జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఈ కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ జనవరి 7, 2021వ తేదీన భారత్‌లో ఆవిష్కరించనుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ కోసం జీప్ ఇండియా డీలర్లు ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించారు. జీప్ తమ కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో జరిగిన 2020 గ్వాంగ్‌జౌ ఇంటర్నేషనల్ మోటార్ షోలో తొలిసారిగా ప్రదర్శించింది.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కంపాస్‌తో పోల్చుకుంటే ఈ కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలోని ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్లలో అనేక మార్పులు చేర్పులు చేసింది. ఎక్స్టీరియర్ మార్పులలో కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంటుంది.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

అంతేకాకుండా, ఇందులో ఫ్రంట్ గ్రిల్‌ను కూడా కొద్దిగా రీడిజైన్ చేశారు. అయితే, ఇందులో జీప్ సిగ్నేచర్ 7 స్లాట్ వెర్టికల్ గ్రిల్‌ను యధావిధిగా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో ఫాగ్ లాంప్స్ కోసం కొత్త హౌసింగ్ మరియు మధ్యలో కొత్తగా రూపొందించిన ఎయిర్ ఇన్‌టేక్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, కొద్దిగా ట్వీక్ చేసిన టెయిల్ లైట్స్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

కొత్త 2021 జీప్ కంపాస్ ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్, లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

ఇంజన్ పరంగా కొత్త జీప్ కంపాస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్న ఇంజన్ ఆప్షన్లనే కంపెనీ కొత్త 2021 కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలోను కొనసాగించనుంది మరియు వాటి పవర్ మరియు టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

ప్రస్తుతం జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 163 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0-లీటర్ డీజిల్ యూనిట్ కూడా 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కాకపోతే, పెట్రోల్ వేరియంట్లు మాత్రం ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. కాగా, డీజిల్ ఇంజన్ కోసం ఆప్షనల్ నైన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

జనవరి 7న కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ - వివరాలు

జీప్ ఇండియా తమ కంపాస్ ఎస్‌యూవీని 2017 నుండి భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది ఈ విభాగంలో స్కోడా నుండి రాబోయే విజన్ ఇన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త జీప్ కంపాస్ ధర రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, December 28, 2020, 17:25 [IST]
English summary
New 2021 Jeep Compass Facelift India Launch Date Revealed. Read in Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+