Just In
- 1 hr ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 3 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో జాగ్వార్ ఐ-పేస్ ఆల్ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్స్ ఓపెన్; వివరాలు
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ కోసం అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎస్, ఎస్‌ఈ, హెచ్‌ఎస్‌ఈ అనే మూడు వేరియంట్లలో అందించనున్నారు. ఇవి మూడు కూడా ఒకే ఒక పవర్‌ట్రైన్ ఆప్షన్ (ఈవి 400)తో లభ్యం కానున్నాయి. మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే, ఈ సరికొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, దీని డెలివరీలు మాత్రం వచ్చే ఏడాది మార్చ్ నాటికి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ మోడల్ కోసం ప్రీ-లాంచ్ బుకింగ్స్ ప్రకటనతో పాటు, భారతదేశంలోని ఐ-పేస్ కస్టమర్లకు అందించే ఛార్జింగ్ సొల్యూషన్స్ కూడా కంపెనీ వెల్లడించింది.
MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

జాగ్వార్ తన వినియోగదారులకు ఆందోళన లేని ఈవీ యాజమాన్య అనుభవాన్ని అందించడానికి టాటా పవర్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ దేశంలోని ఐ-పేస్ కస్టమర్లకు ఆఫీస్ మరియు హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్స్ కూడా అందించనుంది. అదనంగా, టాటా పవర్ తన ‘ఈజీ ఛార్జ్' ఇ.వి. ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 200కి పైగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.

ఈ ఈజీ ఛార్జ్ స్టేషన్లలో ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనాలనైనా చార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. వీటిని నగరంలోని అనుకూలమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు, నివాస సముదాయాలు మరియు రహదారుల వెంట ఉన్న ప్రదేశాల్వో వీటిని ఏర్పాటు చేస్తారు.
MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా

దేశంలో ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వారంటీ వివరాలను కూడా కంపెనీ ప్రకటించింది. ఐ-పేస్‌లోని 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీతో ఆఫర్ చేయనున్నారు. అదనంగా, ఈ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ కస్టమర్లకు 5 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ మరియు జాగ్వార్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఐ-పేస్‌ను స్టాండర్డ్ 7.4 కిలోవాట్ ఎసి వాల్-మౌంటెడ్ ఛార్జర్‌తో అందించనున్నారు.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని రెండు యాక్సిల్స్‌లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం రెండు సింక్రోనస్ పర్మినెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి మొత్తంగా 395 బిహెచ్‌పిల శక్తిని మరియు 696 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది.
MOST READ:ట్రాక్టర్ అమ్మకాలలో దూసుకెళ్తున్న సోనాలికా.. కారణం ఏంటో తెలుసా !

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. పూర్తి చార్జ్‌పై ఇది 480 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ (మైలేజ్)ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ కారులో 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని 100 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి 0-80 శాతం నుండి ఛార్జ్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. మరోవైపు, 7 కిలోవాట్ ఏసి వాల్ బాక్స్ ఛార్జర్ ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే, 10 గంటల వ్యవధిలో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

భారత్‌లో జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
జాగ్వార్ ఐ-పేస్ భారత మార్కెట్లో పెర్ఫార్మెన్స్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. మార్కెట్లో ఇది ఇటీవలే విడుదలైన మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి మరియు త్వరలో భారత్‌కు రానున్న ఆడి ఇ-ట్రోన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. జాగ్వార్ తమ ఐ-పేస్ కస్టమర్లకు బహుళ ఛార్జింగ్ పరిష్కారాలను అందించడం ద్వారా మెరుగైన యాజమాన్య అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.