ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో తమ వినియోగదారుల కోసం కొన్ని కొత్త ఫైనాన్స్ స్కీమ్‌లను పరిచయం చేసింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి సమయంలో ఫోర్డ్ వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఫోర్డ్ ఇండియా ఈ కొత్త ఫైనాన్స్ పథకాలను ప్రకటించింది.

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త ఫైనాన్స్ పథకాలలో ఆరు నెలల ఈఎమ్ఐ తాత్కాలిక నిషేధం, తక్కువ నెలవారీ వాయిదాలు మరియు స్టెప్-అప్ ఈఎమ్ఐ ఫార్మాట్ వంటి వివిధ సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ఆప్షన్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ ఫైనాన్స్ స్కీమ్స్ అన్నీ కూడా వాహన యాజమాన్యం యొక్క ప్రారంభ వ్యయాన్ని తగ్గిస్తాయని కంపెనీ తెలిపింది.

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ ఇండియా అందిస్తున్న మొత్తం లైనప్‌లో ఎంపిక చేసిన మూడు మోడళ్లపై మాత్రమే ఈ కొత్త ఫైనాన్స్ పథకాలు వర్తిస్తాయి మరియు ఇవి జూలై 31, 2020 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఫ్రీస్టైల్, ఆస్పైర్ మోడళ్లపై మాత్రమే ఈ ఫైనాన్స్ పథకాలకు అమల్లో ఉంటాయి.

MOST READ:ట్రయంఫ్ 2020 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ మరింత కాస్ట్లీ, ఎంతో తెలుసా !

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

ఆరు నెలల ఈఎమ్ఐ తాత్కాలిక నిషేధ పథకం కింద, వినియోగదారులకు గరిష్టంగా ఐదేళ్ల రుణ వ్యవధిని అందిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసిన 7వ నెల తర్వాత నుండి మాత్రమే రెగ్యులర్ ఈఎమ్ఐలు ప్రారంభమవుతాయి. ఒకవేళ వినియోగదారులు ప్రీ-పేమెంట్ చేసి రుణాన్ని క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తే, అదనపు ఫోర్స్‌క్లోజర్ ఛార్జీలు వర్తిస్తాయని కంపెనీ వివరించింది.

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి ఈ పథకం క్రింద ఈఎమ్ఐ మొత్తం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కస్టమర్ 8.99 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకున్నట్లయితే, రుణ మొత్తంలో లక్షకు రూ.2,362 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫ్రీస్టైల్, ఆస్పైర్ మరియు ఫిగో వంటి ఇతర మోడళ్లు 9.50 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే లక్షకు రూ.2,394 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:కరోనా నివారణ కోసం మరో కొత్త చర్య తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ; అదేంటో తెలుసా

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

స్టప్అప్ ఫైనాన్స్ పథకం విషయానికి వస్తే, ఈ స్కీమ్‌పై అందించే గరిష్ట రుణ పదవీకాలం కూడా ఐదేళ్ళు గానే ఉంటుంది. అయితే, మారటోరియం పథకం కంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పథకంలో, ప్రారంభ ఈఎమ్ఐలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైనాన్స్ స్ట్రక్చర్‌ను బట్టి రుణ పదవీకాలం క్రమంగా పెరుగుతుంది.

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

స్టెప్-అప్ పథకం కింద ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ సంవత్సరానికి 8.99 చొప్పున వడ్డీ రేటుతో లక్షకు రూ.1,727 తక్కువ ఈఎమ్ఐతో ప్రారంభమవుతుంది. ఫైనాన్స్ పథకం కింద అర్హత ఉన్న ఇతర కార్ల కోసం, వినియోగదారులు లక్షకు రూ.1,777 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది, వాటికి వడ్డీ రేటు 10.15 శాతంగా ఉంటుంది.

MOST READ:మళ్ళీ పడిపోయిన పెట్రోల్ - డీజిల్ అమ్మకాలు ; ఎందుకంటే ?

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ అందించే ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎండీవర్ ఎస్‌యూవీ కోసం సంస్థ ఎలాంటి కొత్త ఫైనాన్స్ పథకాలను ఇవ్వటం లేదు. అయితే, అమ్మకాలను పెంచుకోవటం కోసం ఈ నెలలో కొన్ని డీలర్-స్థాయి ఆఫర్లు, డిస్కౌంట్లను ఈ మోడల్‌పై ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్డ్‌కి సంబంధిత ఇతర వార్తలను గమనిస్తే, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్-ఎస్‌యూవీ మోడల్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఏటి అని పిలువబడే ఈ కొత్త వేరియంట్ ధర రూ.10.67 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:3000 హార్స్‌పవర్ ఇంజన్ కల్గిన అత్యంత వేగవంతమైన హైపర్ కార్

ఎంపిక చేసిన ఫోర్డ్ మోడళ్లపై కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ ఇండియా కొత్త ఫైనాన్స్ స్కీమ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత ఆర్థిక అస్థిరత సమయంలో వాహన తయారీదారులు తమ వినియోగదారులకు సులభంగా వాహన యాజమాన్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఫోర్డ్ ఇండియా కూడా ఇదే బాటలో తమ కస్టమర్లకు కొత్త ఫైనాన్స్ స్కీమ్‌లను అందిస్తోంది. సౌకర్యవంతమైన మరియు సులువుగా తిరిగి చెల్లించగలిగే ఎంపికలతో రుణ సౌకర్యాన్ని అందిస్తోంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India has announced new finance schemes to support its customers to make a purchase decision during the ongoing pandemic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X