ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ "ఫోర్డ్ ఎండీవర్"లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ పేరుతో రానున్న ఈ మోడల్‌ను కంపెనీ సెప్టెంబర్ 22న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

ఇందుకు సంబంధించి ఫోర్డ్ ఇండియా తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. స్టాండర్డ్ ఎండీవర్‌తో పోల్చుకుంటే ఎండీవర్ స్పోర్ట్‌లో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలు ఇప్పటికే వివిధ స్పై చిత్రాల రూపంలో వెల్లడయ్యాయి.

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ ఎక్స్‌టీరియర్లలో కొన్ని డిజైన్ ఫీచర్లను ప్రత్యేకంగా నలుపు రంగులో కస్టమైజ్ చేశారు. ముఖ్యంగా దీని ముందు భాగంలో ఫ్రంట్ గ్రిల్, దిగువ బంపర్‌లను పూర్తిగా నలుపు రంగులో ఫినిష్ చేశారు. అలాగే సైడ్ మిర్రర్స్‌పై బ్లాక్-ఇన్సర్ట్స్, రియర్ నేమ్-ప్లేట్ మరియు అల్లాయ్ వీల్స్‌కు బ్లాక్ డీటేలింగ్ ఇచ్చారు.

MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

ఎస్‌యూవీ వెనుక వైపు స్పోర్ట్ బ్యాడ్జింగ్‌తో పాటు సైడ్ స్టెప్‌ను కూడా నలుపు రంగులోనే డిజైన్ చేశారు. ఇంటీరియర్స్‌లో కూడా ఎక్స్‌టీరియర్ బ్లాక్ కలర్ థీమ్‌కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్-అవుట్ థీమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో మార్పులు కేవలం కాస్మెటిక్ మార్పులుగానే ఉండనున్నాయి. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలో బిఎస్6 2.0 లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

ఈ ఇంజన్ ఫోర్డ్ బ్రాండ్ యొక్క ‘సెలెక్ట్-షిఫ్ట్' టెక్నాలజీతో తయారు చేసిన 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని టాప్-ఎండ్ వేరియంట్లో ఆప్షనల్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కూడా ఆఫర్ చేస్తున్నారు.

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

కొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్‌లో ఆల్-ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

అంతేకాకుండా, ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ‘ఫోర్డ్‌పాస్' కూడా లభిస్తుంది. దీని సాయంతో వాహన యజమానులు తమ ఎస్‌యూవీని రిమోట్‌గా నియంత్రించడం మరియు వాహన సమాచారాన్ని తెలుసుకోవడం చేయవచ్చు. ఇంకా ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్, టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ధరలు రూ.29.99 లక్షల నుండి రూ.33.42 లక్షల మధ్యలో ఉన్నాయి ( ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్ మోడల్‌ను ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ టైటానియం ప్లస్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది. ఫలితంగా దీని ధర కూడా అధికంగా ఉండొచ్చని అంచనా.

MOST READ:700 కి.మీ ప్రయాణించినా పరీక్ష రాయడానికి నిరాకరించబడిన విద్యార్థి.. కారణం ఏంటో తెలుసా

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టీజర్; సెప్టెంబర్ 22న విడుదల

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ డేట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫుల్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఈ ఎస్‌యూవీ గంభీరమైన రోడ్ ప్రెజన్స్‌ను కలిగి ఉంటుంది. ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ బ్లాక్ కలర్ థీమ్‌తో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎస్‌యూవీకి మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను అందించే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford has teased the upcoming Endeavour Sport SUV In the Indian market. The Endeavour Sport variant of the SUV will be launching on September 22, 2020. The company has released a teaser on all its social media channels. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X