Just In
- 9 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్
గ్రేట్ వాల్ మోటార్స్ ఇప్పుడు ఆర్ 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. గ్రేట్ వాల్ మోటార్స్ నుండి వచ్చిన ఆర్ 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఆటో ఎక్స్‌పో 2020 లో భారత్‌లోకి అడుగుపెట్టింది. జిడబ్ల్యుఎం ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చౌకైన కారు.

ప్రస్తుతం ఇది చైనాలో లభిస్తుంది. ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లో దాదాపు రూ. 7 నుంచి 8 లక్షల ధరను కలిగి ఉంది. ఆటో ఎక్స్‌పో 2020 లో చైనా బ్రాండ్ నుంచి ప్రదర్శించిన 10 మోడల్స్ లో జిడబ్ల్యుఎం ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ఒకటి.

జిడబ్ల్యుఎం ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ఆల్-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సెలెరియో కంటే చిన్నగా ఉంటుంది. చిన్న ఆర్ 1 ఎలక్ట్రిక్ ప్రయాణికులకు చాలా ననుకూలంగా ఉంటుంది. ఇది 33kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 47 బిహెచ్‌పి మరియు 125 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు మంచి పనితీరును కలిగి ఉంటుంది. ఈ ఈఎలెక్ట్రిక్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. ఇది ప్రామాణిక మరియు వేగవంతమైన ఛార్జింగ్ సాంకేతిక పరిజ్ఞానాలతో కూడా వస్తుంది. బ్యాటరీలు కేవలం 40 నిమిషాల్లోపు 80% వరకు ఛార్జ్ చేయడానికి వీలుగా ఉంటాయి.

కారు చాలా చౌకగా ఉన్నప్పటికీ ఇది అనేక ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఎబిడితో ఎబిఎస్, రెండు ఎయిర్‌బ్యాగులు, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఆటో ఎక్స్‌పో 2020 మొదటి రోజున వాహనాలు చాలా వరకు తమ ఉనికిని చాటుకున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఈ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించడం జరిగింది. గ్రేట్ వాల్ మోటార్స్ ఆర్ 1 ఎలక్ట్రిక్ ఇంకా అతి తక్కువ కాలంలోనే ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నట్లు ప్రకటించింది.