Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొట్టమొదటి 2020 బెంట్లీ ఫ్లయింగ్ కార్ ఇండియాలో ఎవరికీ డెలివరీ చేసారో తెలుసా.. !
ప్రపంచంలో ఉన్న లగ్జరీ కార్ల విభాగంలో బెంట్లీ ఫ్లయింగ్ ఒకటి. ఇది అత్యంత ఖరీదైన వాహనాలలో కూడా ఒకటిగా ఉంది. ఈ లగ్జరీ కారు అతి తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో భారతదేశంలో 2020 బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కారు అహ్మదాబాద్ లో డెలివరీ చేయబడింది.

థర్డ్-జెన్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ అల్ట్రా-లగ్జరీ సెలూన్‌ను జూన్ 2019 లో తిరిగి ప్రపంచానికి ఆవిష్కరించారు. ఇది రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఫ్లయింగ్ స్పర్ యొక్క తాజా అవతార్ మొత్తం శ్రేణి నవీకరణలు చేయబడింది. ఈ వాహనం యొక్క పనితీరు , మరియు టెక్నాలజీ బాగా అప్డేట్ చేయబడింది.

అత్యంత ఖరీదైన ఏ కారు భారతదేశంలో ఇప్పుడు మొట్టమొదటి 2020 బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ అహ్మదాబాద్ కి చెందిన వ్యాపారవేత్త 'దీపక్ మెవాడా' కు డెలివరీ చేయబడింది. ఈ కారు యొక్క ఆన్-రోడ్ ధర సుమారు 5.60 కోట్ల రూపాయల వరకు ఉంది.

ఈ అల్ట్రా-ప్రీమియం కార్ ని పొందటానికి దీపక్ సెలూన్ దాదాపు అర సంవత్సరం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ కారు స్టేట్ ప్రీమియం కార్ డీలర్‌షిప్, రెడ్ స్టాలియన్ సూపర్ కార్స్ వారు ఆగస్టు 2019 లో తయారు చేశారు. ఇందులో ప్రత్యేకమైన ఇంటీరియర్ థీమ్ కూడా ఉంది.

2020 బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ 6.0 లీటర్ ట్విన్-టర్బో ఇంజిన్ ద్వారా శక్తినిస్తుంది. ఇది 635 బిహెచ్‌పి మరియు 900 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు-చక్రాలకు 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ద్వారా శక్తి పంపబడుతుంది. 5.3 మీటర్ల పొడవైన బాడీని కలిగి ఉంటుంది.

2020 బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ దాదాపు ఎక్కువ బరువును కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇది గంటకు 333 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఇది డబ్ల్యూ 12 పవర్‌ట్రెయిన్‌తో పాటు, భవిష్యత్తులో 4.0-లీటర్ ట్విన్-టర్బో వి 8 మరియు 3.0-లీటర్ ట్విన్-టర్బో హైబ్రిడ్ వి 6 వేరియంట్‌లను కూడా అందించాలని కంపెనీ యోచిస్తోంది.

2020 బెంట్లీ ఫ్లయింగ్ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది వినియోగదారునికి చాల అనుకూలంగా ఉంటుంది. ఇది వివిధ కలర్ వేరియట్లో కూడా లభిస్తుంది. ఏది ఏమైనా మనదేశంలో ఇలాంటి వాహనాలు అతి తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నాయి .
Image Courtesy: Hrishi Raj Photography/Instagram