జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

అమెరికాకు చెందిన పాపులర్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్, భారత మార్కెట్ కోసం మరో కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను పరిచయం చేయబోతోంది. కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిపిప్ జీప్ కంపాస్ ఎస్‌యూవీలో 'నైట్ ఈగల్' పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను జీప్ పరిచయం చేయనుంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్ ఇమేజ్‌ని కూడా విడుదల చేసింది.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

కంపాస్ ఎస్‌యూవీ యొక్క మొట్టమొదటి గ్లోబల్ లిమిటెడ్ ఎడిషన్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఇప్పటికే బ్రెజిల్ మరియు యుకెతో సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో ఒకే నేమ్‌ప్లేట్‌తో (నైట్ ఈగల్ పేరుతో) విడుదలైంది. మన దేశంలో ఇది ఈ సంవత్సరంలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

కంపెనీ నుంచి రాబోయే ఈ జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న లాంగిట్యూడ్ వేరియంట్‌పై ఆధారపడి తయారు చేసే అవకాశం ఉంది. స్టాండర్డ్ జీప్ కంపాస్ మోడళ్లతో పోల్చుకుంటే వేరుగా కనిపించేందుకు గాను ఈ నైట్ ఈగల్ వేరియంట్‌లో అనేక కాస్మోటిక్ మార్పులు చేసే అవకాశం ఉంది.

MOST READ:టాటా కార్లపై జులై నెల ఆఫర్లు - క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

ఇందులో చేయబోయే కొన్ని ఎక్స్‌టీరియర్ మార్పులలో, వెలుపలివైపు ఉన్న ట్రిమ్‌ల మొత్తాన్ని నిగనిగలాడే బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో ఆఫర్ చేయనున్నారు. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లాంప్ బెజెల్స్, ముందు భాగంలో జీప్ యొక్క మోనికర్ చుట్టూ ఉండే ప్రాంతం మరియు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అన్నింటినీ షైనీ బ్లాక్ కలర్‌లో ఫినిషింగ్ చేయనున్నారు.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

ఈ లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ నైట్ ఈగల్ క్యాబిన్‌లో కూడా దాని ప్రత్యేకతను తెలియజేసేలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఎయిర్‌కాన్ వెంట్స్‌తో పాటు నిగనిగలాడే బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన సెంటర్ కన్సోల్‌తో ఇది ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

MOST READ:ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

సీటింగ్ కూడా బ్లాక్ కలర్‌లోనే ఉంటుంది. ఆల్-బ్లాక్ సీట్ అప్‌హోలెస్ట్రీతో ప్రీమియం లెథర్ సీట్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆటోమేటిక్ జెనాన్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రోక్రోమిక్ రియర్-వ్యూ మిర్రర్‌తో పాటు సౌండ్ సిస్టమ్‌ను మరింత ప్రీమియం సౌండింగ్ యూనిట్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చని అంచనా.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

ఈ లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ నైట్ ఈగల్ మోడల్ ప్రత్యేకతను తెలియజేసేలా, థీమ్‌కు తగినట్లుగానే కొత్త ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌తో దీన్ని ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ పెయింట్ స్కీమ్ నైట్ ఈగల్ మోడల్ యొక్క థీమ్‌తో సరిపోయేలా నల్లని షేడ్స్ అయి ఉండొచ్చని అంచనా.

MOST READ:కరోనా నివారణ కోసం మరో కొత్త చర్య తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ; అదేంటో తెలుసా

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

ఈ కొత్త మోడల్‌లో పైన పేర్కొన్న మార్పులే కాకుండా, స్టాండర్డ్ జీప్ కంపాస్ మోడల్‌లో ఉపయోగించిన అన్ని ఇతర పరికరాలు కూడా నైట్ ఈగల్‌లో కొనసాగుతాయి. ఇందులో 8.4 ఇంచ్ యు-కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్స్, సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉంటాయి.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులోని 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 160 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది, మరియు 2.0-లీటర్ డీజిల్ యూనిట్ 173 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇందులో పెట్రోల్ ఇంజన్లలో ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్, డీజిల్ ఇంజన్లలో నైన్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ టీజర్; త్వరలో విడుదల - వివరాలు

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

జీప్ కంపాస్ నైట్ ఈగల్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటం ఈ బ్రాండ్‌కు ఇదే మొట్టమొదటి సారి కావటం విశేషం. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ దాని విశిష్టమైన ఫీచర్లతో ఇతర కంపాస్ మోడళ్ల కన్నా విభిన్నంగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep is gearing up to launch a new special edition variant of the Compass SUV. Called the 'Night Eagle', has been teased and will be a limited time special edition model that is expected to launch sometime this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X