మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఇసుజు మోటార్స్ అహ్మదాబాద్‌లో ఓ కొత్త మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇందుకు గాను టివిఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్ (టిఎఎస్ఎల్)తో ఇసుజు మోటార్స్ ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

ఈ సర్వీస్ సెంటర్ టిఏఎస్ఎల్ నుంచి ఆటోమోటివ్ ఆఫ్టర్ మార్కెట్ సొల్యూషన్స్ అందిస్తుంది. కొత్త సదుపాయం ద్వారా కేవలం ఇసుజు కస్టమర్లే కాకుండా దేశంలోని ఏ బ్రాండ్ (ఎనీ మేక్, ఎనీ మోడల్) వాహనాలనైనా కంపెనీ సర్సీ చేస్తుంది. కేవలం సర్వీస్ మాత్రమే కాకుండా, టిఏఎస్ఎల్ వివిధ ఆటోమోటివ్ విడిభాగాలను కూడా తయారు చేస్తుంది, సర్వీసింగ్ సమయంలో కస్టమర్లు వీటిని ఎంచుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

పరిశ్రమలోనే మొదటిసారిగా, ఈ భాగస్వామ్య కార్యక్రమం కింద, అదనపు సామర్థ్యం కలిగిన ఇసుజు డీలర్ భాగస్వాములు ఇప్పుడు "మైటివిఎస్" ఫ్రాంచైజీలను కూడా తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇలా ఎంచుకున్న వారు తమ ప్రస్తుత ఇసుజు వర్క్‌షాప్‌లోనే అంకితమైన మరియు భాగస్వామ్య సేవలను అందించే అవకాశం ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. ఈ కార్ ఒకే ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణిస్తుంది

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

ఈ విషయంపై ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కెన్ తకాషిమా మాట్లాడుతూ, "మా సౌకర్యాలను మరింత ఆచరణీయంగా మార్చడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈ ప్రత్యేకమైన భాగస్వామ్యంతో ఇసుజు కస్టమర్లకు అంకితమైన సేవలను అందించే డీలర్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇతర బ్రాండ్ల వినియోగదారులతో కూడా కనెక్ట్ అవుతుంది".

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

"భారతదేశంలో మల్టీ-బ్రాండ్ సర్వీసెస్‌ను అందించడానికి టివిఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్‌తో సహకరించడం మాకు ఆనందంగా ఉంది. పరిశ్రమలో అనుభవజ్ఞుడైన మరియు ప్రముఖ కంపెనీగా, "మైటివిఎస్" వారి వినియోగదారులకు అసాధారణమైన సేవలను అందిస్తుందని" అన్నారు.

MOST READ:గ్రేట్ ఇండిపెండెన్స్ డే రైడ్ : 5 మంది ఫ్రెండ్స్, 5 దేశాలు, 5000 కి.మీ ప్రయాణం, ఎందుకో తెలుసా ?

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

మైటివిఎస్‌తో అనుబంధించబడిన ఇసుజు వర్క్‌షాప్‌లలో ఇతర బ్రాండ్‌ల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ, వర్క్‌షాప్‌లో ప్రధాన భాగం మాత్రం ప్రత్యేకమైన ఇసుజు సౌకర్యంగానే కొనసాగుతుంది. మిగిలిన ప్రాంతాన్ని ఇతర బ్రాండ్ వాహనాల కోసం వినియోగించడం జరుగుతుంది.

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

ఈ భాగస్వామ్యంలో భాగంగా, మైటివిఎస్‌తో అనుబంధించబడిన సౌకర్యాలు వివిధ సేవలను అందిస్తాయి. మల్టీ-బ్రాండ్ మోటార్ వాహనాల కోసం జనరల్ సర్వీస్ మరియు బాడీ/యాక్సిడెంటర్ రిపేర్స్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. క్విక్ సర్వీస్, స్పీడ్ వాష్ మరియు నగదు రహిత భీమా వంటి నాణ్యమైన సేవలను సరసమైన ఖర్చుతో వినియోగదారులకు అందించడమే ఈ ఇరు కంపెనీల లక్ష్యం.

MOST READ:కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

ఈ విషయంపై టివిఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, జి. శ్రీనివాస రాఘవన్ మాట్లాడుతూ.. "ఇదొక నిర్ణయాత్మక వ్యూహాత్మక ఒప్పందం, ఇది భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పనితీరును మెరుగుపరచే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యంలో ఒకరికొకరు బలోపేతం చేసుకోవటానికి అవకాశం ఉంది. దీని ద్వారా వినియోగదారులు కూడా అంతిమ ప్రయోజనం పొందుతారు. మైటివిఎస్ కోసం ఇసుజు వంటి భాగస్వామి మా సర్వీస్ పోర్ట్‌ఫోలియో పరిధిని మరింత బలోపేతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని" అన్నారు.

మల్టీబ్రాండ్ వెహికల్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించిన ఇసుజు

అహ్మదాబాద్‌లో ఇసుజు మల్టీ కార్ సర్వీస్ సెంటర్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టార్క్ కమర్షియల్ వెహికల్స్ ఇసుజు యజమానులతో సహా అన్ని బ్రాండ్ల వినియోగదారుల అవసరాలను తీర్చలేవు. అయితే, ఈ మల్టీ-బ్రాండ్ సర్వీస్ వర్క్‌షాప్ కలిగి ఉండటం వలన వారి కస్టమర్ బేస్‌ను విస్తరించడానికి ఇది సహకరిస్తుంది.

MOST READ:డస్టర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ టీజర్ లాంచ్ చేసిన రెనాల్ట్

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Japanese-based auto manufacturer, Isuzu Motors has opened a new multi-brand vehicle service facility in Ahemdabad. The company has partnered with TVS Automobile Solutions (TASL). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X