Just In
Don't Miss
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరింత లగ్జరీగా హృతిక్ రోషన్ మాడిఫైడ్ మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన లగ్జరీ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్. మెర్సిడెస్ బెంజ్ యొక్క లగ్జరీ కార్లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. ఈ కారణంగా సినిమా యాక్టర్స్, పొలిటికల్ లీడర్స్ వంటి డబ్బున్న వారు మాత్రం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో వాహనదారుల ఆసక్తి వల్ల చాలా వాహనాలు మాడిఫై చేయబడుతున్నాయి.

మాడిఫై చేయబడిన వాహనాల గురించి మనం ఇది వరకే తెలుసుకున్నాం. ఇప్పుడు బాలీవుడ్ నటుడయిన హృతిక్ రోషన్ మాడిఫై చేసిన మెర్సిడెస్ వి-క్లాస్ ఉపయోగిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మెర్సిడెస్ వి-క్లాస్ చూడటానికి వెలుపల అద్భుతంగా కనిపిస్తుంది. ఇంటీరియర్, స్టైలిష్ గా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. మాడిఫై చేయడంలో మిస్టర్ దిలీప్ చాబ్బ్రియాకి ప్రత్యేక అనుభవం ఉంది. ఇతడు తన సంస్థ ద్వారా ఇప్పటికే కొన్ని కార్లు మాడిఫై చేయబడ్డాయి. ఇతని డిజైన్ సంస్థ ద్వారా మాధురి దీక్షిత్ యొక్క టయోటా ఇన్నోవా క్రిస్టా కూడా మాడిఫై చేయబడింది. ఇప్పుడు హృతిక్ రోషన్ తన ఎంపివిలో చేసిన అన్ని మార్పులను చూద్దాం.

మాడిఫై చేసిన ఈ మెర్సిడెస్ బెంజ్ కారు వెనుక భాగంలో రెండు వరుసల సీట్లు ఉన్నాయి. రెండవ వరుసలో కెప్టెన్ కుర్చీలు వెనుక మరియు మూడవ వరుసలో సోఫా సీట్లు ముందుకు ఎదురుగా ఉన్నాయి. సోఫా సీట్లు సమాంతరంగా ఉండటం వాళ్ళ ఫోల్డ్ చేయడానికి చాల అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల దీని వల్ల అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

ఇందులో ఉన్న సీట్లను మంచంగా మార్చడానికి అనుకూలంగా ఉంటుంది. క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో రిఫ్రిజిరేటర్ మరియు సెంటర్ టేబుల్ కూడా ఉంది. విండోస్ ఎలెక్ట్రికల్లీ ఆపరేటేడ్ బ్లైండ్‌లను కలిగి ఉంటాయి. ఇది బయటి కాంతిని నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ వాహనంలో పైకప్పుపై అమర్చిన లైట్లు కూడా ఉన్నాయి. ఇవి క్యాబిన్‌ను ఎక్కువ ప్రకాశవంతంగా చేస్తాయి

మాడిఫై చేసిన ఈ మెర్సిడెస్ బెంజ్ కారులో స్పెక్స్ మారవు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 163 పిఎస్ శక్తిని మరియు 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తిని వెనుక చక్రాలకు పంపుతారు.

మెర్సిడెస్ వి-క్లాస్ యొక్క ధర రూ. 68.4 లక్షలు. దీని యొక్క ఇంటీరియర్ మాడిఫైడ్ కోసం దాదాపు రూ. 9.5 లక్షలు అదనంగా ఖర్చు అయింది.