బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా బెంగళూరులో కొత్త 3ఎస్ రిటైల్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ కొత్త మార్క్‌ల్యాండ్ డీలర్‌షిప్‌ను న్యూ ఎయిర్పోర్ట్ రోడ్‌లో ఏర్పాటు చేశారు. గతంలో హోసూర్ రోడ్‌లో మార్క్‌ల్యాండ్ తమ 3ఎస్ షోరూమ్‌ని నిర్వహించింది.

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

ఈ షోరూమ్ 4,160 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది మరియు దాని వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల అమ్మకాలు మరియు అమ్మకాల తర్వాత సేవల అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. జేఎల్ఆర్ 3ఎస్ సేవల్లో భాగంగా సేల్స్, సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్‌ను ఒకే ప్రాంతంలో నిర్వహించనున్నారు.

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

ఈ షోరూమ్‌లో జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ పోర్ట్‌ఫోలియోలో విక్రయిస్తున్న అన్ని విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఒకే రూఫ్ క్రింద ప్రదర్శించనున్నారు. ఇక్కడ కస్టమర్లకు వాహనాలను పంపిణీ చేయడానికి ఆకట్టుకునే హ్యాండ్ఓవర్ బేను కూడా కలిగి ఉంది.

MOST READ:ప్రపంచంలో నాల్గవ ధనవంతుడు కానున్న సిఈఓ : ఎవరో తెలుసా

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

కొత్త జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్‌లో ఈ బ్రాండ్ నుండి ఆమోదం పొందిన ప్రీ-ఓన్డ్ కార్ విభాగం కూడా ఉంది. ఇక్కడ కస్టమర్లు కంపెనీ సర్టిఫై చేసిన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంచుకునే సౌకర్యం ఉంటుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కస్టమర్ల కోసం విస్తృత శ్రేణి బ్రాండెడ్ ఉత్పత్తులను మరియు యాక్ససరీలను అందిస్తున్నారు.

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

ఇక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ విషయానికి వస్తే, ఈ కొత్త 3ఎస్ షోరూమ్‌లో అత్యాధునిక సాధనాలు మరియు పరికరాలతో 19 పూర్తిస్థాయి సర్వీస్ బేలు ఉన్నాయి. వర్క్‌షాప్‌లో మంచి శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు మరియు సిబ్బంది ఉంటారు. వారంతా కస్టమర్లకు అత్యధిక నాణ్యమైన ఆఫ్టర్ సేల్స్ సేవలను అందించేలా శిక్షణ పొంది ఉంటారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జెఎల్‌ఆర్‌ఐఎల్) ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ, 2019లో సిటీ సెంటర్‌లో బోటిక్ షోరూమ్ ప్రారంభించిన తర్వాత, న్యూ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ఈ కొత్త, అల్ట్రా మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ 3ఎస్ షోరూమ్ జెఎల్‌ఆర్‌ను మరింత బలోపేతం చేస్తుంది, బెంగళూరు ప్రాంతంలో దాని ఉనికి పెంచుతుంది. ఇది మా కస్టమర్లు సౌకర్యవంతంగా మరియు సులభంగా యాక్సెస్ చేయగల ప్రదేశం నుండి ప్రపంచ స్థాయి సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్ పార్ట్స్ అన్నింటినీ ఒకే రూఫ్ క్రింది ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంద"ని అన్నారు.

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు బెంగుళూరు కన్నింగ్‌హామ్ రోడ్‌లోని సిటీ సెంటర్‌లో అమ్మకాల కార్యకలాపాల కోసం ఒక బోటిక్ షోరూమ్ కూడా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా, కస్టమర్లు జేఎల్ఆర్ బ్రాండ్ నుండి ఏదైనా వాహనాలను బుక్ చేసుకోవాలనుకుంటే కంపెనీ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా సందర్శించవచ్చు.

MOST READ:కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

జాగ్వార్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎఫ్-పేస్ ఎస్‌యూవీ మరియు ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కార్ మోడళ్లను విక్రయిస్తోంది. మరోవైపు, ల్యాండ్ రోవర్ బ్రాండ్ క్రింద రేంజ్ రోవర్ ఎవోక్, డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ వెలార్, డిస్కవరీ, రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ మరియు ఇటీవలే విడుదలైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడళ్లను విక్రయిస్తోంది.

బెంగుళూరులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3ఎస్ షోరూమ్ ప్రారంభం

జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త 3ఎస్ షోరూమ్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతీయ మార్కెట్లో కొత్త కారు కొనాలంటే అదొక భావోద్వేగమైన అనుభవంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ ప్రీమియం బ్రాండ్ల విషయానికి వస్తే ఈ భావోద్వేగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ లగ్జరీ బ్రాండ్ కొత్తగా ప్రారంభించిన 3ఎస్ షోరూమ్ మెరుగైన కొనుగోలు అనుభవాన్ని మరియు అమ్మకాల తర్వాత అగ్రస్థానంలో ఉన్న మద్దతును అందిస్తుంది అలాగే కస్టమర్ యొక్క భావోద్వేగాలను గౌరవించడంలోనూ సహాయపడుతుంది. ఇటీవలి కాలంలో కారు కొనుగోలు అనుభవం డిజిటల్‌గా మారినప్పటికీ, కొంతమంది కస్టమర్లు పాత-కాలపు షోరూమ్ అనుభవాన్నే ఇష్టపడుతుంటారు.

MOST READ:డీలర్‌షిప్ చేరుకున్న ఆడి ఆర్‌ఎస్ క్యూ 8 ఎస్‌యూవీ, డెలివరీ ఎప్పుడంటే

Most Read Articles

English summary
Jaguar Land Rover India inaugurated a new 3S retail facility in Bengaluru. The new facility by Marqland is located on New Airport Road. The Marqland previously operated its 3S facility on Hosur Road. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X