జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని జనవరి 23, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా, టీమ్ బిహెచ్‌పి ఫోరమ్‌లో పోస్ట్ చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం, జీప్ ఇండియా ఇప్పటికే తమ కొత్త 2021 కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ముంబై మరియు బెంగళూరులోని డీలర్‌షిప్ కేంద్రాల్లో అనధికారిక బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

ఈ అమెరికన్ బ్రాండ్ తమ కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో జరిగిన 2020 గ్వాంగ్‌జౌ ఇంటర్నేషనల్ మోటార్ షోలో తొలిసారిగా ప్రదర్శించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కంపాస్‌తో పోల్చుకుంటే ఈ కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలోని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

ముందుగా ఎక్స్టీరియర్ మార్పులను గమనిస్తే, కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంటుంది. అలాగే, ఇందులో ఫ్రంట్ గ్రిల్‌ను కూడా కొద్దిగా రీడిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది సిగ్నేచర్ 7 స్లాట్ వెర్టికల్ గ్రిల్‌ను అలానే ముందుకు తీసుకువెళుతుంది.

MOST READ:ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఫాగ్ లాంప్స్ కోసం కొత్త హౌసింగ్ మరియు మధ్యలో కొత్తగా రూపొందించిన ఎయిర్ ఇన్‌టేక్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ఉంటుంది. అలాగే, సైడ్ మరియు వెనుక ప్రొఫైల్స్‌ను గమనిస్తే, కొత్త అల్లాయ్ వీల్స్, కొద్దిగా ట్వీక్ చేసిన టెయిల్ లైట్స్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటిని గమనించవచ్చు.

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్స్‌లో కొత్తగా అనేక మార్పులు కనిపించనున్నాయి. కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ముఖ్యంగా ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను జోడించారు. క్యాబిన్ లోపల చుట్టూ సాఫ్ట్‌-టచ్ మెటీరియల్స్‌ను అమర్చారు.

మునుపటి కన్నా ఈ క్యాబిన్ మరింత ప్రీమియం టచ్ అండ్ ఫీల్ అనుభూతిని అందిస్తుంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్, లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

ఇక ఇంజన్ పరంగా కొత్త జీప్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇంజన్ ఆప్షన్లను అలానే కొత్త 2021 కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలోను కొనసాగించనున్నారు. వాటి పవర్ మరియు టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.

ప్రస్తుతం జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 163 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0-లీటర్ డీజిల్ యూనిట్ కూడా 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కాకపోతే, పెట్రోల్ వేరియంట్లు మాత్రం ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. కాగా, డీజిల్ ఇంజన్ కోసం ఆప్షనల్ నైన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

MOST READ:భారత్‌లో బెస్ట్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టాప్-5 సేఫెస్ట్ కార్స్ ఇవే..

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

భారత మార్కెట్లో జీప్ కంపాస్ 2017 నుండి విక్రయానికి ఉంది మరియు ఇది బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా కొనసాగుతోంది. అయితే, జీప్ కంపాస్‌లో స్పెషల్ ఎడిషన్ మినహా కంపెనీ ఇందులో ఇప్పటి వరకూ ఎలాంటి మేజర్ అప్‌గ్రేడ్స్ చేయలేదు.

జనవరిలో విడుదల కానున్న సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

ఈ నేపథ్యంలో, కొత్తగా వస్తున్న 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ కంపెనీ అమ్మకాలను మరింత మెరుగుపరచే అవకాశం ఉంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ జీప్ కంపాస్ మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఇది ఈ విభాగంలో స్కోడా నుండి రాబోయే విజన్ ఇన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

Most Read Articles

English summary
Jeep To Launch New Compass Facelift In India Next Year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X