ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫోర్డ్ ఇండియా తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'ఫోర్డ్ ఫిగో'లో ఓ కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ ఫిగో త్వరలోనే ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం, కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను ఆగస్టు చివరి భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యం కానుంది.

ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫోర్డ్ ఫిగో కారులో ఉపయోగించనున్న కొత్త సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను దాని పెద్దన్న అయిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్-ఎస్‌యూవీని గ్రహించనున్నారు. దీనిని ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఆప్షనల్‌గా విక్రయించనున్నారు. ఇందులో స్టాండర్డ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా లభిస్తుంది.

MOST READ:బటర్ చికెన్ పై ప్రేమ 1.25 లక్షల జరిమానా కట్టేలా చేసింది, ఎలానో మీరే చూడండి

ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫోర్డ్ ఫిగో కారును చివరిగా మార్చి 2019లో పలు కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో మార్కెట్లో విడుదల చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2020లో, ఇందులో బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్ ఆప్షన్లను అప్‌గ్రేడ్ చేశారు.

ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫోర్డ్ ఫిగో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ 96 బిహెచ్‌పి శక్తిని మరియు 120 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం, రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభిస్తున్నాయి.

MOST READ:కొత్త 2020 వెస్పా స్కూటర్లు విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లో కంపెనీ అదనంగా ఇందులో పాడిల్-షిఫ్టర్లను కూడా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ హ్యాచ్‌బ్యాక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి సహాయపడుతుంది మరియు మరింత సరదాగా డ్రైవ్ చేసే అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది.

ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫోర్డ్ ఫిగో పెట్రోల్ ఆటోమేటిక్ ధరలు దాని మాన్యువల్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. కొత్త ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ భారత మార్కెట్లో విడుదలైతే, వాటి ప్రారంభ ధర సుమారు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉండొచ్చని అంచనా. ఇది దేశీయ విపణిలో టాటా టియాగో, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:సూపర్ లుక్ లో ఉన్న మోడిఫైడ్ ఫోర్డ్ జీప్ [వీడియో]

ఫోర్డ్ ఫిగో కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత ఫోర్డ్ ఫిగో ఇప్పటి వరకూ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించేంది. అయితే, ఇప్పుడు ఇందులో ఆటోమేటిక్ అందుబాటులోకి వస్తే, ఈ కారు ఎర్గోడైనమిక్స్‌కి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత అయితే, డ్రైవ్ చేయటానికి ఇది చాలా సరదాగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India is all set to introduce an automatic transmission to its entry-level Figo hatchback in the Indian market. The Ford Figo will soon receive a six-speed torque-converter automatic transmission as optional. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X