హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

కొరియన్ కార్ బ్రాండ్ "హ్యుందాయ్ ఇండియా" ఈ ఏడాది మార్చ్ నెలలో విడుదల చేసిన సరికొత్త 2020 "హ్యుందాయ్ క్రెటా" ఎస్‌యూవీకి డిమాండ్ జోరందుకుంది. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షించి, ఈ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలుస్తోంది.

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

హ్యుందాయ్ టక్సన్ ప్రీమియం ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కంపెనీ ఈ కొత్త మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీ ఇప్పుడు దేశంలో విక్రయించే బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా మారింది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

హ్యుందాయ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, కంపెనీ గత నెల వరకు 40,000 యూనిట్ల కంటే ఎక్కువ క్రెటా బుకింగ్‌లను నమోదు చేసుకుంది. ఈ నెలలో కేవలం మొదటి 14 రోజుల సమయంలోనే క్రెటా కోసం 5,000 బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ వివరించింది.

MOST READ:బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి, ఇందులో ప్రధానంగా క్రెటాలో లభించే ఇంజన్ ఆప్షన్స్‌ను చెప్పుకోవచ్చు. హ్యుందాయ్ ఇంతకుముందు ప్రకటించిన దాని ప్రకారం, ఈ మోడల్ కోసం కంపెనీ అందుకున్న మొత్తం బుకింగ్‌లో 55 శాతం మంది వినియోగదారులు డీజిల్ ఇంజన్‌లను ఎంచుకున్నారు.

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

దీన్ని బట్టి చూస్తుంటే, కేంద్రం బిఎస్6 కాలుష్య ఉద్గార నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత కూడా డీజిల్ ఇంజన్లకు డిమాండ్ అధికంగానే ఉందని స్పష్టమవుతోంది. వీటితో పాటు, డిసిటి గేర్‌బాక్స్‌కు అనుసంధానించబడిన టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఎస్‌యూవీని కూడా కంపెనీ అందిస్తోంది, ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు బెస్ట్ చాయిస్‌గా ఉంటోంది.

MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

వివిద ఇంజన్ ఆప్షన్లు, వేరియంట్ల కారణంగా భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోసం వెతుకుతున్న విస్తృత ప్రేక్షకులను హ్యుందాయ్ క్రెటా టార్గెట్ చేస్తోంది. ఫలితంగా, క్రెటా జూన్ 2020లో కూడా క్రెటా అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ సమయంలో క్రెటా 7,207 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకొని, దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా మారింది.

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

ఈ ఎస్‌యూవీ విజయానికి మరో కారణం కంపెనీ ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ 'క్లిక్-టు-బై'పై క్రెటాను ఆఫర్ చేస్తుండటమే. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో కస్టమర్లు షోరూమ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ కారును ఎక్కువగా కొంటున్నారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, తమ వెబ్‌సైట్‌లో అత్యధికంగా శోధించిన ఎస్‌యూవీ క్రెటా అని హ్యుందాయ్ పేర్కొంది.

MOST READ:బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

ఈ ఏడాది ఆరంభంలో సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం దీని ధరలు రూ.9.99 లక్షల నుండి రూ.17.2 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా పూర్తిగా కొత్త ఇంజన్లతో వస్తుంది. హ్యుందాయ్ తమ 1.4 లీటర్ మరియు 1.6 లీటర్ యూనిట్లను పాత మోడళ్ల నుండి పూర్తిగా నిలిపివేసింది. ఈ పాత ఇంజన్లను కొత్త 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లతో భర్తీ చేసింది. కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా 14 విభిన్న వేరియంట్లు మొత్తం 3 ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో లభిస్తోంది.

MOST READ:గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పిల శక్తిని మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. హ్యుందాయ్ క్రెటా హై స్పెక్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ మూడు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారికి ఇందులో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

గడచిన మార్చ్ నెలలో రిఫ్రెష్ చేసిన ఈ సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. ముందు భాగంలో సరికొత్త క్యాస్కేడింగ్ గ్రిల్‌, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌ల చుట్టూ కొత్తగా రూపొందించిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రింది భాగంలో ఫాక్స్ సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ క్రెటా బేసిక్ క్యాబిన్ డిజైన్‌ను యధావిధిగా ఉంచారు. స్టీరింగ్ వీల్‌పై కొన్ని రకాల కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో డ్రైవర్ సమాచారం కోసం 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఇది హ్యుందాయ్ అందిస్తున్న అఫీషియల్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో పాటుగా యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటాకు భారీ డిమాండ్, 45,000 లకు పైగా బుకింగ్స్

కొత్త హ్యుందాయ్ క్రెటాలో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ప్యాడల్ షిఫ్టర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే హ్యుందాయ్ విజయానికి కారణం ఇందులో ఆఫర్ చేయబడుతున్న బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు విభిన్న ఇంజన్స్ మరియు ట్రాన్సిమిషన్ ఆప్షన్స్. కస్టమర్ అవసరాలను బట్టి తమకు నచ్చే వేరియంట్‌ను ఎంచుకునే సౌకర్యం ఉంటుంది. వీటికి అదనంగా, హ్యుందాయ్ కస్టమరల్ వాహన యాజమాన్యాన్ని మరింత సులువు చేసేందుకు గాను ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది.

Most Read Articles

English summary
Hyundai India has announced that the all-new Creta SUV has received more than 45,000 bookings since its launch in March 2020. The demand for the SUV continue to increase despite the ongoing pandemic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X