కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

అమెరికన్ కార్ కంపెనీ "ఫోర్డ్ మోటార్స్" భారత మార్కెట్లో విక్రయిస్తున్న "ఫోర్డ్ మస్టాంగ్"లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమవుతున్న కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కారుని వచ్చే ఏడాది నాటికి ఇండియాలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఫోర్డ్ మస్టాంగ్ కారును తొలిసారిగా 2016లో ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విడుదల చేసింది. అప్పటి నుండి ఫోర్డ్ సుమారు 450 యూనిట్లకు మస్టాంగ్ కార్లను విక్రయించింది. బిఎస్6 నిబంధనల కారణంగా, ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ కారుని భారత మార్కెట్లో విక్రయించడం లేదు. అయితే, ఇది మన దేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోకార్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, అమెరికన్ మార్కెట్లో విక్రయించబడిన 2020 మస్టాంగ్ ఈ సంవత్సరం చివరినాటికి లేదా 2021 ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఫోర్డ్ మస్టాంగ్ విభిన్న ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 310 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే ఎంట్రీ లెవల్ 2.3-లీటర్ ఎకోబూస్ట్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 445 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే మిడ్-స్పెక్ 5.0-లీటర్ వి8 ఇంజన్ మరియు 525 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే టాప్-స్పెక్ షెల్బీ జిటి 350 వి8 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

MOST READ:భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

తాజా నివేదికల ప్రకారం, 2020 ఫోర్డ్ మస్టాంగ్‌లోని 5.0-లీటర్ వి8 ఇంజన్‌తో మిడ్-స్పెక్ జిటి వేరియంట్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 445 బిహెచ్‌పి శక్తిని మరియు 533 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది. ఇందులోని ఆటోమేటిక్ వేరియంట్ ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఈ ఇంజన్‌లో కాస్ట్-అల్యూమినియం పిస్టన్స్, ఫోర్జ్డ్ కనెక్టింగ్ రాడ్స్, డ్యూయెల్ ఇంజెక్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, స్టీరింగ్ వీల్‌పై ప్యాడల్ షిఫ్టర్స్, బ్రెంబో నుండి సేకరించిన 6-పిస్టన్ కాలిపర్‌లతో పెద్ద డిస్క్ బ్రేక్‌లు ఈ కారుకి మరింత స్పోర్టీ ఫీచర్లను జోడిస్తుంది.

MOST READ:రాళ్ళలో చిక్కుకున్న ఇన్నోవా కారును బయటకు తీసిన మహీంద్రా బొలెరో [వీడియో]

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ జిటి మునుపటి తరం మోడళ్లతో పోల్చుకుంటే మరింత విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎయిర్ ఫ్లో-షేపింగ్ వేన్లతో కూడిన కొత్త చిన్ డిజైన్, రియర్ ఫేసింగ్ వెంట్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బానెట్, కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ వంటి డిజైన్ మార్పులను ఈ కొత్త కారులో గమనించవచ్చు.

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ జిటిలో సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది మరియు డ్రైవింగ్ మోడ్‌ను బట్టి దీని లేఅవుట్‌ను మారుతూ ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లతో పాటుగా బ్రాండ్ యొక్క సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్ : మహిళా ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన, ఏంటో చూసారా ?

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆల్-బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్స్, పవర్-అడ్జస్టబల్ సీట్స్, క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్‌తో కూడిన రియర్ వ్యూ కెమెరా, అనేక ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-కొల్లైజన్ అలెర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబిఎస్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

కొత్త 2020 ఫోర్డ్ మస్టాంగ్ కారు ఇండియన్ ఎంట్రీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఐకానిక్ ఫోర్డ్ మస్టాంగ్ కారుకు భారతీయ మార్కెట్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ స్పోర్ట్స్ కారు దాని మజిక్యులర్ డిజైన్ మరియు గొప్ప చరిత్రతో చాలా మందిని ఆకట్టుకుంది. భారత మార్కెట్లో ఫోర్డ్ మస్టాంగ్ విడుదలైతే దీని ధర సుమారు రూ.75 లక్షలు ఉండొచ్చని అంచనా.

Source: Autocar India

MOST READ:రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
The Ford Mustang is an iconic muscle car from the American automaker that is currently being sold in various international markets including India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X