17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

అమెరికన్ కార్ బ్రాండ్ 'ఫోర్డ్ మోటార్ కంపెనీ' అందిస్తున్న పవర్‌ఫుల్ పెర్మార్మెన్స్ కార్ 'ఫోర్డ్ మస్టాంగ్'లో ఓ సరికొత్త 2021 మోడల్‌ను ఈ బ్రాండ్ ప్రపంచానికి పరిచయం చేసింది. సుమారు 17 ఏళ్ల క్రితం ఫోర్డ్ ఉపయోగించిన 'మాక్ 1' (Mach 1) అనే పేరుకు తిరిగి జీవం పోస్తూ 'ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1' (Ford Mustang Mach 1) అనే కొత్త మోడల్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ఇదివరకు ప్రాచుర్యంలో ఉన్న మాక్ 1 మోడళ్ల నుంచి స్పూర్తి పొంది మస్టాంగ్ జిటి, షెల్బీ మోడళ్లను కలిపి ఈ హై-పెర్ఫార్మెన్స్ ఫాస్ట్‌బ్యాక్ కూప్ మోడల్‌ను డిజైన్ చేశారు.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1 గత 1969లో బాగా పాపులర్ అయిన ఒరిజినల్ మాక్ 1 మోడల్ డిజైన్ అంశాలను పోలి ఉంటుంది. ఈ కారులో సర్క్యులర్ ఇన్‌సెర్ట్‌లతో కూడిన త్రీడైమెన్షనల్ మెష్ గ్రిల్ ఎయిర్ డ్యామ్ అంత రెట్టింపు సైజులో ఉంటుంది. గత 1969 మోడళ్లలో హెడ్‌లైట్లను ఉపయోగించిన చోట ఈ కొత్త మోడల్‌లోఇన్‌సెర్ట్‌లను అమర్చారు.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

కొత్త 2021 ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1 కారులో పెద్ద ఎయిర్‌డ్యామ్‌లు, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, ఈ వీల్స్ రెండు డిజైన్ ఆప్షన్లలో లభిస్తాయి, స్పోర్టీ అండ్ అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రండ్ డిజైన్, గుర్ని ఫ్లాప్‌తో ఉండే రియర్ స్పాయిలర్ ఉంటాయి. ఈ 19 ఇంచ్ వీల్స్‌కు మిచెలిన్ పిఎస్4 టైర్లను అమర్చబడి ఉంటాయి.

MOST READ: ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

దీని ఇంటీరియర్‌ను గమనిస్తే, ఇందులో అల్యూమినియం యాక్సెంట్స్‌తో కూడిన కొత్త డార్క్ స్పిన్‌డ్రిఫ్ట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, కొత్త డోర్ సిల్ ప్లేట్స్, అప్‌గ్రేడ్ చేయబడిన 12.3 ఇంచ్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

ఈ కారులోని ఇతర డిజైన్ అంశాలను గమనిస్తే, ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ల కోసం క్యూ బాల్ స్టైల్‌లో గేర్ షిఫ్టర్ నాబ్ ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేకమైన కారు గుర్తింపును సంఖ్యను స్పష్టంగా తెలియజేసేలా కారుపై ముద్రించబడిన బ్యాడ్జ్ ఉంటుంది.

MOST READ: వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త 2021 ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ 1 కారులో 5.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ V8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 473 బ్రేక్ హార్స్‌పవర్‌ల శక్తిని మరియు 569 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ట్రెమెక్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

మాక్ 1 ఇంజన్‌లో ఉపయోగించిన ఇన్‌టేక్ మానిఫోల్డ్, ఆయిల్ ఫిల్టర్ అడాప్టర్ మరియు ఇంజన్ ఆయిల్ కూలర్‌లను షెల్బీ జిటి350 వేరియంట్ నుండి గ్రహించారు.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

ఈ కారులో సాధ్యమైనంత ఎక్కువ పెర్ఫార్మెన్స్‌ను సాధించేందుకు గాను ఫోర్డ్ కంపెనీ ఇందులోని మాగ్నెరైడ్ క్యాలిబ్రేషన్, EPAS క్యాలిబ్రేషన్, స్టీరింగ్ షాఫ్ట్, స్వే బార్స్ మరియు ఫ్రంట్ స్ప్రింగ్‌లపై రీవర్క్ చేసింది. వీటికి అదనంగా, మాక్ 1 కారులో బ్రేక్ బూస్టర్‌ను అమర్చారు.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

కొత్త 2021 ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1 కారులోని ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో డౌన్‌ఫోర్స్‌ను పెంచడానికి స్టాండర్డ్ మస్టాంగ్‌తో పోలిస్తే ఈ మాక్ 1 మోడల్‌లో అండర్‌బాడీని 20 ఇంచ్‌ల వరకూ విస్తరించారు.

MOST READ: రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

ఫోర్డ్ మోటార్ కంపెనీ ఈ సరికొత్త 'ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1' కారును వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయనుంది. అయితే ఈ వాహనం భారత మార్కెట్‌కు వస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

జనరల్ ట్రివియా:

1968లో రేసు కారు డ్రైవర్లు డానీ ఒంగైస్, మిక్కీ థాంప్సన్‌లు మూడు మస్టాంగ్ మాక్ 1 మోడళ్లను బోన్‌విల్లే సాల్ట్ ఫ్లాట్లకు తీసుకెళ్లి 24 గంటల వ్యవధిలో 295 రికార్డులను నెలకొల్పారు.

MOST READ: కరోనా టెస్ట్ చేసుకోవడానికి ఇలా కూడా చేస్తారా..?

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

ఫోర్డ్ మస్టాంగ్‌కు 1969వ సంవత్సరాన్ని ‘ది' ఇయర్‌గా చెప్పుకునేవారు. అప్పట్లో ఈ కారు హవానే ఉండేది. అప్పట్లో మాక్ 1 మోడల్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సమయంలోనే ఫోర్డ్ మొత్తం 72,458 మస్టాంగ్ మాక్ 1 మోడళ్లను విక్రయించింది. దాని ఇంజన్, పెర్ఫామెన్స్‌లే ఈ విజయానికి కారణమయ్యాయి.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

1969 మోడల్ మాక్ 1 కారులో పవర్‌ఫుల్ 5.8 లీటర్ 2వి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 3-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో 6.4-లీటర్ ఇంజన్, మరియు 7.0-లీటర్ కోబ్రా జెట్ 4వి ఇంజన్‌లు కూడా ఆఫర్‌లో ఉండేవి.

17 ఏళ్ల తర్వాత తిరిగి ప్రాణం పోసుకున్న ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1

ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1 2020 మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆ రోజుల్లో ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1 బాగా ప్రాచుర్యం పొందిన కారు, కాబట్టి ఈ 2021 మోడల్ కూడా అదేరకమైన పనితీరుతో దాని పేరును నిలబెట్టుకుంటుందని మేము భావిస్తున్నాము. ప్రస్తుతం ఫోర్డ్ మస్టాంగ్ భారత మార్కెట్లో రూ .74.61 లక్షలకు అమ్ముడవుతోంది, ఈ నేపథ్యంలో మాక్ 1 భారత్‌లో విడుదలైతే దాని ధర సుమారు కోటి రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
American auto manufacturer, Ford Motor Company, has officially unveiled its Ford Mustang Mach 1, thereby resurrecting the Mach 1 name after 17 years. The high-performance fastback coupe sports a mix of the Mustang GT, the Shelby models, and has been inspired by the older Mach 1 models. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X