స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

2020 బిఎస్ 6 మోడల్ హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ భారతదేశంలో ప్రారంభించటానికి ముందే పరీక్షలను గుర్తించింది. కొత్త హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ కార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

హ్యుందాయ్ టక్సన్ కొన్ని సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో ఉంది, మరియు గత సంవత్సరం హ్యుందాయ్ కంపెనీ ఈ కారుకు ఫేస్ లిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు రాబోయే 2020 హ్యుందాయ్ టక్సన్ రోడ్లపై టెస్ట్ చేయడం జరిగింది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

2020 హ్యుందాయ్ టక్సన్ యొక్క ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో లీడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు డిఆర్‌ఎల్‌లను బంపర్‌లో మరియు ఫాగ్‌లైట్ల చుట్టూ ఉంటుందని స్పై పిక్స్ ద్వారా మనకు తెలుస్తాయి. ఈ వాహనంలో ముందు మరియు వెనుక భాగంలో పునఃరూపకల్పన చేయబడిన బంపర్లు ఉంటాయి. ఇది కొత్త వైడెర్ గ్రిల్‌ను కూడా పొందుతుంది. ఇది కారు యొక్క బోల్డ్ నెస్ ని మరింత పెంచుతుంది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

2020 హ్యుందాయ్ టక్సన్ యొక్క సైడ్ ప్రొఫైల్‌లో కూడా కొన్ని మార్పులు చేయబడ్డాయి. అయితే ఈ ఎస్‌యూవీకి ఇప్పుడు కొత్త మెషిన్-కట్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అలాగే, ఫ్యూయల్ పిల్లర్ క్యాప్ మరియు టెయిల్-గేట్ డిజైన్ నవీకరణలు కూడా చేయబడ్డాయి. టైల్లైట్ ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా మరియు ఇది పూర్తి ఎల్ఇడి యూనిట్ తో ఉంటుంది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల ఇంటీరియర్‌లలో బ్లూలింక్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 3 డి మ్యాప్‌లతో నావిగేషన్ వంటివి ఉంటాయి. క్యాబిన్ డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్‌ను కలిగి ఉండటమే కాకుండా, ఎసి వెంట్స్ కూడా కలిగి ఉంటుంది. ఇంకా 360 డిగ్రీలు కెమెరా, మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉంటాయి. ఈ కెమెరా వల్ల చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడానికి ఉపయోగపడుతుంది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

హ్యుందాయ్ యొక్క కొత్త ఎస్‌యూవీ ఇండియాలో తయారవుతుంది. అంటే రాబోయే 2020 హ్యుందాయ్ టక్సన్ ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే మెరుగైన ధరను కలిగి ఉంటుంది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

రాబోయే టక్సన్ ప్రస్తుత మోడల్లో ఉన్న అదే ఇంజిన్ ను కలిగి ఉంటుంది. కానీ బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో వస్తుంది. ఇవి రెండు కూడా 154 బిహెచ్‌పి వద్ద 192 ఎన్ఎమ్ టార్క్, మరియు 185 బిహెచ్‌పి వద్ద 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

రెండు ఇంజన్లు ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటాయి. అయితే డీజిల్ మాత్రమే ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఎంపికతో వస్తుంది. హ్యుందాయ్ 2020 ఫేస్‌లిఫ్టెడ్ బిఎస్ 6 హ్యుందాయ్ టక్సన్ బేస్ వేరియంట్‌ ధర రూ. 20 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్‌ ధర రూ. 30 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఇండియా) ధర నిర్ణయించాలని భావిస్తున్నారు.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఖచ్చితంగా భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఎస్‌యూవీకి అప్‌డేట్ చేసిన డిజైన్ మరియు ఫీచర్లు వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి. హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్, స్కోడా కోడియాక్ మరియు వోక్స్వ్యాగన్ టిగువాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Image Courtesy: MotorBeam

Most Read Articles

English summary
Spy Pics: Hyundai Tucson Facelift BS6 Model Spotted Testing Ahead Of India Launch. Read in Telugu.
Story first published: Saturday, January 25, 2020, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X