Just In
- 16 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇది నీటితో నడిచే పోప్‌మొబైల్.. ఒకేసారి 500 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు..
కాథలిక్ చర్చి అధిపతి మరియు వాటికన్ నగర ప్రభుత్వ సార్వభౌమాధికారి పోప్ ఫ్రాన్సిస్‌కు జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా ఓ సరికొత్త కారును బహుమతిగా సమర్పించినట్లు పేర్కొంది. కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ జపాన్ (సిబిసిజె)కి చెందిన పోప్ ఫ్రాన్సిస్ కాన్వాయ్ అవసరాల కోసం ప్రత్యేకంగా మోడిఫై చేసిన హైడ్రోజన్-పవర్డ్ టొయోటా మిరాయ్ కారును కంపెనీ బహుమతిగా ఇచ్చింది.

టొయోటా ప్రత్యేకంగా తయారు చేసిన రెండు మిరాయ్ వాహనాల్లో ఈ హైడ్రోజెన్ పవర్డ్ కారు ఒకటి. పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచంలోని అతి ముఖ్యమైన మత నాయకులలో ఒకరు. అతడిని భూమిపై నివసించే దేవుని ప్రతినిధి (దూత)గా పరిగణిస్తుంటారు. ఈయన వాటికన్ నగర ప్రభుత్వ సార్వభౌముడు.

అందుకే వాటికన్ ప్రభుత్వం పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రపంచ నాయకులతో సమానమైన రక్షణను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో, పోప్ ఫ్రాన్సిస్ ప్రజల సందర్శనార్థం బయటకు వచ్చేటప్పుడు ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. ఆయన ఉపయోగించా వాహనాలను పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్స్‌తో మరియు ప్రత్యేక సామర్థ్యాలతో తయారు చేస్తారు. ఈ వాహనాలను పోప్‌మొబైల్స్‌గా పిలుస్తారు.
MOST READ:మహీంద్రా థార్ బుకింగ్స్ అదుర్స్.. కేవలం 17 రోజుల్లోనే 15,000 యూనిట్లు బుక్..

తాజాగా పోప్ ఫ్రాన్సిన్స్‌కు విరాళంగా ఇచ్చిన ఈ టొయోటా మిరాయ్ హైడ్రోజెన్-ఫ్యూయెల్ సెల్ వాహనం కూడా అలాంటి వాటిల్లో ఒకటిగా ఉంది. ఈ అధికారిక పోప్‌మొబైల్ పొడవు 5.1 మీటర్లు మరియు 2.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూఫ్ ఉంటుంది. కారు వెనుక భాగంలో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో ఏర్పాటు చేయబడిన క్యాబిన్‌లో పోప్ నిలుచుని ప్రజలను సందర్శిస్తుంటారు.

టొయోటా మిరాయ్ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ సెడాన్. ఈ కారును టొయోటా 2014 లో ప్రారంభించింది. ఇది హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ సిస్టమ్‌తో నడిచే వాహనం. ఇది సున్నాఉద్గారాలను విడుదల చేస్తుంది, అంటే పూర్తిగా వంద శాతం పర్యావరణ హితమైన కారుగా ఉంటుంది. నీటితో నడిచే ఈ కారు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ తెలిపింది.
MOST READ:మతిపోగొడుతున్న మోడిఫైడ్ హిందూస్తాన్ అంబాసిడర్

టొయోటా ఈ వాహనానికి మిరాయ్ అని పేరు పెట్టడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. జపనీస్ భాషలో 'మిరాయ్' అంటే 'భవిష్యత్తు' అని అర్థం. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న తరుణంలో భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకే ప్రధాన్యత ఉండనుంది. అందుకే, ఈ కారుకి మిరాయ్ అనే పేరును పెట్టారు.

టొయోటా మిరాయ్ కారు ఏరోడైనమిక్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్‌తో ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుంది. వాతావరణ మార్పు మరియు భూమిని కాపాడటం గురించి పోప్ దృష్టికి అనుగుణంగా ఈ కారును నీటితో నడిచేలా డిజైన్ చేశారు. స్టాండర్డ్ మిరాయ్ సెడాన్ వెనుక భాగాన్ని పోప్ కోసం కస్టమైజ్ చేయగా, ఫ్రంట్ డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ క్యాబిన్‌ను యధావిధిగా ఉంచారు.
MOST READ:రోల్స్ రాయిస్ కారును రోడ్డు మధ్యలో వదిలి పారిపోయిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?

ఇకపోతే, గతంలో పోప్ కోసం టొయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ మరియు రేంజ్ రోవర్‌తో సహా పలు ఇతర బ్రాండ్ల కార్లను అధికారిక పోప్‌మొబైల్స్‌గా ఉపయోగించిన సంగతి తెలిసినదే.

టొయోటా మిరాయ్ పోప్‌మొబైల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
వాతావరణ సంరక్షణను ప్రతిభింభించేలా పోప్ ఫ్రాన్సిస్ నీటితో నడిచే జీరో ఎమిషన్ వాహనాన్ని తన పోప్‌మొబైల్‌గా ఎంచుకోవటం విశేషం. ఇది భవిష్యత్తులో ఇలాంటి ఎకో-ఫ్రెండ్లీ వాహనాల కొనుగోలును మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది.
MOST READ:మీకు తెలుసా.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీ యాక్సెసరీ ప్యాకేజస్ ఇవే