2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కంపెనీలలో హ్యుందాయ్ ఒకటి. హ్యుందాయ్ సంస్థ నుంచి ఇప్పటికే చాలా వాహనాలు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పుడు హ్యుందాయ్ బ్రాండ్ నుంచి "హ్యుందాయ్ క్రెటా" 2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ కానుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

దక్షిణ కొరియా ఆటో తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ రాబోయే 2020 ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ క్రెటాని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలను గురించి కంపెనీ ప్రస్తావించింది. కానీ ప్రెజెంట్ వెర్షన్ లో ఈ హ్యుందాయ్ క్రెటా బాగా అమ్ముడవుయితుంది అని కంపెనీ భావిస్తోంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

రాబోయే 2020 హ్యుందాయ్ క్రెటా కాస్మెటిక్ అప్ గ్రేడ్లను కలిగి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క లేటెస్ట్ డిజైన్లను కూడా పొంది ఉంది. ఇది మునుపటి మోడల్ కంటే చూడటానికి ఆకర్షణీయంగా మరియు దృఢంగా కనిపిస్తుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటాలో ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో పెద్ద గ్రిల్, స్లీక్ ఇండికేటర్ లాంప్స్, మాడిఫైడ్ చేయబడిన బంపర్, ముందు వెనుక భాగాలలో స్కిడ్ ప్లేట్స్ మరియు రీ డిజైన్ చేయబడిన టెయిల్ లాంప్స్ ఉన్నాయి. హ్యుండై క్రెటా ప్యూచర్లో ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

క్రెటాలో ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పుల్ డిజిటల్‌తో వస్తుందని ఊహించవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హ్యుందాయ్ యొక్క బ్లూలింక్ కనెక్టివిటీ సూట్ మరియు పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇందులో ఉంటాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా భద్రతా లక్షణాలలో ఎబిఎస్ విత్ ఇబిడి, సీట్ బెల్ట్ రిమైండర్ అలెర్ట్, ఎపి ఎడెస్ట్రియన్ సేఫ్టీ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరాలు, హై-స్పీడ్ అలెర్ట్ సిస్టం, ఎయిర్‌బ్యాగులు మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

2020 కొత్త హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.4 డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటాయి. కానీ బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా 1.5 పెట్రోల్ మరియు 1.5 డీజిల్ ఇంజిన్లను ప్రవేశపెట్టనుంది. ఇవి 114 బిహెచ్‌పి శక్తి వద్ద 144 ఎన్ఎమ్ టార్క్ ని మరియు 114 బిహెచ్‌పి వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉంటాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

ప్రస్తుత తరం హ్యుందాయ్ క్రెటా మోడల్స్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 1572 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. కానీ కొత్తగా ప్రారంభించనున్న హ్యుందాయ్ క్రెటా కొంత ఎక్కువ ధర ని కలిగి ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్న హ్యుందాయ్ క్రెటా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ తన బ్రాండ్ నుండి క్రెటాని ఆవిష్కరించనుంది. కొత్త తరం హ్యుందాయ్ క్రెటా కోసం వినియోగదారులు ఇంకొన్ని రోజులు మాత్రమే వేచి చూడాలి. హ్యుందాయ్ క్రెటా ఒకసారి మార్కెట్లో ప్రారంభించిన తర్వాత కియా సెల్టోస్ మరియు ఎంజి హెక్టర్‌కి ప్రత్యర్థిగా ఉండబోతుంది.

Most Read Articles

English summary
New Hyundai Creta To Be Unveiled At 2020 Auto Expo: Official Design & Sketches Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X