భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

అమెరికాకు చెందిన పాపులర్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్, భారత మార్కెట్ కోసం మరో కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిపిప్ జీప్ కంపాస్ ఎస్‌యూవీలో 'నైట్ ఈగల్' పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను జీప్ ప్రవేశపెట్టింది.

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న లాంగిట్యూడ్ వేరియంట్‌పై ఆధారపడి తయారు చేశారు. స్టాండర్డ్ జీప్ కంపాస్ మోడళ్లతో పోల్చుకుంటే వేరుగా కనిపించేందుకు గాను ఈ నైట్ ఈగల్ వేరియంట్‌లో అనేక కాస్మోటిక్ మార్పులు చేశారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జీప్ కంపాస్ ఎస్‌యూవీ యొక్క మొట్టమొదటి గ్లోబల్ లిమిటెడ్ ఎడిషన్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఇప్పటికే బ్రెజిల్ మరియు యుకెతో సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో ఒకే నేమ్‌ప్లేట్‌తో (నైట్ ఈగల్ పేరుతో) విడుదలైంది.

MOST READ:ప్రస్తుతానికి ఇంతే, 300 ఈ-బస్సులు ఇప్పట్లో లేనట్లే!

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

ఈ స్పెషల్ ఎడిషన్ కారులో చేసిన కొన్ని ఎక్స్‌టీరియర్ మార్పులను గమనిస్తే, వెలుపలివైపు ఉన్న ట్రిమ్‌ల మొత్తాన్ని నిగనిగలాడే బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో డిజైన్ చేశారు. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లాంప్ బెజెల్స్, ముందు భాగంలో జీప్ యొక్క మోనికర్ చుట్టూ ఉండే ప్రాంతం మరియు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అన్నింటినీ షైనీ బ్లాక్ కలర్‌లో ఫినిషింగ్ చేశారు.

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

ఈ లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ నైట్ ఈగల్ క్యాబిన్‌లో కూడా దాని ప్రత్యేకతను తెలియజేసేలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఎయిర్‌కాన్ వెంట్స్‌తో పాటు నిగనిగలాడే బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన సెంటర్ కన్సోల్‌తో ఇది ఆల్-బ్లాక్ థీమ్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:మొబైల్ సర్వీస్ యూనిట్లను ప్రారంభించిన రాయల్ ఎన్ఫీల్డ్

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

సీటింగ్ కూడా బ్లాక్ కలర్‌లోనే ఉంటుంది. హనీకోంబ్ ప్యాటర్న్‌తో ఆల్-బ్లాక్ సీట్ అప్‌హోలెస్ట్రీతో ప్రీమియం లెథర్ సీట్లను తయారు చేశారు. ఈ కారులో ఆటోమేటిక్ జెనాన్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రోక్రోమిక్ రియర్-వ్యూ మిర్రర్‌, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి మార్పులు ఉన్నాయి.

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

ఈ లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ నైట్ ఈగల్ మోడల్ ప్రత్యేకతను తెలియజేసేలా, థీమ్‌కు తగినట్లుగానే కొత్త ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌తో ఆఫర్ చేస్తున్నారు. ఈ పెయింట్ స్కీమ్ నైట్ ఈగల్ మోడల్ యొక్క థీమ్‌తో సరిపోయేలా బ్రిలియంట్ బ్లాక్, ఎగ్జోటిక్ రెడ్, మాగ్నాయిస్ గ్రే, ఎగ్జోటికా రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు.

MOST READ:భారత అమ్ములపొదలో చేరిన మరో బ్రహ్మాస్త్రం : రాఫెల్ ఫైటర్ జెట్స్

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో కొత్తగా 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లతో పాటుగా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేయనుంది. ఇంకా ఇందులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

ఇంకా ఉందులో పుష్ బటన్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్, పవర్ విండోస్, పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్, యుఎస్‌బి మరియు ఆక్స్ ఇన్పుట్, కూల్డ్ గ్లౌవ్ బాక్స్ వంటి కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, నాలుగు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా, చైల్డ్ సేఫ్టీ లాక్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డబుల్ క్రాంక్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ-థెఫ్ట్ పరికరం వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులోని 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 160 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది, మరియు 2.0-లీటర్ డీజిల్ యూనిట్ 173 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్నాయి.

భారత్‌లో జీప్ కంపాస్ నైట్ ఈగల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు

జీప్ కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్‌ను కేవలం 250 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. మార్కెట్లో వీటి ధరలు రూ.20.14 లక్షల నుంచి రూ.23.31 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉన్నాయి.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటం ఈ బ్రాండ్‌కు ఇదే మొట్టమొదటి సారి కావటం విశేషం. ఇండియాలో ఇవి కేవలం 250 కార్లు మాత్రమే లభ్యం కానున్నాయి. ఇది ఈ సెగ్మెంట్లో టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
American auto manufacturer Jeep has just launched the Compass Night Eagle Edition in India at a starting price of Rs 20.14 lakh, ex-showroom. The vehicle is meant to take on the Tata Harrier Dark Edition. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X