బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది జేమ్స్ బాండ్ సినిమాలే. ఆస్టన్ మార్టిన్ ఇప్పుడు చిన్నారుల కోసం ఓ బుజ్జి ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఇందుకోసం 'ది లిటిల్ కార్ కంపెనీ' అనే సంస్థతో ఆస్టన్ మార్టిన్ చేతులు కలిపింది. కంపెనీ అందిస్తున్న పాపులర్ డిబి5 మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ చిన్న టూ-థర్డ్ స్కేల్ సైజ్ మోడల్‌ను తయారు చేసింది.

బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

ఈ స్కేల్ మోడల్ సాధ్యమైనంత వరకూ స్టాండర్డ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారులో ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ఒరిజినల్ మోడల్ యొక్క 3D స్కాన్ ఉపయోగించి ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్ కారును తయారు చేశారు.

బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

‘ది లిటిల్ కార్ కంపెనీ' పేర్కొన్న సమాచారం ప్రకారం, ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్ కారును నిర్మించడానికి దాదాపు 15 నెలలు పట్టింది. ఈ జూనియర్ కారులో ఒరిజినల్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారులోని అన్ని అంశాలు ఉంటాయి. డిబి5 జూనియర్ 1.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో నడుస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 6.7 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది, ఇది వెనుక చక్రాలకు పంపబడుతుంది. డిబి5 జూనియర్ గరిష్టంగా గంటకు 35 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

MOST READ:45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

డిబి5 జూనియర్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌ను బోనెట్ క్రింద అమర్చబడి ఉంటుంది. ఇది వేరు చేయగలిగిన బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జీపై గరిష్టంగా 25 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. బ్రేకింగ్ కోసం వెంటిలేటెడ్ డిస్క్‌లను అమర్చారు. వీటిని 10 ఇంచ్ చక్రాలపై అమర్చారు.

బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

కొలతల పరంగా చూస్తే, ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్ మొత్తం 3 మీటర్ల పొడవు మరియు 1.1 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. డిబి5 జూనియర్ కారులో ఒక పెద్ద వ్యక్తి మరియు ఒక చిన్నారి పక్కపక్కనే సులభంగా కూర్చునేంత స్థలం ఉంటుంది. డిబి5 జూనియర్ బాడీని అల్యూమినియం హనీకోంబ్ ఛాస్సిస్ మరియు మిశ్రమ పదార్థాలను ఉపయోగించి తయారు చేశారు. ఫలితంగా దీని మొత్తం బరువును 270 కిలోలు మాత్రమే ఉంటుంది.

MOST READ:ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులపై ప్రతీకారం తీర్చుకున్న ఇ-బోర్డు ఉద్యోగి, ఎలాగో తెలుసా

బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్ కారును అల్యూమినియం బిల్లెట్ పెడల్స్‌ను ఉపయోగించి యాక్సిలరేషన్, బ్రేకింగ్‌లను నియంత్రించవచ్చు. ఇందులో ఒరిజినల్ సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది, ముందు భాగంలో డబుల్-విష్బోన్ రూపంలో అమర్చబడి ఉంటుంది.

బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

డిజైన్ మరియు ఫీచర్లను గమనిస్తే, ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్ ఎలక్ట్రిక్ కారులో బ్రాండ్ యొక్క ఐకానిక్ ‘ఆస్టన్ మార్టిన్ వింగ్స్' షీల్డ్ మరియు డిబి5 బ్యాడ్జ్‌లతో అసలైనదిగా కనిపిస్తుంది. ఐకానిక్ 1963 మోడల్‌తో సరిపోలే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది, అయితే ఇందులో కొన్ని మార్పులు చేయబడ్డాయి.

MOST READ:ఈ బుల్లెట్ బాయ్ మామూలోడు కాదు: 11 నెలల్లో 101 తప్పులు; రూ.57,200 ఫైన్

బుజ్జాయిల కోసం బుజ్జి జేమ్స్ బాండ్ కార్

ఇందులో ఫ్యూయెల్ గేజ్ స్థానంలో బ్యాటరీ మీటర్ ఉంటుంది. ఆయిల్ టెంపరేచర్ గేజ్ ఇప్పుడు బ్యాటరీ టెంపరేచర్‌ను కొలుస్తుంది. మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏమిటంటే, ఇందులో స్మిత్స్ గడియారాన్ని అమర్చి ఉంచడం, ఇది ఒరిజినల్ కారులో మాదిరిగానే అనిపిస్తుంది. అంతే కాకుండా, ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్‌లో వర్కింగ్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లైట్స్, ఇండికేటర్స్ మరియు హారన్ ఉంటాయి.

ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్ ఎలక్ట్రిక్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బ్రిటీష్ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న పాపులర్ మోడళ్లలో దశాబ్ధాల చరిత్ర కలిగిన డిబి5 మోడల్ అత్యంత ప్రసిద్ధి చెందిన మోడళ్లలో ఒకటిగా ఉంది. ఈ కారును మనం ఇప్పటికే అనేక జేమ్స్ బాండ్ చిత్రాలలో చూసుంటాం. ఈ చిత్రాల వలన ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ మరింత ప్రాచుర్యం పొందింది. తాజాగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ డిబి5 జూనియర్ ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది మరియు ఇతరుల దృష్టిని తమ వైపుకు తిప్పుకునేలా చేస్తుంది.

Most Read Articles

English summary
Aston Martin has collaborated with 'The Little Car Company' to unveil the DB5 Junior. The Aston Martin DB5 Junior is a two-thirds scale electric model of the vintage classic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X