ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2021 ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే కొత్త జాగ్వార్ ఐ-పేస్ ఎస్‌యూవీలో మునుపటి తరన మోడల్‌తో పోల్చుకుంటే అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, త్రీ-ఫేజ్ ఎసి హోమ్ ఛార్జింగ్ మరియు అప్‌డేటెడ్ డ్రైవర్-ఫోకస్డ్ టెక్నాలజీలను జోడించారు.

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

కొత్త జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ ఏడాదిలో ఎప్పుడైనా భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే ఇది లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న నేపథ్యంలో, దీని ధర కూడా భారీ మొత్తంలోనే ఉండొచ్చని అంచనా.

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

కొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఇందులో 11 కిలోవాట్ల ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను స్టాండర్డ్‌గా జోడించారు. ఇది వరకటి మోడళ్లలో కేవలం 7 కిలోవాట్ల చార్జర్ మాత్రమే ఉండేది. ఈ అప్‌డేటెడ్ ఛార్జర్ సాయంతో కస్టమర్లు ఇంటి వద్దనే త్రీఫేస్ ఎలక్ట్రిక్ సప్లయ్‌ని ఉపయోగించుకొని అత్యంత వేగంగా కారును ఛార్జింగ్ చేసుకోవచ్చు.

MOST READ: టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

(డబ్ల్యుఎల్‌టిపి) వరల్డ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్ గణాంకాల ప్రకారం, 11 కిలోవాట్ల ఛార్జర్‌తో ఐ-పేస్‌ను చార్జింగ్ చేస్తే, ఒక గంట సమయం ఛార్జింగ్‌కు 53 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తేలింది. ఇదే చార్జర్‌తో 8.6 గంటల్లో కారు బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

సింగిల్ ఫేజ్ 7 కిలోవాట్ ఛార్జింగ్‌తో పోలిస్తే, దీనితో ఒక గంట పాటు ఛార్జ్ చేస్తే కేవలం 35 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించవచ్చు మరియు దీనితో 0 నుండి 100 శాతం ఛార్జ్‌ని పొందటానికి 13 గంటల సయమం పడుతుంది. అదే 50 కిలోవాట్ల ద్వారా 15 నిమిషాల పాటు ఎస్‌యూవీని ఛార్జ్ చేస్తే 63 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది, అదే సమయంలో 100 కిలోవాట్ల ఛార్జర్ అయితే 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

MOST READ: కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

కొత్త జాగ్వార్ ఐ-పేస్‌లో అప్‌డేట్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించిన మొట్ట మొదటి వాహనం ఇది. ఇందులో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇంకా ఓ 10 ఇంచ్ అప్పర్ మరియు 5 ఇంచ్ లోవర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌లు కూడా ఇందులో ఉంటాయి. వాటిపై వివిధ రకాల కంట్రోల్స్ ఉంటాయి.

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

ఈ కారులో తాము జోడించిన కొత్త టెక్నాలజీ, ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించినంత సులువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఉపయోగించిన పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చాలా వేగవంతమైనది అలాగే మెరుగైన ఈవి నావిగేషన్‌తో వస్తుంది. ఇది సమీప ఛార్జింగ్ స్టేషన్లు ఉండే చోటును చూపించగలదు. ఇంకా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటు, చార్జింగ్‌కి అయ్యే ఖర్చు మరియు ఛార్జ్ చేయడానికి తీసుకున్న సమయం వంటి గణాంకాలను కూడా తెలియజేస్తుంది.

MOST READ: మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

జాగ్వార్ ఐ-పేస్ వెహికల్ ఇంజనీరింగ్ మేనేజర్ స్టీఫెన్ బౌల్టర్ మాట్లాడుతూ.. "పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో చూపించడంతో అవి అందుబాటులో ఉన్నాయా లేవా, చార్జింగ్ స్టేషన్‌ను ఉపయోగించడానికి అయ్యే ఖర్చు మరియు ఛార్జింగ్‌కు పట్టే సమయం వంటి విషయాలను తెలియజేస్తుంది. చాలా మంది కస్టమర్‌లు తమ ఇళ్లలోనే వారి ఐ-పేస్ కారును చేసుకోవటానికి ఇష్టపడతారని మాకు తెలుసు, అయితే ప్రయాణంలో కూడా ఈ కారు ఛార్జింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలనుకున్నాం, దీన్ని మా కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సాధ్యం చేస్తుంది" అని అన్నారు.

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

ఇది వరకటి వెర్షన్‌తో పోల్చుకుంటే కొత్త 2021 ఐ-పేస్ కారులో డిజైన్, ఇంటీరియర్స్, ఫీచర్లలో మార్పులు ఉన్నాయి. ఇందులోని కొత్త అట్లాస్ గ్రే గ్రిల్ టిప్ ఫినిషింగ్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మరియు విలాసవంతమైన కొత్త బ్రైట్ ప్యాక్ ఆప్షన్ మరియు కొత్త కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూ క్యాబిన్‌లో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గాలి ఉండేలా ఇందుల పిఎమ్2.5 ఫిల్టర్‌తో కూడిన ఇన్-క్యాబిన్ ఎయిర్ ఐసోలేషన్ ఉంటుంది.

MOST READ: కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

కొత్త ఐ-పేస్ కొత్త 3డి సరౌండ్ కెమెరా కూడా ఉంటుంది, ఇది సెంట్రల్ టచ్‌స్క్రీన్‌కు కనెక్ట్ చేయబడి కారు చుట్టూ ఉండే పరిసరాలను 360 డిగ్రీ కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంది. దీని వలన డ్రైవర్‌కు ముందుగా జరగబోయే ప్రమాదాల గురించి తెలుసుకునేందుకు సాధ్యమవుతుంది.

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ప్రతి యాక్సిల్‌లో రెండు శాశ్వత మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు 90 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఈ అన్ని మోటార్లు కలిసి గరిష్టంగా 395bhp శక్తిని మరియు 696Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది కేవలం 4.8 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్‌పై కొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ మొత్తం డ్రైవింగ్ రేంజ్ 470 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

MOST READ: ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

ఈ జాగ్వార్ కారుకి పెట్రోల్ అవరసం లేదు! ఎందుకలా?

కొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

జాగ్వార్ నుంచి రాబోతున్న ఈ 2021 ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ గణనీయంగా మెరుగుపరిచింది. ఇప్పుడు ఇది మెరుగైన ఛార్జింగ్ ఆప్షన్స్‌తో లభ్యం కానుంది, ఫలితంగా కొన్ని గంటల వ్యవధి చార్జింగ్‌తో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. జాగ్వార్ ఐ-పేస్ భారత మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లో మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న ఇక్యూసి మరియు ఆడి నుంచి రానున్న ఇ-ట్రోన్‌ మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Jaguar Land Rover has globally unveiled the 2021 I-Pace electric-SUV. The all-electric SUV features a host of upgrades over the previous-generation model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X