గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

సాధారణంగా వాహన కొనుగోలు దారులు మొదట వాహనాన్ని కొనేటప్పుడు ఒక్క వాహన ధర మాత్రమే కాకుండా మైలేజ్ వంటి వాటిని కూడా తెలుసుకుంటారు. అది మాత్రమే వాహనదారుడు తన భద్రతను దృష్టిలో ఉంచుకుని దాని సేఫ్టీ రేటింగ్ కూడా తెలుసుకుంటాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న రోడ్డుపరమాదాల నుంచి బయటపడటానికి ఈ సేఫ్టీ ఫీచర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సేఫ్టీ రేటింగ్ ఇవ్వడానికి ఎన్‌సిఎపి టెస్ట్ నిర్వహించి రేటింగ్ ఇస్తుంది.

గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

ఇటీవల గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్ లో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. గ్రీన్ ఎన్‌సిఎపి ఎలక్ట్రిక్ కార్ల సామర్థ్యం మరియు ఉద్గార పారామితులపై రేటింగ్‌ను అందిస్తుంది. అంతకుముందు 2019 లో హ్యుందాయ్ అయోనిక్ కు 5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వబడింది. ఎలక్ట్రిక్ కార్లకు రేటింగ్ ఇవ్వడానికి గ్రీన్ ఎన్‌సిఎపి కారును మూడు పారామితులలో టెస్ట్ చేస్తుంది.

గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

ఇందులో ఎయిర్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మరియు ఎనర్జీ ఎఫీషియన్సీ వంటి వాటిని టెస్ట్ చేస్తారు. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఈ మూడు ప్రమాణాలకు అనుగుణంగా ఉంది మరియు అన్ని సవాళ్లను అధిగమించింది. క్లీన్ ఎయిర్ ఇండెక్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ మరియు గ్రీన్ హౌస్ గ్యాస్ ఇండెక్స్‌లో కోన మంచి స్థానాన్ని పొందింది.

MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

ఈ సంవత్సరం గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్ లో 24 స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ కార్లు చేర్చబడ్డాయి, ఇందులో హ్యుందాయ్ కోనా అగ్రస్థానంలో ఉంది. హ్యుందాయ్ కోనా సంస్థ యొక్క ప్రధాన ఎలక్ట్రిక్ కారు. ఈ సంస్థ 2018 లో దక్షిణ కొరియాలో కోన ఇ.వి.ని విడుదల చేసింది, ఈ కారును జూలై 2019 లో భారతదేశంలో లాంచ్ చేశారు.

గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

కంపెనీ ఇప్పటివరకు 1 లక్షకు పైగా కోనా ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించింది. ఫాస్ట్ ఛార్జింగ్, హై రేంజ్ మరియు ధర ఈ కారును ఇతర ఎలక్ట్రిక్ కార్ల నుండి భిన్నంగా చేస్తాయి. అలాగే, ఈ కారులో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఇవ్వబడ్డాయి. ఇది ఇతర మోడల్స్ తో పోలిస్తే చాలా సురక్షితంగా ఉంటుంది.

MOST READ:యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

ఆధునిక ఎలక్ట్రిక్ కార్లలో కనిపించే అన్ని ఫీచర్స్ ఈ కారులో కూడా కనిపిస్తాయి. కోనా ఇవి లో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, హెడ్స్ అప్ డిస్ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

హ్యుందాయ్ కోన 39.2 కిలోవాట్ల బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 134 బిహెచ్‌పి పవర్ మరియు 395 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒకే ఛార్జీపై 452 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

హ్యుందాయ్ కోనా యొక్క బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే, ఒక సారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. అదే సమయంలో, ఫాస్ట్ ఛార్జింగ్ అప్సన్ తో కేవలం 54 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. భారతీయ మార్కెట్లో, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4 సాలిడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి వైట్, సిల్వర్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ధర రూ. 25.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది వాహనదారునికి అనుకూలంగా ఉండటంతో పాటు మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది.

MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?

Most Read Articles

English summary
Hyundai Kona EV Scores 5 Star In Green NCAP. Read in Telugu.
Story first published: Wednesday, December 2, 2020, 13:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X