మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

చైనాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హైమా (Haima) ఢిల్లీ వేదికగా జరిగిన 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో విభిన్న మోడళ్లను ఆవిష్కరించింది. అయితే అన్నీ ఎలక్ట్రిక్ కార్లే కావడం గమనార్హం. అధిక సంఖ్యలో సేల్స్ మరియు ఉత్పత్తే లక్ష్యంగా దేశీయ విపణిలోకి ప్రవేశించిన హైమా గురించి పూర్తి వివరాలు..

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో 2020 ఆటో ఎక్స్‌పో ఫిబ్రవరి 5 నుండి 12 వరకూ ఏడు రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ కంపెనీలతో పాటు ఎన్నో విదేశీ కంపెనీలు తమ కొత్త కార్లను ఆవిష్కరించాయి, ఇందులో చైనీస్ కంపెనీలు కూడా ఉన్నాయి.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

పలు చైనీస్ కంపెనీలు అధిక సంఖ్యలో తమ కార్లను ఇండియన్ మార్కెట్ కోసం ప్రవేశపెట్టాయి. అందులో హైమా అతి ముఖ్యమైన బ్రాండ్. హైమా ఎలక్ట్రిక్ కార్ల సంస్థ 7X, 8S మరియు E1 కార్లు ఉన్నాయి. వీటిన్నింటిలో కెల్లా హైమా ఇ1 అతి ముఖ్యమైన మోడల్.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

సమాచారం వర్గాల కథనం మేరకు, హైమా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోయే తొలి మోడల్ హైమా ఇ1 అని తెలుస్తోంది. 2021 చివరి నాటికి లేదా 2022 ప్రారంభం నాటికి దీనిని విడుదల చేసే అవకాశం ఉంది.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

హైమా ఇ1 పూర్తి స్థాయిలో విడుదలైతే, అతి చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారుకా నిలుస్తుంది. ఇది విపణిలో ఉన్న మహీంద్రా ఇకెయువి100 స్మాల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సరాసరి పోటీనిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 54బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

హైమా ఇ1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారులో 28.5kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ సెటప్ కలదు. పూర్తి ఛార్జింగ్ మీద ఇది గరిష్టంగా 301కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నిజజీవితంలో రోజువారీ అవసరాలకు ఈ కార బాగా సరిపోతుంది. ఎలక్ట్రిక్ రేంజ్ కూడా బాగానే ఉంది.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

హైమా ఆటోమొబైల్ గ్రూపు చైనా మార్కెట్లో కొత్త కంపెనీ ఏం కాదు, చైనాలో ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థల్లో ఇదీ ఒకటి. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్, మార్కెట్ మరియు కస్టమర్ల అవసరాల నేపథ్యంలో ఇ1 మోడల్‌ను తమ తొలి మోడల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

హైమా ఇ1 అత్యంత సరసమైన ధరలో రానుంది. నిజానికి పెట్రోల్ మరియు డీజల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు చాలా ఖరీదైనవి. అయితే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో దీనిని రూ. 10 లక్షల ధరల శ్రేణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం, దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ కార్లకు అంత డిమాండ్ లేకపోవడం మరియు ఇవి అంత పాపులర్ కాకపోవడం అని చెప్పుకోవచ్చు. డిమాండ్ పెరిగి, పోటీ పెరిగితే వీటి ధరలు కూడా దిగొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హ్యుందాయ్, రెనో మరియు ఎంజీ మోటార్స్ రూ. 10 లక్షల ధరల శ్రేణిలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మార్కెట్లోకి మరో కొత్త కారు.. ధర తెలిస్తే ఖచ్చితంగా కొంటారు?

ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లను దూరం పెట్టడానికి మరో కారణం అని చెప్పవచ్చు. ధర కాస్త తక్కువగా ఉంటే, ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ పెరిగే అకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకూ అన్ని వర్గాల కస్టమర్లకు అనుకూలమైన ధరలోనే హైమా ఇ1 ఎలక్ట్రిక్ రానుంది.

Most Read Articles

English summary
Haima E1 Electric Vehicle India Launch Details. Read in Telugu.
Story first published: Saturday, February 15, 2020, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X