ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

కియా మోటార్స్ నుంచి ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటైన కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది ఆగస్ట్ నెలలో కంపెనీ ప్రపంచానికి పరిచయం చేయనుంది. భారతదేశం వేదికగా చేసుకొని కియా సోనెట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 7న ఆవిష్కరించనున్నారు. కార్అండ్‌బైక్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వరల్డ్ ప్రీమియర్‌ను ఆగస్ట్ 2020 నిర్వహించనున్నారు.

ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

కియా సోనెట్ వరల్డ్ ప్రీమియర్ దాని బిగ్ బ్రదర్ అయిన కియా సెల్టోస్ మాదిరిగానే భారతదేశంలోనే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తర్వాత, సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఆగస్ట్ నెలాఖరులో కానీ లేదా సెప్టెంబర్ ప్రారంభం నాటికి కానీ ఇది భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ వరల్డ్ ప్రీమియర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించనున్నారు.

ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కొరియన్ బ్రాండ్‌కు కియా సోనెట్ భారత మార్కెట్లో మూడవ మోడల్ అవుతుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో కియా మోటార్స్ సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని మరియు కార్నివాల్ ఎమ్‌పివిని విక్రయిస్తోంది. ఈ రెండూ కూడా ఇప్పటికే భారత మార్కెట్లో మంచి పాపులారిటీని దక్కించుకున్నాయి. కియా మోటార్స్ ఇండియా లైనప్‌లోని సెల్టోస్ బ్రాండ్ క్రింద ఎంట్రీ లెవల్ మోడల్‌గా సోనెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

MOST READ:వావ్ అమేజింగ్ : ఇది రెండు చక్రాలపై నడిచే ట్రాక్టర్..!

ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కాను్నన కియా సోనెట్ ఈ విభాగంలోని మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువీ300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కియా సోనెట్ మోడల్‌ను కూడా ప్రస్తుతం సెల్టోస్ మరియు కార్నివాల్ మోడళ్లను తయారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా ప్లాంట్‌లోనే తయారు చేయనున్నారు.

ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

కియా సోనెట్ కాన్సెప్ట్ కారును తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఎక్స్‌పోలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో భారీ హైప్‌ను సృష్టించింది. కియా మోటార్స్ ఎస్‌పి2 కాన్సెప్ట్ (సెల్టోస్) మాదిరిగానే చాలా డిజైన్ ఎలిమెంట్లను ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్‌లోను క్యారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. కైలాష్ యాత్రకు కొత్త రహదారి ఇదే

ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో కూడా రానుంది, ఈ విభాగంలో ఇది చాలా స్పోర్టీ మరియు ప్రీమియం ఆకర్షణను ఆఫర్ చేయనుంది. ఇందులో బ్రాండ్ యొక్క యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లను ఆఫర్ చేయనున్నారు.

ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కియా భాగస్వామి హ్యుందాయ్ తమ వెన్యూ మోడల్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ కొత్త సోనెట్‌లోనూ ఉపయోగించే ఆస్కారం ఉంది. ఇందులో ఒకే రకమైన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు (1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్) ఉండొచ్చని అంచనా. ఈ ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్, సెవన్-స్పీడ్ డిసిటి మరియు హ్యుందాయ్ తాజాగా పరిచయం చేయనున్న ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వంటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది.

MOST READ:హీరో బైక్ డ్రైవ్ చేసిన గ్రేట్ ఖలీ [వీడియో]

ఆగస్ట్ 7న కియా సోనెట్ ఆవిష్కరణ - ధర, ఫీచర్లు, వివరాలు

కియా సోనెట్ వరల్డ్ ప్రీమియర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కియా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సోనెట్‌ను కూడా సెల్టోస్ మాదిరిగానే భారతదేశంలో ఆవిష్కరించడం సంతోషకరమైన అంశం. సెల్టోస్ మరియు కార్నివాల్ మోడళ్లతో వరుస విజయాలను దక్కించుకు కియా మోటార్స్‌కు సోనెట్ కూడా అదే తరహాలో విజయాన్ని తెచ్చిపెట్టగలదని మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Kia Sonet World Premiere To Be Held In India Next Month: Here Are All The Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X