగా కనిపించే పానరొమిక్ సన్‌రూఫ్ వచ్చింది.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

2020 ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో సెమీ-ఆటో ప్యార్లల్ పార్క్ అసిస్ట్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, ఎలక్ట్రిక్ రియర్ గేట్, 8-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం గల డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీటు. వీటితో పాటు లాంచ్ అసిస్ట్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ టెక్నాలజీ కూడా కలదు.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ఇంజన్‌లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగనప్పటికీ, అదే మునుపటి 2.0-లీటర్ ఇకోబ్లూ డీజల్ ఇంజన్‌ను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇది సుమారుగా 168బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

ట్రాన్స్‌మిషన్ పరంగా 2020 ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చింది. ఇండియాలో గేర్‌బాక్స్ పరిచయం కావడం ఇదే తొలిసారి. ఫోర్డ్ కథనం మేరకు, గేర్ల మధ్య లభించే పవర్ మరియు యాక్సిలరేషన్ గ్యాప్ తగ్గిస్తుంది మరరియు దాదాపు అన్ని సందర్భాల్లో స్మూత్ యాక్సిలరేషన్ రెస్పాన్స్ కల్పిస్తుంది. గేర్‌బాక్స్‌లో ప్రొగ్రెసివ్ రేంజ్ సెలక్ట్ లేదా సెలెక్ట్‌షిప్ట్ అనే ఫీచర్లను అందించినట్లు ఫోర్డ్ పేర్కొంది.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

సరికొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్ బీఎస్6 వేరియంట్ల ధరల శ్రేణి రూ.29.55 లక్షల నుండి రూ. 33.25 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. ఏప్రిల్ 30 వరకు మాత్రమే ధరలు ఉంటాయి. మే ప్రారంభం నుండి ఒక్కో వేరియంట్ మీద సుమారుగా రూ. 80,000 వరకూ ధర పెరిగే అవకాశం ఉంది.

విపణిలోకి 2020 ఫోర్డ్ ఎండీవర్ విడుదల: ధరలు ఎలా ఉన్నాయంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా తమ హై-ఎండ్ మోడల్ ఎండీవర్ ఎస్‌యూవీని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా, భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బీఎస్6 ప్రమాణాలతో సరికొత్తగా తీసుకొచ్చింది. లక్షల రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే బీఎస్6 ఎండీవర్‌ను తీసుకొచ్చి మార్కెట్ దిగ్గజాలను ఆశ్చర్యపరిచింది. 2020 బీఎస్6 ఫోర్డ్ ఎండీవర్ విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్‌కు సరాసరి పోటీనిస్తోంది.


Most Read Articles

English summary
Ford Endeavour BS6 2020 Models Launched In India Starting At Rs 29.55 Lakh, Ex-Showroom, Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X